శుభ్‌మన్ గిల్ 27వ పుట్టినరోజు సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. అయితే గిల్‌కు యువరాజ్ చెప్పిన బర్త్‌డే విషెస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సెప్టెంబర్ 8, 1999న పంజాబ్‌లోని ఫజిల్కాలో జన్మించిన శుభ్‌మన్ గిల్.. చిన్న వయసులోనే క్రికెట్‌లో తన టాలెంట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2018 అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన గిల్.. ఆ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు.
ఆ తర్వాత 2019లో వన్డేల్లోకి అరంగేట్రం చేసిన గిల్.. 2020-21 ఆస్ట్రేలియా టూర్‌లో టెస్ట్ క్రికెట్‌లో తన సత్తా చూపించాడు. గబ్బాలో జరిగిన టెస్ట్‌లో గిల్ 91 పరుగులు చేసి భారత్ చారిత్రాత్మక విజయానికి కీలకంగా నిలిచాడు. ఆ తర్వాత చటోగ్రామ్‌లో తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. 2023 జనవరిలో న్యూజిలాండ్‌పై 208 పరుగులు చేసి.. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. IPL లో కూడా గిల్ అద్భుతంగా రాణించాడు. 2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
2025 సీజన్‌లో 650 పరుగులు చేసిన గిల్.. 2026లో ఏకంగా 732 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. 2025 ఇంగ్లండ్ టూర్‌కు గిల్‌ను భారత టెస్ట్ కెప్టెన్‌గా నియమించారు. ఈ సిరీస్‌లో గిల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 754 పరుగులు చేశాడు. 75.40 యావరేజ్‌తో నాలుగు సెంచరీలు, కెరీర్ బెస్ట్ 269 పరుగులు సాధించాడు. దీంతో ఐదు టెస్టుల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో కూడా గిల్ టీమిండియాను 1-0 తేడాతో గెలిపించాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ గిల్ అద్భుతమైన రికార్డుతో దూసుకెళ్తున్నాడు.
43 టెస్టుల్లో 3,043 పరుగులు, 67 వన్డేల్లో 3,379 పరుగులు, 36 T20 ల్లో 869 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 11 టెస్ట్ సెంచరీలు, 9 వన్డే సెంచరీలు, ఒక T20 సెంచరీ ఉన్నాయి. ఇక గిల్ 27వ పుట్టినరోజు సందర్భంగా యువరాజ్ సింగ్ తన Instagram స్టోరీలో.. “హ్యాపీ బర్త్‌డే ప్రిన్స్.. నువ్వు రోజురోజుకూ ఎదుగుతూ, ఇంత ప్రశాంతంగా బాధ్యతలు తీసుకోవడం చూడటం చాలా ఆనందంగా ఉంది. కష్టపడుతూ ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలి..
ఇంకా ఎన్నో సెంచరీలు చేయాలి” అంటూ విషెస్ తెలిపాడు. మరోవైపు రాజీవ్ శుక్లా కూడా గిల్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ.. అతని బ్యాటింగ్ స్టైల్, పరుగులు చేయాలనే తపన, కెప్టెన్సీని ప్రశంసించారు. గిల్ ఇలాగే దేశానికి మరెన్నో విజయాలు అందించాలని ఆకాంక్షించారు. మరి 27 ఏళ్ల వయసులోనే ఇంతటి రికార్డులు సాధించిన గిల్.. భవిష్యత్తులో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి! “


