Top 5 This Week

Related Posts

ఇమామ్-ఉల్-హక్‌కు బిగ్ షాక్.. ‘ఫేక్ ఇంజరీ’పై విచారణ, లీగల్ యాక్షన్?

ఇమామ్-ఉల్-హక్‌కు బిగ్ షాక్.. ‘ఫేక్ ఇంజరీ’పై విచారణ! పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్‌కు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో అతడికి వచ్చిన calf injury ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇమామ్‌కు calf muscle injury అయింది. అయితే ఆసక్తికరమైన విషయము ఏంటంటే.. ఆ తర్వాత పాకిస్థాన్ తరఫున అతను రెండు innings లోనూ బ్యాటింగ్‌కు రాలేదు. ఇప్పటికే ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 194 పరుగుల భారీ తేడాతో గెలిచింది.

దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0తో సొంతం చేసుకుంది. కానీ మ్యాచ్ ఓటమి కంటే ఇప్పుడు ఇమామ్ injury గురించే పాకిస్థాన్ క్రికెట్‌లో ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ఇమామ్‌కు నిజంగానే అంత తీవ్రమైన injury ఉందా? లేక అతను బ్యాటింగ్‌కు రాకపోవడానికి ఇంకేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై పాకిస్థాన్ సెలక్షన్ కమిటీ సభ్యుడు ఆకిబ్ జావేద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇమామ్ injury పై పూర్తి స్థాయిలో inquiry నిర్వహిస్తామని ఆయన వెల్లడించాడు.

అంతేకాదు.. ఒక muscle injury వచ్చిన తర్వాత రెండు innings లోనూ బ్యాటింగ్‌కు రాకపోవడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించాడు. గతంలో కూడా ఆటగాళ్లకు తీవ్రమైన injuries వచ్చినప్పటికీ.. కాళ్లకు casts ఉన్నా కూడా బ్యాటింగ్‌కు వచ్చి తమ వంతు ప్రయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయని ఆకిబ్ జావేద్ గుర్తు చేశాడు. అందుకే ఇమామ్ విషయంలో జరిగినది చాలా serious matter అని, inquiry పూర్తయిన తర్వాత తగిన action తీసుకుంటామని స్పష్టం చేశాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.

PTI report ప్రకారం.. ఇమామ్ inquiry committee ముందు హాజరయ్యే సమయంలో legal counsel సహాయం తీసుకునే అవకాశం కూడా ఉందట. అంటే.. ఈ injury విషయంలో ఇమామ్ ఇప్పుడు కేవలం cricket inquiry నే ఎదుర్కోవడం కాదు.. legal support కూడా తీసుకునే పరిస్థితి రావచ్చన్నమాట. ఇక పాకిస్థాన్ క్రికెట్‌లో పరిస్థితులు ఇప్పటికే చాలా మారిపోయాయి. ఇంగ్లండ్‌తో వరుసగా రెండు టెస్ట్‌లు ఓడిపోయిన తర్వాత P C B ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను ఇంగ్లండ్ నుంచి వెనక్కి పిలిపించింది.

అదే సమయంలో head coach సర్ఫరాజ్ అహ్మద్, bowling coach ఉమర్ గుల్‌లను కూడా బాధ్యతల నుంచి తప్పించింది. ఇప్పుడు బర్మింగ్‌హామ్‌లో సెప్టెంబర్ 9 నుంచి జరగబోయే చివరి టెస్ట్‌కు కొత్త coaching staff బాధ్యతలు తీసుకోనుంది. మరోవైపు selectors ఐదుగురు uncapped players‌ ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే సైమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్‌లకు కూడా అవకాశం ఇచ్చారు. ఈ కొత్త ఆటగాళ్లందరి కలిపి టెస్ట్ అనుభవం కేవలం 10 matches మాత్రమే.

అందుకే చివరి టెస్ట్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో ఇప్పటికే pressure భారీగా ఉంది. ఇలాంటి సమయంలో ఇమామ్-ఉల్-హక్ injury పై inquiry మొదలవడం ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్‌లో మరో పెద్ద చర్చగా మారింది. మరి inquiry లో అసలు ఏం తేలుతుంది? ఇమామ్ injury నిజమేనా? లేక P C B మరింత కఠినమైన action తీసుకుంటుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles