ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందే కేఎల్ రాహుల్ తన ఫ్యూచర్‌పై క్లారిటీ ఇచ్చేశాడు! ఇన్ని రోజులు ఢిల్లీ క్యాపిటల్స్‌లో రాహుల్ ఉంటాడా? మరో జట్టుకు ట్రేడ్ అవుతాడా? అంటూ వచ్చిన అన్ని రూమర్స్‌కు ఇప్పుడు ఫుల్‌స్టాప్ పడింది. అసలు కేఎల్ రాహుల్ ఏం చెప్పాడు? ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ చేసిన పోస్ట్‌కు రాహుల్ ఇచ్చిన రిప్లై ఏంటి? ఇప్పుడు చూద్దాం. 2026 ఐపీఎల్ సీజన్ ముగిసినప్పటి నుంచి ఫ్రాంచైజీల మధ్య ప్లేయర్ ట్రేడ్స్‌పై చాలా వార్తలు, రూమర్స్ వచ్చాయి. ఇప్పటికే రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్‌కు సంబంధించిన ట్రేడ్ కూడా అధికారికంగా జరిగింది.
ఇలాంటి సమయంలో కేఎల్ రాహుల్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడి మరో జట్టుకు వెళ్తాడనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ రూమర్స్ అన్నింటికీ రాహుల్ స్వయంగా చెక్ పెట్టేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కో-ఓనర్ పార్థ్ జిందాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కేఎల్ రాహుల్ గురించి ఒక పోస్ట్ చేశాడు. రాహుల్‌ను ప్రశంసిస్తూ.. అతడిని జట్టుకు చాలా కీలకమైన ఆటగాడిగా అభివర్ణించాడు. రాహుల్ ఎప్పుడూ తన కంటే ముందు టీమ్‌ను ఉంచుతాడని చెప్పాడు. అంతేకాదు.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇంకా పూర్తి చేయాల్సిన పని ఉందని, కలిసి కష్టపడి ఢిల్లీకి గర్వకారణంగా నిలిచేలా చేస్తామని పార్థ్ జిందాల్ చెప్పాడు.
ఈ పోస్ట్‌కు కేఎల్ రాహుల్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు అసలు విషయము బయటపెట్టింది. రాహుల్.. “థ్యాంక్యూ, రాబోయే సీజన్ కోసం ఎదురుచూడలేకపోతున్నాను” అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో కేఎల్ రాహుల్ IPL 2027లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫునే ఆడబోతున్నాడని దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. 2025 ఐపీఎల్ సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ రాహుల్‌ను 14 కోట్లకు జట్టులోకి తీసుకుంది. ఆ తర్వాత ఢిల్లీ తరఫున రాహుల్ రెండు అద్భుతమైన సీజన్లు ఆడాడు. 2025లో ఏకంగా 539 పరుగులు చేశాడు. ఇక 2026 సీజన్‌లో కూడా తన బ్యాటింగ్‌తో అదరగొట్టి 593 పరుగులు సాధించాడు.
అంతకుముందు రాహుల్ పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌కు మూడు సీజన్ల పాటు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక మరోవైపు హార్దిక్ పాండ్యా విషయంలో కూడా కొత్త అప్‌డేట్ వచ్చింది. హార్దిక్ ముంబై ఇండియన్స్‌ను వీడి మరో జట్టుకు ట్రేడ్ అవుతాడంటూ చాలా నెలలుగా రూమర్స్ వస్తున్నాయి. కానీ ప్రస్తుతం హార్దిక్ మరో ఏడాది ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆసక్తికరమైన విషయము ఏంటంటే.. హార్దిక్ కెప్టెన్‌గా కొనసాగకపోయినా ముంబైలోనే ఉండే అవకాశం ఉందట.
హార్దిక్‌కు సంబంధించి ఇతర జట్లతో ట్రేడ్ చర్చలు ఇంకా ముందుకు వెళ్లలేదని సమాచారం. ముంబై ఇండియన్స్‌కు సరైన డీల్ దొరకకపోవడంతో హార్దిక్‌ను కొనసాగించే ఆలోచనలో ఫ్రాంచైజీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీలో మాత్రం మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్‌లోనే కొనసాగుతాడనే క్లారిటీ రావడంతో అతడి ట్రేడ్ రూమర్స్‌కు చెక్ పడినట్టే!


