మూడు మ్యాచ్‌లు…
రెండు వరుస డక్స్…
సోషల్ మీడియాలో విమర్శలు…
“కోహ్లీ ఫామ్ ముగిసిపోయిందా?” అంటూ వచ్చిన కామెంట్స్…
కానీ క్రికెట్‌లో ఒక విషయము మాత్రం ఎప్పుడూ నిజమే —
కింగ్‌ను ముందే తక్కువ అంచనా వేస్తే…
అతడు మరింత ప్రమాదకరంగా తిరిగి వస్తాడు!
రాయ్‌పూర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అదే జరిగింది! ఒకవైపు వర్షం మ్యాచ్‌ను ఆలస్యం చేసింది… మరోవైపు కోహ్లీ బ్యాట్ మాత్రం తుఫాన్‌లా మాట్లాడింది! ఐపీఎల్ 2026 లో ఆర్‌సీబీకి అత్యంత కీలకమైన మ్యాచ్‌లో… విరాట్ కోహ్లీ సెంచరీతో మళ్లీ తన రాజ్యాన్ని గుర్తు చేశాడు! కానీ ఈ మ్యాచ్‌లో కేవలం కోహ్లీ మాత్రమే కాదు… యంగ్ స్టార్ అంగ్‌క్రిష్ రఘువంశీ కూడా తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు! చివరకు ఎవరు గెలిచారు? ఎలా గెలిచారు? మ్యాచ్‌లో జరిగిన అసలు ట్విస్టులు ఏంటి? ఇప్పుడు పూర్తి కథ చూద్దాం!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన, ఈ హై వోల్టేజ్ పోరులో… ఆర్‌సీబీ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసిన బెంగళూరు… ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ను ముగించింది. ఈ విజయానికి ప్రధాన కారణం — విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ!
ఇటీవల వరుసగా రెండు డక్స్‌తో తీవ్ర ఒత్తిడిలో ఉన్న కోహ్లీ… ఈ మ్యాచ్‌లో మాత్రం మొదటి బంతి నుంచే పూర్తి కాన్ఫిడెన్స్ తో కనిపించాడు. తొలి రన్ తీసుకున్న వెంటనే కోహ్లీ ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాడు… అది చూసిన అభిమానులకు ‘కింగ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు’ అన్న ఫీలింగ్ వచ్చింది.
ముఖ్యంగా వైభవ్ అరోరా ఓవర్‌లో వరుస బౌండరీలు కొట్టిన తర్వాత… స్టేడియం మొత్తం “కోహ్లీ,కోహ్లీ…” అంటూ మార్మోగిపోయింది.
పేస్ అయినా… స్పిన్ అయినా… కోహ్లీ ఈరోజు ఎవరినీ వదల్లేదు. చాలా రోజుల తర్వాత పాత అగ్రెసివ్ కోహ్లీ కనిపించాడు. సింగిల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ… అవసరమైనప్పుడు బౌండరీలు కొడుతూ… ఛేజ్‌ను పూర్తిగా తన నియంత్రణలో ఉంచాడు.
32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ… దేవదత్ పడిక్కల్‌తో కలిసి కీలకమైన 92 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. పడిక్కల్ కూడా 27 బంతుల్లో 39 పరుగులు చేసి మంచి సపోర్ట్ ఇచ్చాడు. ముఖ్యంగా అతడు కొట్టిన వరుస కవర డ్రైవ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
అయితే అసలు magic చివర్లో జరిగింది! వైభవ్ అరోరా బౌలింగ్‌లో సింగిల్ తీసుకున్న కోహ్లీ… తన ఐపీఎల్ కెరీర్‌లో తొమ్మిదో సెంచరీ నమోదు చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా మరింత ముందుకు వెళ్లాడు.
ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు:
విరాట్ కోహ్లీ – 9,
జోస్ బట్లర్ – 7,
క్రిస్ గేల్ – 6,
కేఎల్ రాహుల్ – 6,
సంజూ శాంసన్ – 5..
ఈ సెంచరీ తర్వాత కోహ్లీ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది అభిమానులు “కింగ్ is బ్యాక్” అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ కూడా చేశారు. ఇటీవల టీ twenty వరల్డ్ కప్ స్క్వాడ్ చర్చల మధ్య వచ్చిన విమర్శలకు… ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడని అభిమానులు చెబుతున్నారు.
ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో టాప్‌కు చేరుకుంది. గుజరాత్ టైటాన్స్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ముఖ్యంగా కోహ్లీని ఆటగాళ్లు హగ్ చేసుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు పరిస్థితి అంత సులభంగా లేదు. భారీ వర్షం కారణంగా మ్యాచ్ దాదాపు 75 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. అవుట్‌ఫీల్డ్ తడిగా ఉన్నా… రాయ్‌పూర్ ప్రేక్షకులు మాత్రం స్టేడియాన్ని వదిలి వెళ్లలేదు. చివరకు వాళ్లకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ దొరికింది.
మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌కు ప్రారంభంలోనే షాక్‌లు తగిలాయి. కెప్టెన్ అజింక్య రహానే కేవలం 19 పరుగులకే అవుట్ అయ్యాడు. ఫిన్ అలెన్ 8 బంతుల్లో 18 పరుగులు చేసి దూకుడు చూపించినా… భువనేశ్వర్ కుమార్ అతడిని క్యాచ్ అవుట్ చేయించాడు.ఆ తర్వాత Josh Hazlewood వేసిన షార్ట్ బాల్‌కు రహానే వికెట్ ఇచ్చేశాడు.”
పవర్‌ప్లే ముగిసేసరికి 56/2 తో కష్టాల్లో పడిన కేకేఆర్‌ను కాపాడింది యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీ. కేవలం 21 ఏళ్ల ఈ బ్యాటర్… తన ఐపీఎల్ కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతుల్లో 71 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇందులో ఏడు ఫోర్లు… మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి.
రఘువంశీ బ్యాటింగ్‌లో ప్రత్యేకత ఏమిటంటే… అతడు అటాక్ చేస్తూనే చాలా మెచ్యూరిటీ చూపించాడు. డఫీ బౌలింగ్‌లో కొట్టిన షార్ట్ ఆర్మ్ పుల్… కృనాల్ పాండ్యాపై కొట్టిన భారీ సిక్స్… ప్రేక్షకులను కుర్చీల్లోంచి లేపేశాయి. ముఖ్యంగా రసిఖ్ సలామ్ వేసిన స్లో బాల్‌ను నేరుగా బౌలర్ తలపై నుంచి, బౌండరీకి పంపిన షాట్ మ్యాచ్ హైలైట్‌లలో ఒకటిగా మారింది.
అతనికి కెమెరూన్ గ్రీన్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు. గ్రీన్ 24 బంతుల్లో 32 పరుగులు చేశాడు. తర్వాత రింకూ సింగ్‌తో కలిసి రఘువంశీ కీలక భాగస్వామ్యం నిర్మించాడు.
చివర్లో రింకూ సింగ్ మళ్లీ తన ఫినిషర్ పాత్రను అద్భుతంగా పోషించాడు. 29 బంతుల్లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయినా… కేకేఆర్‌కు భారీ స్కోర్ అందించాడు.
కానీ చివరికి ఆ స్కోర్ కూడా కోహ్లీ తుఫాన్ ముందు సరిపోలేదు. వరుస వైఫల్యాల తర్వాత ఇలాంటి సెంచరీ రావడం… ఆర్‌సీబీ అభిమానులకు పెద్ద ఊరట ఇచ్చింది. ఇప్పుడు ప్లేఆఫ్స్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది. కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడంటే… మిగతా జట్లకు ఇది ఖచ్చితంగా డేంజర్ బెల్!
మరి మీ అభిప్రాయం ఏంటి?
కోహ్లీ ఈ సీజన్ లో ఇంకా ఎన్ని సెంచరీలు చేస్తాడు?
ఆర్‌సీబీ ఈసారి ట్రోఫీ గెలుస్తుందా?
కామెంట్‌లో మీ ప్రిడిక్షన్ చెప్పండి!


