రోహిత్ శర్మ జీవిత ప్రయాణం… ఒక సామాన్య మధ్యతరగతి కుర్రాడు, ప్రపంచ క్రికెట్ స్థాయికి ఎదిగిన అద్భుతమైన గాథ. సచిన్ తర్వాత ఆ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న ఆటగాడు , ఎవరంటే అందరూ చెప్పే పేరు రోహిత్ శర్మ. మూడు డబుల్ సెంచరీలు, ఐదు ఐపీఎల్ ట్రోఫీలు, సిక్సర్ల సునామీ.. ఇదీ నేడు మనం చూస్తున్న hitman. కానీ ఈ సామ్రాజ్యం వెనుక ఒక సామాన్య కుర్రాడి పోరాటం ఉంది. బోరివలీ గల్లీల నుండి వాంఖడే స్టేడియంలో, సిక్సర్ల వర్షం కురిపించే వరకు సాగిన ఈ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
1987 yeprel 30న మహారాష్ట్రలోని నాగ్పూర్లో రోహిత్ జన్మించాడు. తండ్రి గురునాథ్ శర్మ ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో స్టోర్హౌస్ కేర్టేకర్ కావడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండేవి. ఆ కారణం చేతనే రోహిత్ తన చిన్నతనంలో తల్లిదండ్రులకు దూరంగా,తాతయ్య, బాబాయ్ల దగ్గర ముంబైలో పెరిగాడు. సెలవుల్లో మాత్రమే తన తల్లిదండ్రులను కలిసేవాడు. క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి ఉన్న రోహిత్ టాలెంట్ను గుర్తించిన అతని బాబాయ్, తన స్నేహితుల దగ్గర అప్పు చేసి మరి రోహిత్ని ఒక క్రికెట్ క్యాంప్లో చేర్పించారు.
ఆ క్యాంప్లో రోహిత్ ఆడే తీరును చూసిన కోచ్ దినేష్ లాడ్ ఆశ్చర్యపోయారు. రోహిత్ని తన స్కూల్ అయిన స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్కి మారమని చెప్పారు. కానీ అక్కడ ఫీజులు రోహిత్ కుటుంబం భరించలేని స్థాయిలో ఉండేవి. రోహిత్ కళ్ళలో ఉన్న కసిని చూసిన దినేష్ లాడ్, స్వయంగా మాట్లాడి రోహిత్కు స్కాలర్షిప్ వచ్చేలా చేశారు. మొదట్లో రోహిత్ ఒక ఆఫ్స్పిన్నర్గా కెరీర్ మొదలుపెట్టాడు. కానీ ఒక మ్యాచ్లో రోహిత్ బ్యాటింగ్ చూసిన కోచ్, అతనిలోని అసలైన బ్యాటర్ను ప్రపంచానికి పరిచయం చేశారు.
డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణించిన రోహిత్, 2007లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అదే ఏడాది జరిగిన టి twenty వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాపై రోహిత్ చేసిన హాఫ్ సెంచరీ భారత్ విజయంలో కీలకమైంది. అయితే, కెరీర్ మొదట్లో స్థిరత్వం లేకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. దీనివల్ల 2011 వన్డే వరల్డ్ కప్ జట్టులో రోహిత్కు చోటు దక్కలేదు. ఆ సమయంలో రోహిత్ తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు.
భారత జట్టు వరల్డ్ కప్ గెలుస్తుంటే బయట నుంచి చూడాల్సి రావడం అతన్ని లోపల నుంచి తీవ్రంగా బాధించింది. చాలా మంది “రోహిత్లో టాలెంట్ ఉంది కానీ consistency లేదు” అంటూ విమర్శించారు. కానీ అదే కసి తనని తాను నిరూపించుకోవడానికి ఇంధనంగా మారింది.తన ఫిట్నెస్, టెక్నిక్, మైండ్సెట్పై మరింత కష్టపడ్డాడు. అదే సమయంలో అతనిపై నమ్మకం పెట్టుకున్న వ్యక్తి MS Dhoni. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ధోనీ తీసుకున్న ఒక నిర్ణయం రోహిత్ జీవితాన్నే మార్చేసింది. మధ్య వరుసలో ఆడుతున్న రోహిత్ను ఓపెనర్గా పంపాలని ధోనీ నిర్ణయించాడు. మొదట చాలామంది ఆశ్చర్యపోయినా… ఆ నిర్ణయం భారత క్రికెట్ చరిత్రలోనే గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా మారింది. కొత్త బంతితో ఎక్కువ సమయం క్రీజులో ఉండే అవకాశం రావడంతో , రోహిత్ తన అసలైన ఆటను ప్రపంచానికి చూపించాడు. అక్కడి నుంచి అతని బ్యాట్ ఆగలేదు. సెంచరీలు, డబుల్ సెంచరీలు, భారీ సిక్సర్లతో ప్రపంచ బౌలర్లను భయపెట్టాడు. ఒకప్పుడు జట్టులో స్థానం కోసం పోరాడిన ఆటగాడు… తర్వాత భారత జట్టుకు మ్యాచ్ విన్నర్గా, ప్రపంచ క్రికెట్లో hitman గా మారిపోయాడు.
2014 నవంబర్ 13… క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. Rohit Sharma శ్రీలంకపై కోల్కతాలోని Eden Gardens స్టేడియంలో ఆడిన, ఆ ఇన్నింగ్స్తో ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని షాక్కు గురిచేశాడు. మొదట నెమ్మదిగా ఆరంభించిన రోహిత్, ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత శ్రీలంక బౌలర్లపై సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. కేవలం 173 బంతుల్లోనే 33 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 264 పరుగులు చేసి, వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… 100 పరుగులు పూర్తి చేసిన తర్వాత రోహిత్ మరింత ప్రమాదకరంగా మారి, చివరి ఓవర్లలో బౌలర్లను పూర్తిగా డామినేట్ చేశాడు. ఆ మ్యాచ్లో అతని టైమింగ్, పుల్ షాట్లు, effortless sixes చూసి ప్రపంచమంతా “ఇతనే అసలైన hitman” అని ప్రశంసించింది. ఈ రికార్డు ఇప్పటికీ ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. ఒకప్పుడు 200 స్కోర్ అసాధ్యం అనుకున్న వన్డే క్రికెట్లో… రోహిత్ ఏకంగా 264 పరుగులు చేసి, క్రికెట్ చరిత్రలో శాశ్వతంగా తన పేరును చెక్కించుకున్నాడు.
2019 వరల్డ్ కప్… Rohit Sharma కెరీర్లోనే కాదు, ప్రపంచ క్రికెట్ చరిత్రలో కూడా ప్రత్యేకంగా నిలిచిపోయిన టోర్నమెంట్. ఇంగ్లాండ్లో జరిగిన ఆ వరల్డ్ కప్లో రోహిత్ ఒక్కడే భారత బ్యాటింగ్కు వెన్నుముకలా నిలిచాడు. సౌత్ ఆఫ్రికాపై అజేయంగా 122 పరుగులతో టోర్నీని ప్రారంభించిన రోహిత్, తర్వాత పాకిస్థాన్పై 140, ఇంగ్లాండ్పై 102, బంగ్లాదేశ్పై 104, శ్రీలంకపై 103 పరుగులు చేసి మొత్తం 5 సెంచరీలు సాధించాడు. ఒకే వరల్డ్ కప్లో ఐదు సెంచరీలు చేసిన ప్రపంచంలోనే మొదటి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు Kumar Sangakkara పేరిట ఉన్న 4 సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తం టోర్నీలో 648 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ముఖ్యంగా పాకిస్థాన్పై చేసిన 140 పరుగుల ఇన్నింగ్స్ను అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. ఆ వరల్డ్ కప్లో రోహిత్ బ్యాటింగ్ చూస్తే… ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టడం అతనికి అలవాటులా అనిపించింది. ప్రపంచం మొత్తం “ఇదే అసలైన హిట్మ్యాన్ షో” అని ప్రశంసించింది.
Rohit Sharma కెప్టెన్సీ గురించి మాట్లాడితే… ఐపీఎల్ చరిత్రలో అతని పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. 2013లో Mumbai Indians జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పుడు, చాలామంది పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ రోహిత్ తన ప్రశాంతమైన నాయకత్వంతో జట్టును పూర్తిగా మార్చేశాడు. అదే ఏడాది ముంబై ఇండియన్స్కు మొదటి ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. అక్కడి నుంచి ముంబై జట్టు ఒక డామినేటింగ్ ఫోర్స్గా మారిపోయింది. 2015, 2017, 2019, 2020 సీజన్లలో కూడా టైటిల్స్ గెలిపించి , మొత్తం 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. అతని కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ కేవలం ఒక జట్టు కాదు… ఒక ఛాంపియన్ మిషన్లా మారింది. మ్యాచ్ ఎంత టెన్షన్లో ఉన్నా రోహిత్ ముఖంలో ఒత్తిడి కనిపించదు. అదే అతని గొప్ప బలం. సరైన సమయంలో సరైన బౌలర్ను ఉపయోగించడం, యువ ఆటగాళ్లపై నమ్మకం పెట్టుకోవడం, పెద్ద మ్యాచ్ల్లో cool గా నిర్ణయాలు తీసుకోవడం వల్లే అతన్ని “Captain Cool after Dhoni” అని కూడా చాలామంది పిలుస్తారు. Jasprit Bumrah, Hardik Pandya, Suryakumar Yadav వంటి ఆటగాళ్లు స్టార్లుగా ఎదగడంలో కూడా రోహిత్ కెప్టెన్సీ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా 2020 ఐపీఎల్ ఫైనల్లో ఢిల్లీపై ముంబై గెలిచిన తీరు చూసి, ప్రపంచం మొత్తం రోహిత్ను గొప్ప T20 కెప్టెన్లలో ఒకడిగా గుర్తించింది. ఒక ఆటగాడిగా మాత్రమే కాదు… జట్టును విజయాల దారిలో నడిపించిన నాయకుడిగా కూడా , రోహిత్ శర్మ కోట్లాది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.
Rohit Sharma కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాలంటే… అది కేవలం క్రికెట్ అభిమానమే కాదు, ఒక ఎమోషన్. Sachin Tendulkar తర్వాత భారత క్రికెట్లో , అంత పెద్ద స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న ఆటగాళ్లలో , రోహిత్ శర్మ పేరు ముందుంటుంది. అతను బ్యాటింగ్కు వస్తే స్టేడియంలో ఒక్కసారిగా ఎనర్జీ మారిపోతుంది. ముఖ్యంగా అతని పుల్ షాట్లు, effortless sixes చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తారు. అందుకే అభిమానులు ప్రేమగా అతనిని “Hitman” అని పిలవడం ప్రారంభించారు. ఈ పేరు కేవలం nickname కాదు… ఇప్పుడు అది ఒక brand గా మారిపోయింది. రోహిత్ సెటిల్ అయితే బౌలర్లపై ఎలా విరుచుకుపడతాడో తెలుసు కాబట్టి, ప్రపంచంలోని బెస్ట్ బౌలర్లు కూడా అతనికి భయపడేవారు. ముఖ్యంగా IPL లో Mumbai Indians మ్యాచ్ల సమయంలో “Rohit… Rohit…” అంటూ స్టేడియం మొత్తం మార్మోగిపోవడం సాధారణ విషయం అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా రోహిత్కు కోట్లాది అభిమానులు ఉన్నారు. అతని ఒక్క సిక్స్ వీడియోలు, pull shots, captaincy moments నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యువతలో రోహిత్ స్టైల్, calm attitude, fearless battingకు ప్రత్యేకమైన craze ఉంది. ఓటమి వచ్చినా ప్రశాంతంగా ఉండటం, గెలిచినా ఎక్కువగా show చేయకపోవడం వల్ల అభిమానులు అతనిని మరింతగా ఇష్టపడతారు. అందుకే రోహిత్ శర్మ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు… కోట్లాది మంది అభిమానులకు ఒక inspiration, ఒక emotion, నిజమైన “Hitman”.
2026 ఐపీఎల్ సీజన్లో కూడా తన Hitman హవా తగ్గలేదని నిరూపించాడు.
ఒకప్పుడు క్రికెట్ కిట్ కొనడానికి కూడా డబ్బులు లేని కుర్రాడు… నేడు ప్రపంచ క్రికెట్లో కోట్లాది అభిమానుల గుండెల్లో రాజులా నిలిచాడు. Rohit Sharma ప్రయాణం మనకు ఒక గొప్ప విషయం నేర్పిస్తుంది — పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, కలలపై నమ్మకం కోల్పోకూడదని, 2011లో వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కక కన్నీళ్లు పెట్టుకున్న అదే రోహిత్… తర్వాత ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టి hitman గా చరిత్ర సృష్టించాడు. పడిపోయినా మళ్లీ లేచి మరింత బలంగా తిరిగి రావడం అతని అసలైన గొప్పతనం. అందుకే రోహిత్ శర్మ కేవలం ఒక క్రికెటర్ కాదు… కోట్లాది మంది యువతకు ఒక inspiration. జీవితంలో ఓటములు వచ్చినా… ఒక్క అవకాశం చాలు. ఆ అవకాశాన్ని చరిత్రగా మార్చుకున్న పేరు — రోహిత్ శర్మ!.


