Top 5 This Week

Related Posts

యూరప్‌లో క్రికెట్ అభివృద్ధికి ETPLదే కీలక పాత్ర: గ్లెన్ మ్యాక్స్‌వెల్

యూరప్‌లో క్రికెట్‌కు కొత్త ఊపు రాబోతోందా? అవుననే అంటున్నారు గ్లెన్ మ్యాక్స్‌వెల్, రవిచంద్రన్ అశ్విన్, స్కాట్ ఎడ్వర్డ్స్. యూరోపియన్ T20 ప్రీమియర్ లీగ్.. అంటే E T P L .. ఆగస్టు 26 న తన తొలి సీజన్‌ను ప్రారంభించబోతోంది. ఈ టోర్నీలో అంతర్జాతీయ అనుభవం ఉన్న స్టార్ ప్లేయర్లతో పాటు యూరప్‌కు చెందిన యువ క్రికెటర్లు కూడా ఆడబోతున్నారు. ఈ కొత్త లీగ్ యూరప్‌లో క్రికెట్ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుందని మ్యాక్స్‌వెల్, అశ్విన్, ఎడ్వర్డ్స్ నమ్ముతున్నారు. ఇక మ్యాక్స్‌వెల్ విషయానికి వస్తే..

ఆయన Belfast Wolves జట్టుకు కో-ఓనర్ తో పాటు captain గా కూడా ఉన్నారు. డ్రాఫ్ట్ సమయంలో జట్టును మొదటి నుంచి తయారు చేయడం తనకు కొత్త అనుభవమని మ్యాక్స్‌వెల్ చెప్పాడు. మొదటి మ్యాచ్ నుంచే గెలిచేలా జట్టును తయారు చేయాలని తమకు స్పష్టమైన ప్లాన్ ఉందని తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మంచి depth ఉండేలా ఆటగాళ్లను ఎంపిక చేశామని, సుదీర్ఘ టోర్నీలో ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పాడు. మరోవైపు మాజీ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్..

Dublin Guardians జట్టుకు captain, mentor గా బాధ్యతలు తీసుకున్నాడు. ఈ జట్టుతో కలిసి పనిచేస్తున్న మాజీ భారత కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌తో తనకు గత ఐదేళ్లుగా మంచి అనుబంధం ఉందని అశ్విన్ చెప్పాడు. ద్రవిడ్ దగ్గర ఆడుతున్న సమయంలో నాయకత్వం గురించి చాలా నేర్చుకున్నానని తెలిపాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఐర్లాండ్, యూరప్ క్రికెట్ కోసం పనిచేయడం తనకు చాలా ప్రత్యేకంగా ఉందని అశ్విన్ అన్నాడు. ఐర్లాండ్‌లో ఇప్పటికే మంచి క్రికెట్ సంస్కృతి ఉందని, దాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తాము సహకరించాలనుకుంటున్నామని చెప్పాడు.

ఇక Netherlands వికెట్ కీపర్-బ్యాటర్ Scott Edwards కూడా E T P L పై చాలా ఉత్సాహంగా ఉన్నాడు. Amsterdam Flames జట్టు co-owners అయిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ Steve Waugh, మాజీ హాకీ స్టార్ Jamie Dwyer తనను సంప్రదించి జట్టు ప్రణాళికను వివరించారని Edwards చెప్పాడు. Steve Waugh చిన్నప్పటి నుంచి తనకు ఇష్టమైన క్రికెటర్ అని, ఆయనతో కలిసి ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.

మొత్తంగా చూస్తే.. E T P L కేవలం మరో T20 లీగ్‌గా కాకుండా యూరప్‌లో క్రికెట్‌ను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్లు భావిస్తున్నారు. మరి ఆగస్టు 26 న ప్రారంభమయ్యే E T P L యూరప్ క్రికెట్‌ను ఎంతవరకు మార్చబోతుందో చూడాలి! ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles