Top 5 This Week

Related Posts

IPLపై హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు.. మళ్లీ బరిలోకి దిగుతాడా?

IPL కు దూరమైన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్.. భవిష్యత్తులో మళ్లీ IPL లో ఆడే అవకాశం ఉందా? దీనిపై తాజాగా అతడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. హ్యారీ బ్రూక్‌ను 2024 IPL మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 6.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే 2025 IPL లో బ్రూక్ ఆడలేదు. అంతకుముందు కూడా IPL నుంచి తప్పుకోవడంతో.. I P L గవర్నింగ్ కౌన్సిల్ అతనిపై రెండేళ్ల నిషేధం విధించింది. దీంతో బ్రూక్ 2028 IPL వేలంలో మాత్రమే తిరిగి వచ్చే అవకాశం ఉంది.

అయితే ఇప్పుడు IPL లో తన రీఎంట్రీ గురించి బ్రూక్ ఏం చెప్పాడనేదే అసలు ఆసక్తికరమైన విషయము. IPL గురించి మాట్లాడుతూ.. ఇది చాలా గొప్ప టోర్నమెంట్ అని, అక్కడ ఆడటం వల్ల మంచి అనుభవం వస్తుందని బ్రూక్ చెప్పాడు. IPL లో ఆడిన తర్వాత మరింత మెరుగైన ఆటగాడిగా తిరిగి వస్తామని కూడా అన్నాడు. అంతేకాదు.. భవిష్యత్తులో IPL లో మళ్లీ ఆడే విషయాన్ని తప్పకుండా ఆలోచిస్తానని బ్రూక్ స్పష్టం చేశాడు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయము ఉంది. గతంలో బ్రూక్ మాత్రం తాను ఇంగ్లండ్ క్రికెట్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టానని చెప్పాడు.

ది హండ్రెడ్ మినహా మరే ఫ్రాంచైజీ క్రికెట్ ఆడకూడదని కూడా అప్పట్లో వెల్లడించాడు. ప్రస్తుతం కూడా తన ప్రధాన లక్ష్యం ఇంగ్లండ్ తరఫున వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడటమే అని బ్రూక్ చెబుతున్నాడు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని కూడా చెప్పాడు. ఇక బ్రూక్ IPL లో కొత్త ఆటగాడు కాదు. 2023 సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ తరఫున సెంచరీ చేసి.. IPL లో సెంచరీ చేసిన ఐదో ఇంగ్లండ్ బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం బ్రూక్ ది హండ్రెడ్‌లో సన్‌ రైజర్స్ లీడ్స్ తరఫున ఆడుతున్నాడు.

ఈ జట్టు గత సీజన్ తర్వాత బ్రూక్‌ను 4 లక్షల 65 వేల పౌండ్లకు రిటైన్ చేసుకుంది. అయితే ఈ జట్టుకు బ్రూక్ ఇక కెప్టెన్‌గా కొనసాగడం లేదు. ప్రస్తుతం జాక్ క్రాలీ జట్టును నడిపిస్తున్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై కూడా బ్రూక్ స్పందించాడు. మొదటి మ్యాచ్‌కు ముందు తనకు జట్టుతో కలిసి ఒక్క ట్రైనింగ్ సెషన్ కూడా చేయలేకపోయానని చెప్పాడు. అందుకే ఆటగాళ్లను వ్యక్తిగతంగా, ఆట పరంగా పూర్తిగా తెలుసుకోకుండానే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడం కష్టమని భావించినట్లు తెలిపాడు.

ఇక కొత్త కెప్టెన్ జాక్ క్రాలీ ఆటలో చాలా ప్రశాంతంగా వ్యవహరిస్తున్నాడని బ్రూక్ ప్రశంసించాడు. ముఖ్యంగా మ్యాచ్ మధ్యలో అతను తీసుకుంటున్న నిర్ణయాలు, మైదానంలో అతని కంట్రోల్ అద్భుతంగా ఉందని చెప్పాడు. మొత్తానికి ప్రస్తుతం బ్రూక్ ఫోకస్ మొత్తం ఇంగ్లండ్ క్రికెట్‌పైనే ఉంది. కానీ 2028 లో IPL లోకి తిరిగి వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తోంది.

మరి హ్యారీ బ్రూక్ నిజంగానే 2028 IPL లోకి తిరిగి వస్తాడా? వస్తే ఏ జట్టు అతన్ని కొనుగోలు చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. “ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles