Top 5 This Week

Related Posts

“క్రికెట్ అని పిలవొద్దు.. ‘టీ20’ అనండి! రికీ పాంటింగ్ సంచలన ప్రతిపాదన”

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అమెరికాలో క్రికెట్‌ను మరింత పాపులర్ చేయాలంటే.. అసలు ‘క్రికెట్’ అనే పేరునే పక్కన పెట్టాలని పాంటింగ్ సూచించాడు. అమెరికాలో ఈ ఆటను కేవలం ‘T20’ పేరుతో ప్రమోట్ చేయాలని చెప్పాడు. అయితే పాంటింగ్ ఎందుకు ఇలాంటి షాకింగ్ ఐడియా ఇచ్చాడు?

అమెరికాలో క్రికెట్ అంటే చాలామంది వెంటనే టెస్ట్ క్రికెట్, ఐదు రోజుల మ్యాచ్‌లు, చాలా సేపు కొనసాగే ఆట అని అనుకుంటారని పాంటింగ్ చెబుతున్నాడు. కానీ T20 అలా కాదు. కేవలం కొన్ని గంటల్లో మ్యాచ్ పూర్తవుతుంది. ఫోర్లు, సిక్సర్లు, వేగంగా మారే పరిస్థితులతో చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అందుకే అమెరికాలో కొత్తగా క్రికెట్‌ను పరిచయం చేసేటప్పుడు.. ‘క్రికెట్’ అనే పదాన్ని కాకుండా ‘T20’ అనే పేరుతో ప్రమోట్ చేస్తే బెటర్ అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.

తాను ట్రెడిషనల్ క్రికెట్‌ను ఇష్టపడే వ్యక్తినని, T20 కంటే టెస్ట్ క్రికెట్‌నే ఎక్కువగా ఆడానని పాంటింగ్ చెప్పాడు. అయినా.. అమెరికాలో కొత్త ప్రేక్షకులను ఆకర్షించడానికి అవసరమైతే ఆటను పూర్తిగా కొత్తగా బ్రాండ్ చేయడానికి కూడా తాను సిద్ధమే అన్నాడు. అంతేకాదు.. అమెరికన్లకు T20 ని అర్థమయ్యేలా చేయడానికి బేస్‌బాల్‌తో పోల్చాలని పాంటింగ్ సూచించాడు. బేస్‌బాల్‌లో ఒక మ్యాచ్‌లో హోమ్ రన్స్ చాలా తక్కువగా ఉంటాయి.

కానీ T20 లో ఒక మ్యాచ్‌లోనే 15 సిక్సర్లు కొట్టే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అమెరికా యువతకు అర్థమయ్యేలా చెప్పాలని పాంటింగ్ అన్నాడు. అమెరికాలో క్రికెట్‌ను పెంచడానికి ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2024లో అమెరికా T20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. అలాగే మేజర్ లీగ్ క్రికెట్ కూడా అక్కడ మొదలైంది. పాంటింగ్ స్వయంగా వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. ఇక 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో కూడా క్రికెట్ తిరిగి రాబోతోంది.

దీంతో అమెరికాలో క్రికెట్‌కు మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అందుకే అమెరికా ప్రేక్షకులకు క్రికెట్‌ను టెస్ట్‌లా కాకుండా.. ఫాస్ట్, ఎంటర్‌టైనింగ్ స్పోర్ట్‌గా T20 రూపంలో చూపించాలి అనేది పాంటింగ్ ఆలోచన. మరి పాంటింగ్ చెప్పినట్టు అమెరికాలో క్రికెట్ పేరు మార్చి కేవలం T20 గా ప్రమోట్ చేస్తే నిజంగానే ఈ ఆటకు భారీ ఫ్యాన్‌బేస్ వస్తుందా?
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles