Top 5 This Week

Related Posts

  గ్లెన్ ఫిలిప్స్ ఫైర్ అయ్యాడు..! ఆ ఒక్క ప్రశ్నతో Press conference హీటెక్కింది.

ఒక భారీ మ్యాచ్ ఓటమి తర్వాత జరిగిన Press conference… కానీ అక్కడ కనిపించిన ఒక సీన్ మాత్రం అందరినీ షాక్‌కు గురి చేసింది! సాధారణంగా ప్లేయింగ్ XI లో ఉన్న ప్లేయర్లు మాత్రమే మీడియా ముందు కనిపిస్తారు. కానీ ఈసారి గుజరాత్ టైటాన్స్ బ్యాటర్, గ్లెన్ ఫిలిప్స్ press రూమ్‌లో కనిపించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. అసలు అతను మ్యాచ్ కూడా ఆడలేదు… అయినా అతడిని మీడియా ఎందుకు పిలిచారు? ఆ క్షణంలోనే అక్కడ ఒక చిన్న టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే… ఆ Press conference లో వచ్చిన ఒక ప్రశ్న తర్వాత మొత్తం వాతావరణం ఒక్కసారిగా హీటెక్కిపోయింది!

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ one మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, భారీగా 254 పరుగుల టార్గెట్ పెట్టింది. ఆ స్కోర్ చూసిన వెంటనే గుజరాత్ టైటాన్స్ డగౌట్‌లోనే టెన్షన్, మొదలైందని సోషల్ మీడియాలో కూడా చర్చలు జరిగాయి. గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లు త్వరగా అవుట్ కావడంతో ఛేజ్ పూర్తిగా ఒత్తిడిలో పడిపోయింది. చివరికి గుజరాత్ 162 పరుగులకే ఆలౌట్ అయ్యి 92 పరుగుల భారీ ఓటమిని ఎదుర్కొంది. మ్యాచ్ తర్వాత అందరూ షాక్‌లో ఉండగా, ఒక్కసారిగా గ్లెన్ ఫిలిప్స్ మీడియా ముందుకు రావడం అందరినీ ఇంకా Confused చేసింది.

Press conference లో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న అయితే మరింత హీట్ పెంచేసింది. “RCB 254 పరుగులు చేసినప్పుడు, మీరు అప్పుడే మానసికంగా మ్యాచ్‌ ను వదిలేశారా?” అనే ప్రశ్న విన్న వెంటనే గ్లెన్ ఫిలిప్స్ ఒక్క క్షణం షాక్ అయ్యాడు. ఆ తర్వాత అతను చాలా గట్టిగా స్పందించాడు. “అది చాలా silly question… చాలా చెత్త ప్రశ్న. ప్రొఫెషనల్ క్రికెటర్స్ ఎప్పుడూ గివ్ అప్ అనేది ఆలోచించరు. మేము అక్కడికి పోయింది పోరాడటానికి. 250 ఛేజ్ చేయడం అంటే ప్రతి విషయము సరిగ్గా జరగాలి. మేము ప్రయత్నించాం కానీ ఈసారి అది జరగలేదు” అంటూ చాలా సీరియస్‌గా స్పందించాడు.

ఈ సమాధానం తర్వాత అక్కడ ఉన్న మీడియా రూమ్‌లో కాసేపు గాఢమైన నిశ్శబ్దం కమ్ముకుంది. ఎందుకంటే 250 ఛేజ్ చేయడం అనేది IPL లాంటి హై-ప్రెషర్ టోర్నమెంట్‌లో ఎంత కష్టమో అందరికీ తెలుసు. గతంలో కొన్ని టీమ్స్ భారీ స్కోర్లను ఛేజ్ చేసి సంచలనం సృష్టించినా, అలాంటి విజయాలు ప్రతి సారి రావు. పవర్‌ప్లేలో ఒక చిన్న తప్పు జరిగినా మొత్తం గేమ్ చేతిలోంచి జారిపోతుంది. అదే విషయాన్ని ఫిలిప్స్ కూడా హైలైట్ చేస్తూ, “ఇంత పెద్ద టార్గెట్ ఛేజ్ చేయాలంటే ప్రతి విషయం పర్ఫెక్ట్‌గా కుదరాలి… కొన్నిసార్లు క్రికెట్ మన ప్లాన్ ప్రకారం జరగదు” అని చెప్పాడు.

కానీ అసలు ట్విస్ట్ ఇంకొక ప్రశ్నతో వచ్చింది. మ్యాచ్ ఆడని ప్లేయర్ అయినా మీరు Press conference లో ఎందుకు ఉన్నారు? అనే ప్రశ్న విన్నప్పుడు గ్లెన్ ఫిలిప్స్ చాలా కూల్‌గా స్పందించాడు. “ఇది టీమ్ గేమ్. ఎవరు ఆడినా, ఎవరు ఆడకపోయినా అందరం ఒకటే టీమ్. మీడియా బాధ్యతలు కూడా షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఆడే ప్లేయర్లు మెంటల్‌గా ఫ్రెష్‌గా ఉండాలి. అందుకే బయట నుంచి ఒక పర్స్పెక్టివ్ కూడా అవసరం అవుతుంది” అని చెప్పాడు. అంతేకాదు, గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా చెప్పే ‘చిల్ పిల్’ మాటను గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆటగాళ్లు రిలాక్స్ అవ్వాలి అని కూడా సూచించాడు.

మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో మాత్రం గుజరాత్  బ్యాటింగ్ కుప్పకూలడంపై భారీ చర్చ నడిచింది. అభిమానులు “ఇంత పెద్ద టార్గెట్ ముందు టాప్ ఆర్డర్ ఎందుకు నిలబడలేదు?” అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు RCB బౌలింగ్ అటాక్ అద్భుతంగా పనిచేసిందని, ప్రెషర్ పరిస్థితుల్లో వారు గేమ్‌ను పూర్తిగా తమవైపు తిప్పుకున్నారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సీజన్‌ లో గుజరాత్ కొన్నిసార్లు అద్భుతంగా ఆడినా, ప్లేఆఫ్స్ కీలక మ్యాచ్‌లో ఇలా కూలిపోవడం అభిమానులకు పెద్ద షాక్‌గా మారింది.

ఇక చివరికి ఈ మొత్తం ఘటన ఒక విషయము మాత్రం స్పష్టం చేసింది… IPL లాంటి హై-ప్రెషర్ టోర్నమెంట్‌లో ఒక చిన్న తప్పు కూడా మ్యాచ్‌ ను పూర్తిగా మార్చేస్తుంది. గ్లెన్ ఫిలిప్స్ మాటల్లో ఉన్న ఆ ఫైర్, ఆ నిజాయితీ చూస్తే ఒక విషయము అర్థమవుతుంది… ఓటమి ఎంత పెద్దదైనా, పోరాటం ఆగదు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌కి ఇకపై ప్రతి మ్యాచ్ ఒక Do or die సిచువేషన్‌లా మారిపోయింది. fans మాత్రం ఒక్కటే ఆశిస్తున్నారు… “తర్వాతి మ్యాచ్‌లో అయినా అదే ఎనర్జీ, అదే ఫైట్ కనిపించాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles