Top 5 This Week

Related Posts

హార్దిక్ పాండ్యా షాకింగ్ కండిషన్.. గుజరాత్ టైటాన్స్ కూడా నో చెప్పిందా?

హార్దిక్ పాండ్యా IPL భవిష్యత్తుపై మరో ఆసక్తికరమైన ట్విస్ట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ నుంచి బయటకు వెళ్లాలని హార్దిక్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన తదుపరి జట్టు ఏది అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా 2027 IPL సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లతో ట్రేడ్ గురించి చర్చలు జరిపినట్లు రిపోర్టులు వచ్చాయి.

అయితే ఇప్పుడు మరో కీలక విషయము వెలుగులోకి వచ్చింది. హార్దిక్ పాండ్యా తన పాత జట్టు గుజరాత్ టైటాన్స్‌కు కూడా తిరిగి వెళ్లాలని ఆసక్తి చూపినట్లు సమాచారం. హార్దిక్ 2022లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ఆ జట్టును ఏకంగా IPL టైటిల్ విజేతగా నిలిపాడు. ఆ తర్వాత 2023లో కూడా గుజరాత్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. కానీ ఆ తర్వాత హార్దిక్ మళ్లీ ముంబై ఇండియన్స్‌కు వెళ్లాడు. ఇప్పుడు మళ్లీ గుజరాత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అసలు ట్విస్ట్ ఏంటంటే..

గుజరాత్ టైటాన్స్ కూడా హార్దిక్‌ను తిరిగి తీసుకోవడానికి మొదట ఆసక్తి చూపిందట. అంతేకాదు, ఈ విషయంపై గుజరాత్ ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కూడా చర్చించినట్లు సమాచారం. శుభ్‌మన్ గిల్ కూడా హార్దిక్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ హార్దిక్ పెట్టిన ఒక్క కండిషన్‌తో మొత్తం కథే మారిపోయింది. అదే.. కెప్టెన్సీ! గుజరాత్ టైటాన్స్‌కు తిరిగి రావాలంటే తనకు కెప్టెన్సీ ఇవ్వాలని హార్దిక్ కోరినట్లు రిపోర్ట్ వచ్చింది. ఈ కండిషన్ పెట్టిన వెంటనే గుజరాత్ టైటాన్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో నిర్ణయం తీసుకునే ప్రతి ఒక్కరూ హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వడానికి నో చెప్పినట్లు సమాచారం. అంటే హార్దిక్‌ను ఆటగాడిగా తిరిగి తీసుకోవడానికి గుజరాత్ సిద్ధంగానే ఉన్నా.. కెప్టెన్‌గా మాత్రం తీసుకోవడానికి ఒప్పుకోలేదన్నమాట. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయము ఉంది. హార్దిక్ పాండ్యా స్వయంగా ఏ IPL ఫ్రాంచైజీతోనూ నేరుగా మాట్లాడలేదని ఆయన ప్రతినిధి స్పష్టం చేశారు. ఏదైనా చర్చ జరిగితే అది ముంబై ఇండియన్స్ ద్వారానే జరిగిందని తెలిపారు.

మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా 2026 IPL సీజన్ తర్వాత తమ జట్టును పూర్తిగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కోచింగ్ స్టాఫ్ కూడా కొంతమంది సీనియర్ ఆటగాళ్లను “uncoachable” అని వ్యాఖ్యానించినట్లు రిపోర్టులు వచ్చాయి. దీంతో 2027 IPL వేలానికి ముందు ముంబై ఇండియన్స్ పలువురు సీనియర్ ఆటగాళ్లను వదులుకునే అవకాశం ఉందని సమాచారం. ఆ జాబితాలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మరి హార్దిక్ చివరికి ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగుతాడా? లేక చెన్నై, కోల్‌కతా లేదా గుజరాత్‌లో ఏదైనా ఒక జట్టుకు వెళ్తాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే గుజరాత్‌కు తిరిగి వెళ్లే విషయంలో మాత్రం కెప్టెన్సీ కండిషన్ హార్దిక్‌కు పెద్ద అడ్డంకిగా మారినట్లు కనిపిస్తోంది. ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles