Top 5 This Week

Related Posts

Vaibhav Sooryavanshiకి టీ20లో ఛాన్స్ ఎందుకు లేదు? Gambhir షాకింగ్ కామెంట్స్!

వెస్టిండీస్ తో వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియా.. మంగళవారం నుంచి టీ20 సిరీస్ (IND Vs WI) ఆడనుంది. ఈ క్రమంలో మరోసారి భారత ఓపెనింగ్ భాగస్వామ్యంపై చర్చ మొదలైంది. స్వదేశంలో ఆడనున్న ఈ సిరీస్లో యువ సంచలనం Vaibhav Sooryavanshiకి ఛాన్స్ ఇస్తారా? అనేది సందేహమే. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై హెడ్ కోచ్ Gautam Gambhir కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ గురించి ప్రస్తావిస్తూ.. ఫామ్లో ఉన్నప్పటికీ అతడికి అవకాశాలు కల్పించడం కష్టమవుతోందని అన్నాడు.

“ఇది నాక్కూడా కాస్త కొత్త అనుభవమే. వైభవ్ మంచి ఫామ్లో ఉన్న మాట వాస్తవమే. కానీ, జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదనేది అతడికి అర్థమయ్యేలా వివరించా. కొన్నిసార్లు ఉత్తమ ప్రదర్శన చేసే ఆటగాడైనా సరే.. అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. ఇక, తుది జట్టులో ఎవరు ఉండాలి అనేది సోషల్ మీడియా చర్చతోనో.. అవతలి వ్యక్తి అభిప్రాయాల మీదనో ఆధారపడి ఉండదు. డ్రెస్సింగ్ రూమ్లో ఎవరు ఉన్నారు? పరిస్థితులు ఎలా ఉన్నాయి? మ్యాచ్ను ఎవరు గెలిపించగలరు? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని కెప్టెన్, కోచ్ నిర్ణయం తీసుకుంటారు” అని జియోస్టార్ ‘ఫాలో ది బ్లూస్’ ఈవెంట్ లో గంభీర్ వెల్లడించారు.

“ఒకవేళ ఇప్పుడు వైభవ్ను ఆడిస్తే.. అభిషేక్, సంజులలో ఎవరిని తప్పించాలనే దానిపై నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. గత కొంతకాలంగా మంచి ప్రభావం చూపిస్తున్న కాంబినేషన్ను ఉన్నట్టుండి మార్చేయలేం. రెండు, మూడు వైఫల్యాలు కన్పించగానే.. సీనియర్ల స్థానంలో టాలెంట్ పేరుతో యువ ఆటగాళ్లను తీసుకోవడం కూడా పద్ధతి కాదు. పాపులర్ అయ్యే నిర్ణయాలు తీసుకోవడం సులువే కానీ, సరైన నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైన పని. సంజు-అభిషేక్ జోడీని కొనసాగించి మేం మంచి నిర్ణయమే తీసుకున్నామని అనిపిస్తోంది” అని హెడ్ కోచ్ వివరించాడు.
ఈ ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్లో అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగు పెట్టాడు వైభవ్ సూర్యవంశీ. అయితే, స్వదేశంలో అఫ్గానిస్థాన్తో జరిగిన టీ20 సిరీస్లో ఈ యువఆటగాడికి ఛాన్స్ దక్కలేదు. ఇటీవలే ఆసియా గేమ్స్ లో వైభవ్ టీమ్ ఇండియా తుది జట్టులో చోటుదక్కించుకున్నాడు. శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్లో 21 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఇక, ఈ టోర్నీలో పాక్ తో జరిగిన ఫైనల్లో 15 పరుగులు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles