Top 5 This Week

Related Posts

అభిషేక్ శర్మ అర్ధ సెంచరీ వృథా! ఐర్లాండ్ చేతిలో భారత్ చారిత్రక ఓటమి

ఐర్లాండ్ చేతిలో టీ twenty ప్రపంచ ఛాంపియన్ భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. బెల్‌ఫాస్ట్‌లో జరిగిన తొలి టీ twentyమ్యాచ్‌లో భారత్ 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మ్యాచ్ అనంతరం మాట్లాడిన అభిషేక్ శర్మ, జట్టు పరిస్థితులకు త్వరగా అలవాటు పడలేకపోయిందని చెప్పాడు. వరుసగా మ్యాచ్‌లు ఆడేటప్పుడు ఏ దేశంలోనైనా అక్కడి పిచ్, వాతావరణం ఎలా ఉందో చాలా త్వరగా అర్థం చేసుకోవాలని, అదే విజయానికి కీలకమని తెలిపాడు.

అభిషేక్ మాట్లాడుతూ… “ఒక బలమైన జట్టుగా మేము పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి. ప్రాక్టీస్ సెషన్లు ఉన్నా, మ్యాచ్‌లు వరుసగా వచ్చినా వెంటనే సిద్ధంగా ఉండాలి. ఈరోజు కూడా అదే ప్రయత్నం చేశాం. కానీ దురదృష్టవశాత్తు అది సాధ్యపడలేదు” అని చెప్పాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే… ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్ లోర్కన్ టక్కర్ అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా, గారెత్ డెలానీ 49 పరుగులు చేశాడు. చివర్లో జార్జ్ డాక్రెల్ వేగంగా పరుగులు చేసి జట్టు స్కోర్‌ను 182కు తీసుకెళ్లాడు.

భారత్ బౌలర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన చేశాడు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు అభిషేక్ శర్మ అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడుతూ కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 20 బంతుల్లో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.

అయితే మరోవైపు మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ త్వరగా అవుట్ అయ్యారు. తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కూడా పెద్దగా పరుగులు చేయలేకపోయారు.శివమ్ దూబే 16 బంతుల్లో 25 పరుగులు చేసి కాసేపు పోరాడినా, అతను అవుట్ అయిన తర్వాత భారత్ పూర్తిగా ఒత్తిడిలో పడిపోయింది.  చివరకు భారత జట్టు 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయి 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

ఐర్లాండ్ బౌలర్లలో మాథ్యూ హంఫ్రీస్, మాథ్యూ హోలార్డ్ చెరో మూడు వికెట్లు తీశారు. అరంగేట్ర మ్యాచ్ ఆడిన జై మూంద్రా కూడా రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.ఈ విజయంతో ఐర్లాండ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతేకాకుండా అన్ని ఫార్మాట్లలో భారత్‌పై ఐర్లాండ్ సాధించిన తొలి విజయంగా ఇది చరిత్రలో నిలిచింది.ఇప్పుడు అందరి దృష్టి రెండో టీ twenty మ్యాచ్‌పైనే ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే సిరీస్‌ను కూడా కోల్పోవాల్సి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles