ధోనీకి CSK లో 25% వాటా కావాలా? అసలు నిజం ఏంటి? MS ధోనీ అంటే చెన్నై సూపర్ కింగ్స్… CSK అంటే MS ధోనీ. ఈ రెండింటినీ వేరు చేసి చూడటం చాలా కష్టం. అయితే ఇప్పుడు ధోనీకి సంబంధించి CSK లో వాటా గురించి వచ్చిన ఓ వార్త క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. వరల్డ్ కప్ గెలిపించిన మాజీ టీమిండియా కెప్టెన్ MS ధోనీ… IPL 2026లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా కూడా మొత్తం సీజన్లో CSK గురించి చర్చ వచ్చిన ప్రతిసారీ ధోనీ పేరు మాత్రం వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం ధోనీ వయసు 45 సంవత్సరాలు. గత కొన్ని సంవత్సరాల్లో అతని ఆటగాడి పాత్ర తగ్గిపోయినా…
CSK జట్టులో మాత్రం ధోనీకి ఉన్న గౌరవం, ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. అయితే IPL 2027 రిటెన్షన్ తేదీలు ఇంకా ప్రకటించలేదు. ఇంతలోనే ధోనీకి సంబంధించి ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. Cricblogger కథనం ప్రకారం… ధోనీ CSK లో 25 శాతం వాటా కావాలని అడిగాడట. ఆ తర్వాత తన డిమాండ్‌ను 20 శాతానికి తగ్గించాడని కూడా ఆ కథనంలో పేర్కొన్నారు. చివరికి CSK యాజమాన్యం ధోనీకి 5.5 శాతం వాటా ఇవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తపై మాజీ టీమిండియా ఆటగాడు, మాజీ KKR ప్లేయర్ ఆకాశ్ చోప్రా మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. ఆకాశ్ చోప్రా ప్రకారం…
ఈ 25 శాతం వాటా వార్త వాస్తవంగా ఉండే అవకాశం చాలా తక్కువ. అంతేకాదు, ఇది కావాలనే బయటకు తీసుకొచ్చిన వార్త అయి ఉండొచ్చని ఆయన అన్నారు. CSK విలువను ఎంతగా అంచనా వేసినా… అది ఐదు IPL ట్రోఫీలు గెలిచిన భారీ ఫ్రాంచైజీ. అంతేకాదు, భారత్ బయట కూడా CSK కు పలు ఫ్రాంచైజీలు ఉన్నాయి. అందుకే CSK ఒక పెద్ద బ్రాండ్ అని చోప్రా చెప్పారు. ఒకవేళ CSK విలువ 1.8 బిలియన్ డాలర్లు అనుకుంటే… అందులో 25 శాతం వాటా అంటే దాదాపు 400 మిలియన్ డాలర్లు. ఇంత పెద్ద మొత్తాన్ని ఎవరు ఉచితంగా వాటాగా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
అంతేకాదు… 5.5 శాతం వాటా కూడా చిన్న విషయము కాదని చోప్రా స్పష్టం చేశారు. రెండు శాతం, మూడు శాతం లేదా ఐదు శాతం వాటా అయినా… దాని విలువ చాలా భారీగా ఉంటుందని చెప్పారు. చివరగా… 25 శాతం అడగడం, తర్వాత తగ్గించడం, 3.5 శాతం నుంచి 5.5 శాతానికి రావడం వంటి వివరాలు చూస్తుంటే… ఈ కథ నిజం కాదనే భావన తనకు ఉందని ఆకాశ్ చోప్రా చెప్పారు. అయితే తన దగ్గర ధృవీకరించిన సమాచారం లేదు కాబట్టి…
దీనిని ఫేక్ న్యూస్ అని మాత్రం చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు. మరి ధోనీ నిజంగానే CSK లో వాటా కోరాడా? లేక ఇది కేవలం ప్రచారమేనా? దీనిపై క్లారిటీ రావాలంటే మరింత సమాచారం బయటకు రావాల్సిందే. “ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!”


