క్రికెట్ ప్రపంచంలో ఎందరో లెజెండ్స్ వచ్చారు…
కానీ ఒక ఆటగాడు మాత్రం తన ఆటతోనే కాదు… తన aggression, passion, fitness, గెలవాలనే తపనతో కోట్లాది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.
ఢిల్లీ వీధుల్లో బ్యాట్ పట్టుకుని కలలు కనిన ఒక చిన్న అబ్బాయి…
ఈ రోజు ప్రపంచ క్రికెట్ను శాసించిన కింగ్ కోహ్లీ గా ఎలా మారాడు?
ఇది కేవలం ఒక cricketer కథ కాదు…
బాధను బలంగా మార్చుకున్న ఒక యోధుడి కథ.
ఓటమి ఎదురైనా మళ్లీ లేచిన విజేత కథ. ఇదే… విరాట్ కోహ్లీ జీవితం.
1988 నవంబర్ 5న ఢిల్లీలోని ఒక సాధారణ పంజాబీ కుటుంబంలో విరాట్ కోహ్లీ జన్మించాడు. అతని తండ్రి ప్రేమ్ కోహ్లీ ఒక క్రిమినల్ లాయర్. తల్లి సరోజ్ కోహ్లీ గృహిణి. విరాట్కు ఒక అన్నయ్య వికాస్ కోహ్లీ, ఒక అక్క భావనా కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచే విరాట్ ఇంట్లో అందరికీ చాలా దగ్గరగా ఉండేవాడు. కుటుంబ సభ్యులు కూడా అతన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు.
విరాట్ చిన్నప్పటి నుంచే చాలా ఎనర్జిటిక్. ఇంట్లో ఎక్కువసేపు ఒకచోట కూర్చునేవాడు కాదు. టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తే పూర్తిగా మునిగిపోయి చూసేవాడు. ముఖ్యంగా భారత జట్టు మ్యాచ్లంటే అతనికి పిచ్చి. బ్యాట్ చేతిలో పడితే ప్రపంచమే మర్చిపోయేవాడు. చిన్న వయసులోనే ఇంట్లో ప్లాస్టిక్ బ్యాట్తో గంటల తరబడి క్రికెట్ ఆడేవాడు.
అతని కుటుంబ సభ్యులు ఒక విషయం త్వరగానే గుర్తించారు — విరాట్కు క్రికెట్ అంటే కేవలం ఇష్టం కాదు… అది అతని జీవితం. అందుకే అతని తండ్రి ప్రేమ్ కోహ్లీ, చిన్న వయసులోనే అతన్ని సరైన ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
అప్పుడు విరాట్ వయసు కేవలం తొమ్మిదేళ్లు మాత్రమే. అతన్ని వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేర్పించారు. అక్కడే మొదలైంది ఒక గొప్ప ప్రయాణం. మొదటి రోజుల్లోనే కోచ్లు విరాట్లోని టాలెంట్ను గుర్తించారు. ఎందుకంటే అతను మిగతా పిల్లలలా సరదాగా ఆడేవాడు కాదు. ప్రతి బంతిని సీరియస్గా తీసుకునేవాడు. ఓడిపోతే చాలా బాధపడేవాడు. గెలిస్తే మాత్రం ఆ ఆనందాన్ని పూర్తిగా ఎంజాయ్ చేసేవాడు.
చిన్నప్పటి నుంచే విరాట్లో ఒక ప్రత్యేకమైన aggression కనిపించేది. అతనికి ఓటమి అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. practice sessions లో కూడా ఎప్పుడూ best ఇవ్వడానికి ప్రయత్నించేవాడు. కోచ్లు చెప్పిన ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా వినేవాడు. అదే dedication తర్వాత అతన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది.
విరాట్ తన స్కూల్ చదువును Vishal Bharti Public School లో ప్రారంభించాడు. కానీ క్రికెట్పై ఎక్కువ focus పెట్టడానికి తర్వాత Savior Convent School కి మారాడు. ఎందుకంటే అక్కడ sports కి ఎక్కువ importance ఉండేది. చదువుతో పాటు క్రికెట్ practice కూడా continue చేశాడు.
అతని తండ్రి ప్రేమ్ కోహ్లీ, విరాట్ కెరీర్ కోసం ఎంతో కష్టపడ్డారు. ఉదయం practice కి తీసుకెళ్లడం… మ్యాచ్లకు support చేయడం… ఎప్పుడూ motivate చేయడం — ప్రతి విషయంలో తన కొడుకుతో ఉండేవారు. విరాట్ జీవితంలో అతని తండ్రి influence చాలా పెద్దది. విరాట్ కూడా ఎన్నోసార్లు చెప్పాడు — “నా జీవితంలో మొదటి hero నా నాన్న” అని.
చిన్నప్పటి నుంచే విరాట్కు ఒక కల ఉండేది — ఒకరోజు భారత జట్టు జెర్సీ వేసుకుని దేశం కోసం ఆడాలి. ఆ కల కోసం అతను ఎంతో కష్టపడ్డాడు. ఇతర పిల్లలు holidays enjoy చేస్తున్న సమయంలో కూడా విరాట్ practice ground లో చెమటోడ్చేవాడు.
అతని బాల్యం సాధారణంగా కనిపించినా… అతని కలలు మాత్రం చాలా పెద్దవి. అదే చిన్న అబ్బాయి… తర్వాత ప్రపంచ క్రికెట్ను శాసించే కింగ్ కోహ్లీ గా మారాడు.
2006 సంవత్సరం… విరాట్ కోహ్లీ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంవత్సరం. అప్పటికి విరాట్ ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. అతను క్రికెట్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన కలలకు దగ్గరవుతున్న సమయం అది. కానీ అదే సమయంలో అతని జీవితంలో ఒక పెద్ద విషాదం చోటుచేసుకుంది.
డిసెంబర్ 18, 2006 రాత్రి… విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆ వార్త విన్న వెంటనే విరాట్ కుటుంబం మొత్తం షాక్లోకి వెళ్లిపోయింది. ఎందుకంటే ప్రేమ్ కోహ్లీ కేవలం తండ్రి మాత్రమే కాదు… విరాట్ క్రికెట్ ప్రయాణానికి పెద్ద బలం. చిన్నప్పటి నుంచి ప్రతి practice session కి తీసుకెళ్లింది ఆయనే. తన కొడుకు ఒకరోజు భారత జట్టు కోసం ఆడాలని కలలు కన్నది కూడా ఆయనే.
ఆ సమయంలో విరాట్ కేవలం 18 ఏళ్ల యువకుడు మాత్రమే. సాధారణంగా అలాంటి పరిస్థితిలో ఎవరికైనా మానసికంగా కుంగిపోవడం సహజం. కానీ విరాట్ జీవితంలో అసలు turning point అక్కడే వచ్చింది.
తండ్రి మరణించిన మరుసటి రోజే ఢిల్లీ జట్టు తరఫున కర్ణాటకపై రంజీ మ్యాచ్ కొనసాగుతోంది. జట్టు కష్టాల్లో ఉంది. చాలా మంది “విరాట్ ఇక మ్యాచ్ ఆడడు” అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ విరాట్ మైదానంలోకి దిగాడు.
అతను కేవలం batting చేయడానికి మాత్రమే రాలేదు… తన బాధను బలంగా మార్చుకుని పోరాడేందుకు వచ్చాడు.
ఆ రోజు విరాట్ 90 పరుగులు చేసి ఢిల్లీ జట్టును follow on నుంచి కాపాడాడు. మైదానంలో అతని కళ్లలో బాధ కనిపిస్తున్నా… చేతిలోని బ్యాట్ మాత్రం ఆగలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే చాలామందికి తెలిసింది — అతను తన తండ్రిని కోల్పోయిన పరిస్థితిలో కూడా ఆ ఇన్నింగ్స్ ఆడాడని.
ఆ సంఘటన తర్వాత భారత క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా విరాట్ వైపు చూసింది. ఎందుకంటే అంత చిన్న వయసులోనే , అంత పెద్ద బాధను తట్టుకుని జట్టు కోసం, నిలబడటం సాధారణ విషయం కాదు.
తర్వాత ఒక ఇంటర్వ్యూలో విరాట్ ఇలా చెప్పాడు:
“నా తండ్రి నా biggest support. ఆయన నన్ను ఎప్పుడూ strong గా ఉండాలని నేర్పించారు.”
ఆ రోజు నుంచి విరాట్ జీవితాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోయింది. అతను మరింత కఠినంగా practice చేయడం ప్రారంభించాడు. తన తండ్రి కలను నిజం చేయాలని నిర్ణయించుకున్నాడు.
చాలామంది అభిమానులు ఒక మాట చెబుతారు:
“ఆ రాత్రి ఒక కొడుకు తన తండ్రిని కోల్పోయాడు…
కానీ అదే రాత్రి భారత క్రికెట్ ఒక యోధుడిని పొందింది.”
ఆ సంఘటన విరాట్ కోహ్లీని కేవలం మంచి ఆటగాడిగా కాదు… మానసికంగా ఎంతో బలమైన వ్యక్తిగా మార్చింది. అదే strength తర్వాత ప్రపంచ క్రికెట్లో అతన్ని King Kohli గా నిలబెట్టింది.
తండ్రి మరణం తర్వాత విరాట్ కోహ్లీ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అతను మానసికంగా మరింత బలంగా మారాడు. క్రికెట్పై పూర్తిగా focus పెట్టాడు. అదే dedication అతన్ని భారత Under 19 జట్టుకు తీసుకెళ్లింది.
2008లో మలేషియాలో జరిగిన ICC Under 19 World Cup కి , విరాట్ కోహ్లీ భారత జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. అప్పటికి అతను దేశవ్యాప్తంగా పెద్ద స్టార్ కాదు. కానీ యువ క్రికెట్లో అతని talent, confidence, leadership qualities అందరి దృష్టిని ఆకర్షించాయి. ఎంపికదారులు కూడా అతనిలో భవిష్యత్ భారత కెప్టెన్ను చూశారు.
ఆ టోర్నమెంట్లో విరాట్ కేవలం batsmanగా మాత్రమే కాదు… leader గా కూడా అందరినీ impress చేశాడు. మైదానంలో అతని aggression, teammates కి ఇచ్చే motivation, pressure situations లో తీసుకున్న నిర్ణయాలు — ఇవన్నీ అతన్ని మిగతా ఆటగాళ్ల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టాయి.
భారత జట్టులో తర్వాత international cricket లో పెద్ద పేర్లు అయిన Ravindra Jadeja, Manish Pandey, Siddarth Kaul, Saurabh Tiwary లాంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు. కానీ ఆ జట్టుకు అసలు నాయకుడు మాత్రం విరాట్ కోహ్లీయే.
టోర్నమెంట్ మొత్తం విరాట్ అద్భుతంగా ఆడాడు. 235 పరుగులు చేసి tournament లో top scorers లో ఒకడిగా నిలిచాడు. వెస్టిండీస్పై కేవలం 74 బంతుల్లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ innings ని చాలామంది టోర్నమెంట్లోనే బెస్ట్ innings గా అభివర్ణించారు.
ఫైనల్లో భారత్ సౌత్ ఆఫ్రికాను ఓడించి ప్రపంచకప్ గెలిచింది. వర్షం కారణంగా మ్యాచ్ Duckworth Lewis విధానంలో ముగిసినా… ట్రోఫీ మాత్రం భారత జట్టుదే అయింది. ఆ క్షణంలో విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్కు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చాడు —
“భారత క్రికెట్ భవిష్యత్తు వచ్చేసింది.”
ఆ వరల్డ్ కప్ తర్వాత విరాట్ జీవితం పూర్తిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా అతని పేరు వినిపించడం ప్రారంభమైంది. అభిమానులు అతన్ని future star గా చూడటం మొదలుపెట్టారు. IPL franchises కూడా అతనిపై దృష్టి పెట్టాయి. తర్వాత అదే సంవత్సరం Royal Challengers Bangalore అతన్ని తమ జట్టులోకి తీసుకుంది.
తర్వాత ఒక interview లో విరాట్ ఇలా చెప్పాడు:
“ఆ Under 19 World Cup నా జీవితాన్ని మార్చేసింది.”
అది నిజమే. ఎందుకంటే ఆ టోర్నమెంట్ కేవలం ఒక trophy మాత్రమే కాదు… ఒక కొత్త యుగానికి ప్రారంభం.
ఆ Under 19 World Cup లో ఆడిన చాలా మంది ఆటగాళ్లు తర్వాత international cricket లో legends గా మారారు. కానీ వారందరిలో ప్రపంచ క్రికెట్ను అత్యంత ప్రభావితం చేసిన పేరు మాత్రం — విరాట్ కోహ్లీ.
చాలామంది అభిమానులు ఒక మాట చెబుతారు:
“2008 లో ప్రపంచం ఒక యువ ఆటగాడిని చూసింది…
కానీ భారతదేశం మాత్రం తన భవిష్యత్ సూపర్ స్టార్ను చూసింది.”
2008 Under-19 World Cup గెలిచిన తర్వాత, విరాట్ కోహ్లీ పేరు భారత క్రికెట్లో ఒక్కసారిగా మార్మోగిపోయింది. అతనిలో talent ఉందని అందరికీ తెలుసు. కానీ అసలు ప్రశ్న ఒక్కటే — “ఈ యువ ఆటగాడు అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించగలడా?”
అదే సమయంలో భారత జట్టులో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఆ జట్టులో చోటు సంపాదించడం చాలా కష్టం. అయినా selectors విరాట్లోని ప్రత్యేకతను గుర్తించారు. అతని confidence, aggression, fearless attitude చూసి… భవిష్యత్తులో భారత జట్టుకు పెద్ద ఆటగాడవుతాడని నమ్మారు.
అలా… 2008 ఆగస్టులో కేవలం 19 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లీకి, భారత జట్టులో అవకాశం వచ్చింది. శ్రీలంక టూర్ కోసం అతన్ని O D I జట్టులో ఎంపిక చేశారు. చాలామందికి అది surprise selection లా అనిపించింది. ఎందుకంటే అప్పటివరకు విరాట్ పెద్ద domestic స్టార్ కాదు. కానీ భారత జట్టు management మాత్రం అతనిలో future champion ని చూసింది.
2008 ఆగస్టు 18… దంబుల్లా స్టేడియం…
అదే రోజు విరాట్ కోహ్లీ తొలిసారి భారత జెర్సీ వేసుకుని మైదానంలోకి అడుగుపెట్టాడు. అది అతని జీవితంలోనే అత్యంత ముఖ్యమైన క్షణం. చిన్నప్పటి నుంచి కన్న కల నిజమైన రోజు.
ఆ మ్యాచ్లో విరాట్ opening batsman గా బరిలోకి దిగాడు. కానీ debute pressure చాలా ఎక్కువగా ఉండింది. శ్రీలంక బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. విరాట్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. భారత జట్టు కూడా ఆ మ్యాచ్లో ఓడిపోయింది. చాలామంది అప్పుడే విమర్శలు చేయడం ప్రారంభించారు. ఇంకా experience లేదు అని మాట్లాడారు.
కానీ విరాట్ అక్కడే ఆగలేదు.
తర్వాతి మ్యాచ్ల్లో క్రమంగా తన ఆటను మెరుగుపరుచుకున్నాడు. నాలుగో O D I లో అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ innings తర్వాత చాలామంది మాజీ ఆటగాళ్లు ఒక మాట చెప్పారు —
“ఈ అబ్బాయిలో something special ఉంది.”
ఆ శ్రీలంక టూర్లో విరాట్ చాలా ముఖ్యమైన విషయంనేర్చుకున్నాడు — international cricket ఎంత కఠినమో. అక్కడ talent ఒక్కటే సరిపోదు. mental strength కూడా కావాలి.
మొదట్లో అతనికి జట్టులో స్థానం స్థిరంగా లేదు. కొన్నిసార్లు అవకాశం వచ్చేది… మళ్లీ bench పై కూర్చోవాల్సి వచ్చేది. ఎందుకంటే భారత జట్టులో అప్పటికే legends ఉన్నారు. కానీ whenever chance వచ్చింది… విరాట్ తన best ఇవ్వడానికి ప్రయత్నించాడు.
2009 లో శ్రీలంకపై కోల్కతాలో విరాట్ తన మొదటి O D I సెంచరీ చేశాడు. 107 పరుగులు చేసి భారత జట్టును విజయం వైపు నడిపించాడు. ఆ మ్యాచ్ తర్వాత ప్రపంచం విరాట్ కోహ్లీని కేవలం యువ ఆటగాడిగా కాదు… భారత క్రికెట్ భవిష్యత్తుగా చూడటం ప్రారంభించింది.
అభిమానులు కూడా అతని batting style కి ఆకర్షితులయ్యారు. ఎందుకంటే విరాట్ ఆటలో ఒక fearless attitude కనిపించేది. pressure ఎంత ఉన్నా… ఎదురుదాడి చేయడం అతని ప్రత్యేకత.
2008లో టీమ్ ఇండియాలో అడుగుపెట్టిన ఆ యువ ఆటగాడు… తర్వాత ప్రపంచ క్రికెట్ను శాసించే కింగ్ కోహ్లీ గా మారాడు.
2011 ICC Cricket World Cup… భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని టోర్నమెంట్. కోట్లాది భారత అభిమానుల 28 ఏళ్ల కల నిజమైన సమయం. అదే వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ జీవితంలో కూడా ఒక పెద్ద turning point అయింది.
అప్పుడు విరాట్ వయసు కేవలం 22 ఏళ్లు మాత్రమే. భారత జట్టులో సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, ధోని, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ లాంటి దిగ్గజాల మధ్య ఒక యువ ఆటగాడిగా చోటు సంపాదించాడు. చాలామంది అభిమానులు అప్పటికీ అతన్ని future star గానే చూస్తున్నారు. కానీ ఈ వరల్డ్ కప్ తర్వాత ప్రపంచం అతన్ని భారత జట్టు భవిష్యత్తుగా గుర్తించింది.
ఈ వరల్డ్ కప్లో విరాట్ మొదటి మ్యాచ్ నుంచే తన ప్రత్యేకతను చూపించాడు. బంగ్లాదేశ్పై జరిగిన opening మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ చేశాడు. కేవలం 83 బంతుల్లో 100 పరుగులు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. వరల్డ్ కప్ debute మ్యాచ్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఆ innings తర్వాత ప్రపంచం ఒక్కసారిగా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడటం ప్రారంభించింది. ఎందుకంటే అంత పెద్ద ICC tournament లో కూడా అతని batting లో fear కనిపించలేదు. pressure ఎంత ఉన్నా confidence మాత్రం తగ్గలేదు.
తర్వాతి మ్యాచ్ల్లో కూడా విరాట్ జట్టుకు కీలక innings లు ఆడాడు. ముఖ్యంగా West Indies పై చేసిన 59 పరుగుల innings , భారత జట్టుకు చాలా ఉపయోగపడింది. ఆ సమయంలో భారత్పై pressure ఎక్కువగా ఉన్నా… విరాట్ maturity తో batting చేశాడు. అభిమానులు కూడా అతన్ని big match player గా చూడటం ప్రారంభించారు.
కానీ అసలు చరిత్ర ఫైనల్లో జరిగింది.
2011 ఏప్రిల్ 2… ముంబైలోని వాంఖడే స్టేడియం…
ప్రపంచం మొత్తం ఆ మ్యాచ్ వైపు చూస్తోంది. శ్రీలంక ఫైనల్లో భారత్కు 275 పరుగుల target ఇచ్చింది. భారత్ innings ప్రారంభమైన వెంటనే సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ wickets కోల్పోయింది. స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. కోట్లాది అభిమానులు tension లోకి వెళ్లిపోయారు.
అలాంటి సమయంలో యువ ఆటగాడు విరాట్ కోహ్లీ మైదానంలోకి వచ్చాడు.
Pressure ఎంత ఉన్నా… విరాట్ భయపడలేదు. గౌతమ్ గంభీర్తో కలిసి అద్భుతమైన partnership నిర్మించాడు. ఇద్దరూ కలిసి 83 పరుగుల partnership చేసి భారత జట్టును తిరిగి మ్యాచ్లోకి తీసుకొచ్చారు. విరాట్ 35 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ 35 పరుగులు భారత జట్టుకు చాలా విలువైనవి. ఎందుకంటే ఆ సమయంలో భారత్కు కావలసింది flashy batting కాదు… stability. అదే విరాట్ ఇచ్చాడు.
తర్వాత ధోని, గంభీర్ మ్యాచ్ను finish చేశారు. ధోని కొట్టిన ఆ iconic six తో భారత్ 28 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలిచింది. ఆ క్షణంలో భారతదేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక emotional moment జరిగింది.
విరాట్ కోహ్లీ, యూసుఫ్ పఠాన్ కలిసి సచిన్ టెండూల్కర్ను , భుజాలపై ఎత్తుకుని స్టేడియం చుట్టూ తిరిగారు. ఎందుకంటే సచిన్ జీవితకాల కల… వరల్డ్ కప్ గెలవడం… చివరకు నిజమైంది.
ఆ వరల్డ్ కప్ విజయం తర్వాత విరాట్ కోహ్లీ జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు promising youngster గా ఉన్న అతను… ఆ తర్వాత భారత క్రికెట్లో కీలక ఆటగాడిగా మారాడు.
చాలామంది అభిమానులు ఒక మాట చెబుతారు:
“2011 వరల్డ్ కప్ భారతదేశానికి ఆనందాన్ని ఇచ్చింది…
కానీ అదే వరల్డ్ కప్ ప్రపంచానికి ఒక future legend ను పరిచయం చేసింది.”
విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితే అతని batting, records, centuries మాత్రమే కాదు… అతని aggression గురించి కూడా తప్పకుండా మాట్లాడాలి. ఎందుకంటే ప్రపంచ క్రికెట్లో విరాట్ను ప్రత్యేకంగా నిలబెట్టిన ప్రధాన లక్షణాల్లో aggression ఒకటి.
చిన్నప్పటి నుంచే విరాట్కు ఓటమి అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. practice match అయినా… international match అయినా… గెలవాలనే తపన మాత్రం ఒకేలా ఉండేది. అదే mentality అతని ఆటలో aggression గా కనిపించింది.
మైదానంలో విరాట్ ఎప్పుడూ full energy తో కనిపించేవాడు. wicket పడినా… catch పట్టినా… సెంచరీ చేసినా… అతని celebrations చాలా intenseగా ఉండేవి. చాలాసార్లు ప్రేక్షకులు కూడా అతని energy చూసి ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే విరాట్ ప్రతి మ్యాచ్ను ఒక యుద్ధంలా తీసుకునేవాడు.
ఆరంభంలో చాలామంది అతని bihavior ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అతను చాలా aggressive, అహంకారి, attitude ఎక్కువ అని విమర్శించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా tours సమయంలో ప్రేక్షకులతో arguments, opposition players తో sledging వల్ల విరాట్ తరచూ వార్తల్లో నిలిచేవాడు.
కానీ విరాట్ అభిమానులు మాత్రం ఒక విషయం బలంగా నమ్మారు —
“అది అహంకారం కాదు…
భారత జట్టును గెలిపించాలనే fire.”
విరాట్ aggression కి ప్రపంచం మొత్తం దృష్టి పెట్టిన ముఖ్యమైన series 2014–15 Australia tour. ఆ టూర్లో ఆస్ట్రేలియా ప్రేక్షకులు, ఆటగాళ్లు ఎంత pressure create చేసినా… విరాట్ మాత్రం fearlessగా ఎదురుదాడి చేశాడు. అదే seriesలో 4 సెంచరీలు చేసి ప్రపంచానికి తన dominance చూపించాడు.
అతని aggression కేవలం మాటల్లో మాత్రమే కాదు… batting లో కూడా కనిపించేది. pressure ఎంత ఎక్కువగా ఉన్నా… విరాట్ వెనక్కి తగ్గేవాడు కాదు. bowler ఎంత dangerous అయినా… ఎదురుదాడి చేయడమే అతని style.
ప్రత్యేకంగా Pakistan, Australia, England వంటి పెద్ద జట్లపై విరాట్ ఆటలో మరో స్థాయి intensity కనిపించేది. అందుకే అభిమానులు అతన్ని big match player అని పిలిచేవారు.
కెప్టెన్ అయిన తర్వాత అతని aggression భారత జట్టు mindset నే మార్చేసింది. ముందు విదేశాల్లో conservative గా ఆడే భారత జట్టు… విరాట్ నాయకత్వంలో aggressive cricket ఆడటం ప్రారంభించింది. ప్రత్యర్థి జట్టును ఎదుర్కొనే confidence పెరిగింది. fast bowlers కి కూడా full support ఇచ్చాడు.
మైదానంలో అతని celebrations కూడా iconic అయ్యాయి.
Century తర్వాత గట్టిగా అరవడం,
Crowd వైపు bat చూపించడం,
Chest thump చేయడం,
Bowlersను hype చేయడం .
ఇవి అభిమానులకు ఒక special emotion గా మారిపోయాయి.
ప్రత్యేకంగా 2022 T twenty World Cup లో Pakistan పై మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ చేసిన celebration అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ రోజు అతని కళ్లలో కనిపించిన emotion… aggression… relief… కోట్లాది అభిమానులను emotional చేసింది.
ఎందుకంటే విరాట్ కోహ్లీ aggression కేవలం emotions కాదు… అది అతని identity.
అదే aggression అతన్ని ordinary player నుంచి world cricket king గా మార్చింది.
విరాట్ కోహ్లీ కెరీర్ గురించి మాట్లాడితే అతని batting, records, aggression మాత్రమే కాదు… అతను భారత క్రికెట్లో తీసుకువచ్చిన fitness revolution గురించి కూడా తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే భారత క్రికెట్లో fitness culture ని పూర్తిగా మార్చిన వ్యక్తి ఎవరు అంటే… చాలామంది ఒక్క పేరే చెబుతారు — విరాట్ కోహ్లీ.
కెరీర్ ప్రారంభంలో విరాట్ కూడా ఇప్పటి లాగే fit గా ఉండేవాడు కాదు. Under 19 రోజులలో అతను junk food చాలా ఇష్టంగా తినేవాడు. Delhi street food అంటే అతనికి చాలా ఇష్టం. కానీ international cricket లోకి వచ్చిన తర్వాత ఒక విషయంఅతనికి అర్థమైంది — ప్రపంచ స్థాయిలో నిలబడాలంటే talent ఒక్కటే సరిపోదు… fitness కూడా equally important.
2012 Australia tour అతని జీవితంలో మరో turning point అయింది. ఆ టూర్లో విదేశీ ఆటగాళ్ల fitness standards చూసి విరాట్ పూర్తిగా మారాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో తన diet, workout, lifestyle అన్నీ మార్చేశాడు.
అతను junk food పూర్తిగా తగ్గించాడు. strict diet follow అవడం ప్రారంభించాడు. regular gym workouts, cardio training, recovery sessions… ఇవన్నీ అతని daily routine లో భాగమయ్యాయి. చాలామంది teammates కూడా ఆశ్చర్యపోయే స్థాయిలో discipline maintain చేసేవాడు.
విరాట్ ఒక interview లో ఇలా చెప్పాడు:
Fitness changed my life and my cricket.
అది నిజమే. ఎందుకంటే fitness తర్వాత అతని batting లో కూడా పెద్ద మార్పు కనిపించింది. ముందుకంటే మరింత fast గా పరుగులు తీయడం, long innings లు ఆడడం, fielding లో lightning speed చూపించడం ప్రారంభించాడు.
ప్రత్యేకంగా అతని running between the wickets ప్రపంచంలోనే best గా మారింది. Single ను double గా మార్చడం… pressure situations లో కూడా అలసిపోకుండా batting చేయడం… ఇవన్నీ fitness వల్లే సాధ్యమయ్యాయి.
విరాట్ కెప్టెన్ అయిన తర్వాత భారత జట్టు culture నే మార్చేశాడు. ముందు fitness పై అంత strict గా ఉండని Team India… విరాట్ నాయకత్వంలో completely different గా మారింది.
జట్టులో స్థానం సంపాదించాలంటే fitness standards తప్పనిసరి చేశాడు. దీంతో భారత ఆటగాళ్లలో discipline మరింత పెరిగింది.
అతన్ని చూసి యువ ఆటగాళ్లు కూడా inspire అయ్యారు.
Hardik Pandya,
KL Rahul,
Shubman Gill,
Mohammed Siraj,
లాంటివారు కూడా fitness పై ఎక్కువ focus పెట్టడం ప్రారంభించారు.
ప్రపంచ క్రికెట్లో కూడా విరాట్ fitness ఒక benchmark గా మారింది.
అతని transformation అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు chubby face తో కనిపించిన యువ ఆటగాడు… తర్వాత six-pack physique తో ప్రపంచానికి fitness icon గా మారాడు.
Social media లో కూడా అతని workout videos, gym sessions, training clips కోట్లాది views సంపాదించాయి. చాలామంది యువత fitness కోసం విరాట్ను role model గా చూడటం ప్రారంభించారు.
ఎందుకంటే విరాట్ కోహ్లీ కేవలం పరుగులు మాత్రమే చేయలేదు… భారత క్రికెట్ mentality నే మార్చేశాడు.
ఈ రోజు Team India ప్రపంచంలో అత్యంత fit జట్లలో ఒకటిగా కనిపిస్తే… దానికి ప్రధాన కారణాల్లో ఒకరు విరాట్ కోహ్లీ.
విరాట్ కోహ్లీ కెరీర్లో batting ఎంత గొప్పదో… అతని captaincy కూడా అంతే ప్రత్యేకం. ఎందుకంటే కెప్టెన్గా విరాట్ భారత జట్టుకు కేవలం విజయాలు మాత్రమే ఇవ్వలేదు… ఒక కొత్త attitude ఇచ్చాడు. ఓటమి ki భయపడని mentality ఇచ్చాడు. ప్రపంచంలోని ఏ జట్టునైనా ఎదుర్కొనే confidence ఇచ్చాడు.
2014లో Australia tour సమయంలో మహేంద్ర సింగ్ ధోని అకస్మాత్తుగా Test captaincy కి retirement ప్రకటించాడు. ఆ సమయంలో భారత జట్టు leadership బాధ్యతలు విరాట్ కోహ్లీ చేతికి వచ్చాయి. అప్పటివరకు అభిమానులు విరాట్ను aggressive batsman గా మాత్రమే చూశారు. కానీ కెప్టెన్గా వచ్చిన తర్వాత అతను తనలోని మరో రూపాన్ని ప్రపంచానికి చూపించాడు.
తన మొదటి Test series లోనే Australia పై అద్భుతమైన batting చేశాడు. Adelaide Test లో రెండు innings ల్లో కూడా సెంచరీలు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా chase సమయంలో draw కోసం కాకుండా win కోసం ఆడించడం అతని aggressive mindset కి పెద్ద ఉదాహరణ.
విరాట్ captaincy లో భారత జట్టులో ఒక పెద్ద మార్పు కనిపించింది — aggression.
ముందు విదేశాల్లో defensive గా ఆడే భారత జట్టు… విరాట్ నాయకత్వంలో fearless cricket ఆడటం ప్రారంభించింది. ప్రత్యర్థి జట్టును dominate చేయడానికి ప్రయత్నించింది. ముఖ్యంగా Australia, England, South Africa వంటి దేశాల్లో కూడా గెలవాలనే mindset పెరిగింది.
కెప్టెన్గా విరాట్కు fast bowling పై ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. “Strong fast bowling attack ఉంటేనే విదేశాల్లో గెలవగలం అని అతను నమ్మేవాడు. అందుకే Jasprit Bumrah, Mohammed Shami, Ishant Sharma, Mohammed Siraj వంటి bowlers కి full support ఇచ్చాడు. అదే తర్వాత భారత జట్టును ప్రపంచంలో అత్యంత dangerous bowling units లో ఒకటిగా మార్చింది.
ప్రత్యేకంగా 2018-19 Australia tour భారత క్రికెట్ చరిత్రలో ఒక historic moment. మొదటిసారి భారత జట్టు Australia లో Test series గెలిచింది. ఆ విజయం కోట్లాది అభిమానులకు గర్వకారణమైంది. చాలామంది మాజీ ఆటగాళ్లు కూడా “ఈ victory భారత Test cricket history ని మార్చేసింది” అన్నారు.
విరాట్ కెప్టెన్సీలో భారత జట్టు:
40 Test victories,
విదేశాల్లో ఎన్నో historic wins,
ICC Test rankings లో Number one స్థానం
సాధించింది.
అతని captaincy style చాలా energetic గా ఉండేది. boundary line దగ్గర fielding చేస్తున్నా… bowlers తో మాట్లాడుతున్నా… wicket పడినప్పుడు celebrate చేస్తున్నా… విరాట్ energy మొత్తం జట్టులోకి వెళ్లేది.
ప్రత్యేకంగా Test cricket పై అతని passion అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ఈ generation లో చాలామంది యువ అభిమానులు Test cricket ని ఇష్టపడటానికి కారణం విరాట్ కోహ్లీయే అని చాలామంది భావిస్తారు.
కానీ కెప్టెన్సీ ప్రయాణం అంత సులభం కాదు. ICC trophies రాకపోవడం వల్ల చాలామంది అతన్ని విమర్శించారు. ముఖ్యంగా ICC knockout మ్యాచ్ల్లో ఓటముల తర్వాత pressure మరింత పెరిగింది. అయినా విరాట్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ప్రతి ఓటమి తర్వాత మరింత aggressive గా తిరిగి వచ్చాడు.
2021లో అతను T twenty captaincy నుంచి తప్పుకున్నాడు. తర్వాత O D I captaincy కూడా ముగిసింది. 2022లో Test captaincy కి కూడా వీడ్కోలు చెప్పాడు. ఆ వార్త అభిమానులను emotional చేసింది.
విరాట్ కోహ్లీ కెప్టెన్గా కేవలం మ్యాచ్లు మాత్రమే గెలవలేదు… భారత క్రికెట్ mentality నే మార్చేశాడు.
ఈ రోజు Team India ప్రపంచంలో ఎక్కడైనా confidence తో ఆడుతుంటే… దాని వెనుక Captain Kohli ప్రభావం చాలా పెద్దది.
అందుకే అభిమానులు ఒక మాట చెబుతారు:
ధోని భారత జట్టుకు calmness ఇచ్చాడు…
కానీ కోహ్లీ భారత జట్టుకు fire ఇచ్చాడు.
విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత aggressiveగా కనిపించినా… వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా emotional మరియు family-oriented వ్యక్తి. అతని జీవితంలో కుటుంబానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా అతని భార్య అనుష్క శర్మ వచ్చిన తర్వాత విరాట్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయని చాలామంది భావిస్తారు.
అనుష్క శర్మ బాలీవుడ్లో ప్రముఖ నటి. విరాట్ మరియు అనుష్క మొదట ఒక advertisement షూట్ సమయంలో కలుసుకున్నారు. ఆ పరిచయం తర్వాత ఇద్దరి మధ్య మంచి friendship ఏర్పడింది. క్రమంగా ఆ friendship ప్రేమగా మారింది.
మొదట్లో వీరిద్దరి relationship గురించి social media లో, news channels లో చాలా చర్చ జరిగింది. కొంతమంది అభిమానులు support చేస్తే… మరికొందరు unnecessary criticism కూడా చేశారు. ముఖ్యంగా విరాట్ bad performance వచ్చినప్పుడు అనుష్కను blame చేయడం కూడా జరిగింది.
కానీ విరాట్ ఎప్పుడూ అనుష్కకు support గా నిలిచాడు. ఒకసారి social media లో అనుష్కపై trolls ఎక్కువయ్యాక విరాట్ openly ఆమెకు support ఇచ్చాడు. అదే సమయంలో అభిమానులు కూడా అతని maturity ని appreciate చేశారు.
2017 డిసెంబర్ 11న ఇటలీలోని Tuscany లో విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ ఎంతో grand గా పెళ్లి చేసుకున్నారు. ఆ wedding photos social media లో sensation అయ్యాయి. కోట్లాది అభిమానులు వారికి wishes చెప్పారు. పెళ్లి తర్వాత విరాట్ జీవితంలో చాలా positive changes వచ్చాయని అతనే చాలాసార్లు చెప్పాడు. pressure situations లో calm గా ఉండటం, life ని different perspective లో చూడటం అనుష్క వల్ల నేర్చుకున్నానని interviews లో చెప్పాడు.
విరాట్ ఒకసారి ఇలా అన్నాడు:
“Anushka helped me become a better person.”
అది అభిమానులను కూడా ఎంతో ఆకట్టుకుంది. ఎందుకంటే మైదానంలో aggressive గా కనిపించే విరాట్… family విషయానికి వచ్చేసరికి చాలా emotional గా కనిపించేవాడు.
2021లో వీరిద్దరికీ ఒక కూతురు జన్మించింది. ఆమెకు “వామిక” అనే పేరు పెట్టారు. ఆ క్షణం విరాట్ జీవితంలో మరో emotional chapter గా మారింది. తండ్రిగా మారిన తర్వాత తన జీవిత priorities కూడా మారిపోయాయని అతను చెప్పాడు.
తర్వాత 2024లో వీరికి కుమారుడు కూడా జన్మించాడు. కుటుంబంతో గడపడం ఇప్పుడు విరాట్ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి అయింది.
మైదానంలో ఎంత busy schedule ఉన్నా… family కి time ఇవ్వడానికి విరాట్ ఎప్పుడూ ప్రయత్నిస్తాడు. విదేశీ tours సమయంలో కూడా అనుష్క, పిల్లలతో spend చేసే moments అభిమానులను ఎంతో ఆకట్టుకుంటాయి.
అంతేకాదు… విరాట్ spiritual side కూడా ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఆలయాలకు వెళ్లడం, ప్రశాంతంగా ఉండడం, mental peace గురించి మాట్లాడడం అభిమానులకు కొత్తగా అనిపించింది. చాలామంది “మునుపటి aggressive Virat ఇప్పుడు mentally much calmer అయ్యాడు” అని భావిస్తున్నారు.
విరాట్ మరియు అనుష్క జంటను అభిమానులు ప్రేమగా “Virushka” అని పిలుస్తారు. భారతదేశంలో అత్యంత popular celebrity couples లో వీరిద్దరూ ఒకరు.
ప్రపంచ క్రికెట్లో ఎంత పెద్ద స్టార్ అయినా… చివరికి విరాట్ కూడా తన కుటుంబాన్ని ప్రేమించే ఒక సాధారణ మనిషే..
ప్రతి గొప్ప ఆటగాడి జీవితంలో ఒక కష్టకాలం తప్పకుండా వస్తుంది. విరాట్ కోహ్లీ జీవితంలో కూడా అలాంటి phase వచ్చింది. ఒకప్పుడు ప్రతి మ్యాచ్లో పరుగుల వర్షం కురిపించిన ఆటగాడు… అకస్మాత్తుగా form కోల్పోయాడు. అదే కాలం విరాట్ జీవితంలో అత్యంత కఠినమైన సమయం.
2019 తర్వాత విరాట్ batting లో consistency తగ్గడం ప్రారంభమైంది. అతను centuries చేయడం ఆగిపోయింది. ఒకప్పుడు century అంటే Virat Kohli అనే స్థాయిలో ఉన్న అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే విరాట్ లాంటి player చాలా కాలం century లేకుండా ఉండటం ఎవ్వరూ ఊహించలేదు.
రోజులు గడిచాయి… నెలలు గడిచాయి… కానీ century మాత్రం రాలేదు.
అదే సమయంలో social media లో తీవ్ర విమర్శలు ప్రారంభమయ్యాయి.
Kohli finished,
అతని prime అయిపోయింది,
ఇప్పటి Virat పాత Virat కాదు,
అని చాలామంది మాట్లాడటం ప్రారంభించారు.
ప్రత్యేకంగా 2020–2021 కాలం విరాట్కు చాలా mentally toughగా మారింది. Bio-bubble cricket, continuous pressure, captaincy burden… ఇవన్నీ అతనిపై తీవ్ర ప్రభావం చూపించాయి. మైదానంలో aggressive గా కనిపించినా… లోపల మాత్రం అతను చాలా mental stress ఎదుర్కొంటున్నాడు.
ఆ సమయంలో విరాట్ ఒక interview లో చాలా emotional గా మాట్లాడాడు. “నేను mentally exhausted అయ్యాను” అని చెప్పాడు. అది విన్న అభిమానులు కూడా shock అయ్యారు. ఎందుకంటే బయటికి strong గా కనిపించే వ్యక్తులు కూడా లోపల ఎంత pain ఎదుర్కొంటారో ప్రపంచం అప్పుడు అర్థం చేసుకుంది.
అంతేకాదు… అదే సమయంలో captaincy కూడా అతని చేతుల నుంచి వెళ్లిపోయింది. ముందుగా T twenty captaincy కి వీడ్కోలు చెప్పాడు. తర్వాత O D I captaincy కూడా ముగిసింది. 2022లో Test captaincy కి కూడా రాజీనామా చేశాడు.
ఒకప్పుడు భారత క్రికెట్ను dominate చేసిన కెప్టెన్… ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
కానీ అక్కడే విరాట్ ప్రత్యేకత కనిపించింది.
అతను ఓటమిని అంగీకరించలేదు.
కొంతకాలం cricket నుంచి break తీసుకున్నాడు. తన mental health పై focus పెట్టాడు. Family తో time spend చేశాడు. మళ్లీ తనలోని hunger ని వెతకడం ప్రారంభించాడు.
2022 Asia Cup లో Afghanistan పై విరాట్ అద్భుతమైన సెంచరీ చేశాడు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వచ్చిన ఆ century చూసి అభిమానులు emotional అయ్యారు. ఎందుకంటే అది కేవలం ఒక century కాదు… King Kohli comeback కి ప్రారంభం.
కానీ అసలు comeback moment 2022 T twenty World Cup లో వచ్చింది.
Pakistan పై జరిగిన మ్యాచ్లో భారత్ almost ఓడిపోయే పరిస్థితిలో ఉంది. కోట్లాది అభిమానులు నిరాశలో ఉన్నారు. అప్పుడు విరాట్ కోహ్లీ ఒక magical innings ఆడాడు.
53 బంతుల్లో 82 పరుగులు chesadu.
Haris Rauf పై కొట్టిన ఆ రెండు sixes ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే iconic shots గా మారిపోయాయి. చివరి వరకు ఒంటరిగా పోరాడి భారత జట్టుకు marchipoleni vijayani అందించాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కళ్లలో కనిపించిన emotions అభిమానులను కూడా emotional చేశాయి. ఆ రోజు ప్రపంచం మరోసారి చూసింది —
“King Kohli is back.”
ఆ comeback తర్వాత విరాట్ మళ్లీ పరుగుల వరద కొనసాగించాడు. 2023 World Cup లో record breaking performance ఇచ్చి ప్రపంచానికి మరోసారి తన greatness చూపించాడు.
ఈ కష్టకాలం విరాట్కు ఒక గొప్ప పాఠం నేర్పింది — talent ఎంత ఉన్నా… జీవితంలో setbacks తప్పవు. కానీ నిజమైన విజేతలు ఓడిపోరు… మళ్లీ లేస్తారు.
2023 O D I వరల్డ్ కప్… భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని టోర్నమెంట్. ఒకవైపు Team India అద్భుతమైన ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తుంటే… మరోవైపు విరాట్ కోహ్లీ తన కెరీర్లోనే అత్యుత్తమ World Cup performance ఇస్తున్నాడు.
ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందే విరాట్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే అతను ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఎన్నో records సృష్టించాడు. కానీ 2023 World Cup లో మాత్రం అతను మరో స్థాయికి వెళ్లిపోయాడు.
టోర్నమెంట్ మొదటి మ్యాచ్లోనే Australia పై భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. Top order త్వరగా wickets కోల్పోయింది. కోట్లాది అభిమానులు tension లోకి వెళ్లిపోయారు. అలాంటి సమయంలో విరాట్ కోహ్లీ calm గా batting చేసి 85 పరుగులు చేశాడు. KL Rahul తో కలిసి match winning partnership నిర్మించి భారత జట్టును ఓటమి నుంచి కాపాడాడు.
ఆ innings తర్వాత అభిమానులు ఒక మాట చెప్పారు:
“Pressure ఎంత పెద్దదైనా…
Virat Kohli అంతకంటే పెద్దవాడు.”
తర్వాత Bangladesh పై విరాట్ అద్భుతమైన సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్లో కూడా chase master లా చివరి వరకు నిలబడి భారత్కు విజయం అందించాడు.
Newz land పై కీలక innings…
Pakistan పై controlled batting…
South Africa పై తన birthday రోజున సెంచరీ…
ఇలా ప్రతి మ్యాచ్లో జట్టుకు backbone లా నిలిచాడు.
ప్రత్యేకంగా South Africa పై చేసిన సెంచరీ చాలా special. ఎందుకంటే అదే అతని 49వ O D I century. ఆ సెంచరీతో Sachin Tendulkar ప్రపంచ రికార్డును సమం చేశాడు. Eden Gardens మొత్తం “Kohli… Kohli…” అంటూ మార్మోగిపోయింది.
కానీ అసలు చరిత్ర semifinalలో జరిగింది.
2023 నవంబర్ 15… ముంబైలోని Wankhede Stadium…
Newz land పై semifinal…
ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేశాడు. అదే అతని O D I career లో 50వ century.
ఆ క్షణంతో Sachin Tendulkar 49 O D eye centuries ప్రపంచ రికార్డును break చేసి… O D I చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచిపోయాడు.
స్టేడియంలో కూర్చున్న సచిన్ టెండూల్కర్ కూడా నిలబడి చప్పట్లు కొట్టాడు. ఆ దృశ్యం చూసి కోట్లాది అభిమానులు emotional అయ్యారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సచిన్ను idol గా చూసిన విరాట్… ఇప్పుడు అతని rikod నే break చేశాడు.
ఆ century తర్వాత విరాట్ కళ్లలో కనిపించిన emotion అభిమానుల హృదయాలను తాకింది.
ఆ World Cup లో విరాట్ మొత్తం:
11 మ్యాచ్లు,
765 పరుగులు,
3 సెంచరీలు,
6 హాఫ్ సెంచరీలు,
చేసి… ఒకే World Cup లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఇంతకుముందు Sachin Tendulkar 2003 World Cup లో చేసిన 673 పరుగుల rikod ను కూడా విరాట్ break చేశాడు.
టోర్నమెంట్ మొత్తం మీద అతని batting consistency unbelievable గా కనిపించింది. Pressure ఎంత ఉన్నా… పెద్ద మ్యాచ్ అయినా… chase అయినా… విరాట్ ఎప్పుడూ జట్టుకు అవసరమైన సమయంలో నిలబడ్డాడు.
అందుకే ICC అతన్ని “Player of the Tournament”గా ప్రకటించింది.
కానీ ఫైనల్లో Australia చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ ఓటమి కోట్లాది అభిమానులను బాధపెట్టింది. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ emotional గా కనిపించాడు. ఎందుకంటే dream World Cup trophy కి భారత్ చాలా దగ్గరగా వెళ్లి ఆగిపోయింది.
ఆ టోర్నమెంట్లో ప్రపంచం మరోసారి చూసింది —
అతని hunger,
అతని consistency,అతని mental strength ,అతని passion.
ఆ World Cup లో విరాట్ కేవలం పరుగులు మాత్రమే చేయలేదు…చరిత్రనే తిరగరాశాడు.
2025లో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ వార్త బయటకు వచ్చిన క్షణంలోనే ప్రపంచ క్రికెట్ ఒక్కసారిగా emotional అయిపోయింది. ఎందుకంటే కోట్లాది అభిమానులకు Test cricket అంటే గుర్తొచ్చే మొదటి పేరు — విరాట్ కోహ్లీ.
14 ఏళ్ల టెస్ట్ కెరీర్లో విరాట్:
123 టెస్ట్ మ్యాచ్లు,
9230 పరుగులు,
30 సెంచరీలు,
40 టెస్ట్ విజయాలు కెప్టెన్గా సాధించాడు.
కానీ విరాట్ Test cricket కు ఇచ్చింది కేవలం records మాత్రమే కాదు… ఒక కొత్త జీవం.
2010 లలో చాలామంది యువ అభిమానులు Test cricket బోరింగ్ అని భావిస్తున్న సమయంలో… విరాట్ దాన్ని passion, aggression, emotion తో నింపాడు. ఐదు రోజుల ఆటలో కూడా ఎంత intensity ఉంటుందో ప్రపంచానికి చూపించాడు.
మైదానంలో అతని celebrations…
wicket పడినప్పుడు కనిపించే fire…
fast bowlers ను motivate చేసే విధానం…
apposition పై aggressive attitude…
ఇవన్నీ అభిమానులకు ఒక unforgettable experience గా మారాయి.
ప్రత్యేకంగా విదేశాల్లో అతని performances Test career లో చాలా special.
2014 Australia tour లో 4 సెంచరీలు…
2018 England tour లో పరుగుల వరద…
South Africa, Australia లో memorable inningsలు…
అతని captaincy లో భారత జట్టు ప్రపంచంలో అత్యంత dangerous Test teams లో ఒకటిగా మారింది.
2018-19 Australia Test series విజయం భారత క్రికెట్ చరిత్రలో ఒక historic moment గా నిలిచిపోయింది. మొదటిసారి భారత్ Australia లో Test series గెలవడం కోట్లాది అభిమానులకు గర్వకారణమైంది.
కానీ విరాట్కు Test cricket కేవలం format కాదు…
అది ఒక emotion.
అందుకే ప్రతి Test match లో కూడా అతను full intensity తో కనిపించేవాడు. చాలామంది మాజీ ఆటగాళ్లు కూడా “ఈ generation లో Test cricketకి biggest ambassador Virat Kohli” అని ప్రశంసించారు.
రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత social media మొత్తం emotional messages తో నిండిపోయింది.
స్టేడియంలో వేలాది మంది కలిసి “కోహ్లీ… కోహ్లీ…” అని అరుస్తున్న ఆ శబ్దం… భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.
రిటైర్మెంట్ తర్వాత విరాట్ ఒక emotional message కూడా share చేశాడు. తన Test journey లో fans, teammates, coaches అందరికీ thanks చెప్పాడు. ముఖ్యంగా తెల్ల జెర్సీ వేసుకుని దేశం కోసం ఆడటం తన జీవితంలో అత్యంత గర్వకారణమని తెలిపాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత dressing roomలో teammates తో emotional moments అభిమానులను కూడా emotional చేశాయి. చాలామంది ఆటగాళ్లు అతన్ని hug చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్లు కేవలం ఒక player కి కాదు… ఒక legend కి వీడ్కోలు చెబుతున్నారు.
విరాట్ కోహ్లీ కేవలం Test cricket ఆడలేదు…
అతను ప్రతి మ్యాచ్ను జీవించాడు.
అందుకే ప్రపంచ క్రికెట్ చరిత్రలో అతని పేరు ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలిచిపోతుంది.
“విరాట్ కోహ్లీ కేవలం గొప్ప ఆటగాడు మాత్రమే కాదు… రికార్డుల రాజు కూడా. ప్రపంచ క్రికెట్లో ఎన్నో అసాధ్యమైన రికార్డులను తన పేరుతో రాసుకున్నాడు.”
“O D I క్రికెట్లో అత్యంత వేగంగా 8 వేల, 9 వేల, 10 వేల, 11 వేల, 12 వేల పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు.”
“చేజ్ చేస్తూ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా విరాట్ పేరు నిలిచిపోయింది. అందుకే ప్రపంచం అతన్ని ‘Chase Master’ అని పిలుస్తుంది.”
“ICC tournaments లో అత్యధిక consistency చూపించిన ఆటగాళ్లలో విరాట్ ముందు వరుసలో ఉంటాడు.”
“I P L లో కూడా విరాట్ కోహ్లీ పేరు ప్రత్యేకం. Royal Challengers Bengaluru తరఫున వేలాది పరుగులు చేసి I P L history లో top run scorers లో ఒకడిగా నిలిచాడు.”
“కేవలం పరుగులు మాత్రమే కాదు… ఫిట్నెస్, అగ్రెషన్, passion, dedication — ఇవన్నీ కలిపి విరాట్ కోహ్లీని ఒక complete cricketer గా మార్చాయి.”
విరాట్ కోహ్లీ కథ… ఇది కేవలం ఒక cricketer కథ కాదు.
ఇది ఒక కల కథ.
ఒక పోరాటం కథ.
ఓటమిని అంగీకరించని ఒక యోధుడి కథ.
ఢిల్లీ వీధుల్లో బ్యాట్ పట్టుకుని పెద్ద కలలు కనిన ఒక చిన్న అబ్బాయి… ఈ రోజు ప్రపంచ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
చిన్నప్పటి నుంచే విరాట్ జీవితంలో ఎన్నో challenges వచ్చాయి. తండ్రిని కోల్పోయిన బాధ… career ప్రారంభంలో pressure… captaincy burden… form కోల్పోయిన కష్టకాలం… విమర్శలు… failures…
కానీ ప్రతి సారి అతను ఒక్కటే చేశాడు —
మళ్లీ లేచాడు.
అదే విరాట్ కోహ్లీ ప్రత్యేకత.
అతను ప్రపంచానికి ఒక విషయంనేర్పించాడు:
“Talent నిన్ను ప్రారంభానికి తీసుకెళ్తుంది…
కానీ discipline, hard work, mental strength నిన్ను గొప్పవాడిని చేస్తాయి.”
విరాట్ కేవలం పరుగులు మాత్రమే చేయలేదు…
భారత క్రికెట్ mindset మార్చాడు,
fitness culture ని revolution లా మార్చాడు,
యువ ఆటగాళ్లకు inspiration అయ్యాడు,
Test cricket కి కొత్త జీవం ఇచ్చాడు,
కోట్లాది అభిమానుల్లో passion నింపాడు.
ప్రపంచ క్రికెట్లో endaro legends వచ్చారు… ఇంకా వస్తారు కూడా.
కానీ కొన్ని పేర్లు మాత్రం generations మారినా మరిచిపోలేరు.
అలాంటి పేర్లలో ఒకటి — విరాట్ కోహ్లీ.
అతని aggression అభిమానులకు energy ఇచ్చింది.
అతని comeback అభిమానులకు hope ఇచ్చింది.
అతని dedication యువతకు inspiration అయ్యింది.
మైదానంలో అతను కేవలం cricket ఆడలేదు…
ప్రతి మ్యాచ్ను ఒక emotion గా మార్చాడు.
అందుకే అభిమానులు అతన్ని కేవలం player గా కాదు…
ఒక inspiration గా చూస్తారు.
ఒక emotion గా చూస్తారు.
అందుకే ప్రపంచం అతన్ని ఒక పేరుతో గుర్తుంచుకుంటుంది —
“KING KOHLI.”
records break అవుతాయి…
కొత్త stars వస్తారు…
కానీ passion, aggression, dedication కి మరో పేరు అయిన విరాట్ కోహ్లీ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే.
మరియు ఒక విషయంమాత్రం ఖాయం —
“కోహ్లీ… కోహ్లీ…” అనే chants భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి.ఇదే విరాట్ కోహ్లీ ప్రయాణం…
ఒక సాధారణ అబ్బాయి నుంచి ప్రపంచ క్రికెట్ను శాసించిన King Kohli గా మారిన అద్భుతమైన కథ.


