Top 5 This Week

Related Posts

భువీ, షమీకి టీమిండియా తలుపులు మూసుకుపోయాయా? మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

భువనేశ్వర్, షమీకి 2027 వరల్డ్ కప్ ఛాన్స్ ఉందా? టీమిండియా స్టార్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ.. మళ్లీ భారత జట్టులోకి వస్తారా? 2027 వన్డే వరల్డ్ కప్‌లో వీరిద్దరిలో ఎవరికైనా చోటు దక్కుతుందా? దీనిపై మాజీ టీమిండియా ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. IPL లో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. 2027 వరల్డ్ కప్‌కు అతన్ని ఎంపిక చేయడం అంత సులభం కాదని చోప్రా అన్నారు. అసలు సమస్య ఏంటంటే.. భువీ ప్రస్తుతం రెగ్యులర్‌గా 50 ఓవర్ల క్రికెట్, రంజీ ట్రోఫీ లాంటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడటం లేదు. చోప్రా మాట్లాడుతూ.. భువీ అంటే తనకు చాలా ఇష్టమని, అతను మళ్లీ భారత్ తరఫున ఆడాలని కోరుకుంటున్నానని చెప్పారు.

కానీ రంజీ ట్రోఫీ ఆడకపోవడం వల్ల అతని workload చాలా తక్కువగా ఉంటుందని అన్నారు. ఎందుకంటే వన్డే మ్యాచ్‌లో ఒక బౌలర్ 10 ఓవర్లు వేయాలి. అంతేకాదు 50 ఓవర్లు ఫీల్డింగ్ కూడా చేయాలి. అంటే శరీరంపై చాలా ఒత్తిడి ఉంటుంది. కేవలం T20 క్రికెట్ ఆడి.. ఒక్కసారిగా 50 ఓవర్ల వరల్డ్ కప్ ఆడటం అంత సులభం కాదని చోప్రా అభిప్రాయపడ్డారు. భువనేశ్వర్ 2024 జనవరి తర్వాత ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడలేదు. 2023 డిసెంబర్ తర్వాత List-A మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే IPL లో మాత్రం భువీ అదరగొడుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు IPL టైటిల్స్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అయినా..

కేవలం IPL లో నాలుగు ఓవర్లు బాగా బౌలింగ్ చేశాడని చెప్పి, 50 ఓవర్ల వరల్డ్ కప్‌కు ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని చోప్రా అన్నారు. భువీని 2027 వరల్డ్ కప్‌లో ఆడించాలనుకుంటే.. ఇప్పటి నుంచే O D I జట్టులోకి తీసుకుని కనీసం ఒక సంవత్సరం పాటు సిద్ధం చేయాలని సూచించారు. ఇక మహమ్మద్ షమీ విషయానికి వస్తే.. ప్రస్తుతం షమీకి భువీ కంటే కొంచెం ఎక్కువ అవకాశం ఉందని చోప్రా చెప్పారు. ఎందుకంటే షమీ రంజీ ట్రోఫీలో ఆడి 37 వికెట్లు తీశాడు. అంతేకాదు.. ఇప్పుడు దులీప్ ట్రోఫీలో కూడా ఆడబోతున్నాడు.

అయితే IPL ప్రదర్శనను మాత్రమే చూస్తే మాత్రం భువనేశ్వర్ షమీ కంటే ముందున్నాడని చోప్రా చెప్పారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే.. 2027 వరల్డ్ కప్ కోసం భువీ, షమీలిద్దరినీ సెలెక్టర్లు తీసుకునే అవకాశం లేదని చోప్రా అభిప్రాయపడ్డారు. ఇద్దరిలో గరిష్ఠంగా ఒక్కరికే అవకాశం రావచ్చని అన్నారు. రాబోయే నాలుగు నుంచి ఆరు నెలల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగే O D I సిరీస్‌కు భువీ లేదా షమీలో ఎవరు ఎంపిక అవుతారో చూస్తే.. సెలెక్టర్ల ప్లాన్ ఏంటో అర్థమవుతుందని అన్నారు. ఒకవేళ ఇద్దరిలో ఎవరినీ న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేయకపోతే.. 2027 వరల్డ్ కప్‌లో వారి అవకాశాలు దాదాపు ముగిసినట్టేనని చోప్రా అభిప్రాయపడ్డారు.

మరి భువనేశ్వర్ లేదా షమీలో ఎవరు మళ్లీ టీమిండియాలోకి వస్తారు? లేక ఇద్దరికీ చోటు దక్కదా? దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. “ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles