Top 5 This Week

Related Posts

శ్రేయస్ అయ్యర్! ఒకప్పుడు షార్ట్ బాల్‌కు బలహీనుడు! ఇప్పుడు?

ఒకప్పుడు “షార్ట్ బాల్‌కు బలహీనుడు” అని ట్రోల్ చేసిన అదే ప్లేయర్… ఇప్పుడు అదే షార్ట్ బాల్‌ను స్టేడియం బయటకు పంపుతున్నాడు! ఈ మార్పు వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఎవరి మాటలు అతన్ని ఇలా మార్చేశాయి? ఇదే ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది!

IPL 2026 లో పంజాబ్ కింగ్స్, టాప్‌లో ఉండటానికి ప్రధాన కారణం ఒకే వ్యక్తి, శ్రేయస్ అయ్యర్! ఈ సీజన్‌లో అతను సగటు 70 తో, స్ట్రైక్ రేట్ 186 తో పరుగులు కురిపిస్తూ తన కెరీర్‌లోనే బెస్ట్ ఫేజ్‌లో ఉన్నాడు. ఒకప్పుడు ODI ల్లో కన్సిస్టెంట్ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న అయ్యర్… ఇప్పుడు టీ ట్వంటీ ఫార్మాట్‌లో కూడా పూర్తిగా ట్రాన్స్‌ఫామ్ అయ్యాడు. కేవలం బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు, ఫినిషర్‌గా, కెప్టెన్‌గా కూడా టీమ్‌ను గెలిపిస్తూ తన లీడర్‌షిప్ చూపిస్తున్నాడు. ఇటీవల ముంబై ఇండియన్స్‌పై మ్యాచ్‌లో, ప్రపంచ స్థాయి పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన షార్ట్ బాల్‌ను, సిక్స్‌గా కొట్టిన సీన్ ఇప్పటికీ ఫ్యాన్స్ మైండ్‌లో ఉంది. అదే అతని ట్రాన్స్‌ఫార్మేషన్‌కు నిదర్శనం.

ఈ మార్పు వెనుక ఉన్న అసలు కథ మరింత ఇంట్రెస్టింగ్. “నువ్వు ఈ సిచ్యువేషన్ లో చేయలేవు… ఇది అసాధ్యం” అని చెప్పిన వాళ్ల మాటలు అతన్ని చాలా బాధపెట్టాయి. కానీ అదే మాటలు అతనికి మోటివేషన్‌గా మారాయి. “నేను ఎలా తిరిగి వస్తాను? ఇంకా బెటర్‌గా ఎలా ప్రూవ్ చేస్తాను?” అన్న ఆలోచనతో తనను తాను పుష్ చేసుకున్నాడు. ముఖ్యంగా గాయం వచ్చిన సమయంలో “ఇంకా మునుపటిలా ఆడలేవు” అన్న కామెంట్స్ అతన్ని మరింత ఫైర్ చేశాయి. కానీ అయ్యర్ మాత్రం “ఎందుకు కాదు?” అని తనను తాను ప్రశ్నించుకుని, తన మైండ్‌సెట్‌ను పూర్తిగా మార్చుకున్నాడు.

అయ్యర్ పై అత్యంత ఎక్కువగా ట్రోల్ అయిన విషయము, షార్ట్ బాల్ వీక్‌నెస్. “ఇది ఎప్పటికీ ఫిక్స్ అవ్వదు” అన్న కామెంట్స్ అతన్ని ట్రిగర్ చేశాయి. కానీ అదే అతని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్‌గా మారింది. ముందు షార్ట్ బాల్ వస్తే సింగిల్ తీసుకునేవాడు… ఇప్పుడు అదే బాల్ కనిపిస్తే సిక్స్ కొట్టాలనే మైండ్‌సెట్‌తో దిగుతున్నాడు. ఇది కేవలం టెక్నిక్ మార్పు కాదు… ఇది పూర్తి మైండ్‌సెట్ ట్రాన్స్‌ఫార్మేషన్.

ప్రాక్టీస్ విషయంలో కూడా అయ్యర్, పూర్తిగా డిఫరెంట్ లెవెల్‌కు వెళ్లిపోయాడు. రోజుకు 300 కి పైగా బాల్స్ ఫేస్ చేస్తూ, 50 ఓవర్ల వరకు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ, తన గేమ్‌ను ఫైన్ ట్యూన్ చేస్తున్నాడు. కేవలం సైడ్ ఆర్మ్ కాకుండా రియల్ బౌలర్లను ఎదుర్కొంటూ, తన మువ్‌మెంట్, టైమింగ్‌ను మెరుగుపరుచుకున్నాడు. ప్రావీణ్ ఆమ్రే, అభిషేక్ నాయర్ లాంటి కోచ్‌లతో కలిసి పని చేస్తూ, కొత్త ఐడియాస్ తీసుకుంటున్నాడు. మ్యాచ్ ముందు బౌలర్ డెలివరీ ఇచ్చే సమయానికి, తన రిథమ్ సెట్ చేసుకోవడం, ఇది ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి గ్రేట్ ప్లేయర్స్ స్టైల్ అని చెప్పొచ్చు.

ఇప్పుడు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రేయస్ అయ్యర్ కేవలం ఒక బ్యాట్స్‌మన్ కాదు… తనను తాను మార్చుకుని, ట్రోల్స్‌ను స్ట్రెంగ్త్‌గా మార్చుకున్న ఫైటర్! ఒకప్పుడు విమర్శలు… ఇప్పుడు ప్రశంసలు… ఇదే అతని అసలు కథ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles