Top 5 This Week

Related Posts

కృష్ణాష్టమి సందర్భంగా క్రికెట్ ప్రముఖుల విషెస్.. జై షా నుంచి రైనా వరకు!

కృష్ణాష్టమి సందర్భంగా క్రికెట్ స్టార్స్ స్పెషల్ విషెస్.. జై షా, సెహ్వాగ్, రైనా ఏం చెప్పారంటే? దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. క్రికెట్ ప్రముఖులు కూడా శ్రీకృష్ణుడిని గుర్తు చేసుకుంటూ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ టీమిండియా క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్‌తో పాటు ఐసీసీ చైర్మన్ జై షా..

కృష్ణాష్టమి సందర్భంగా తమ అభిమానులకు ప్రత్యేక విషెస్ చెప్పారు. ముందుగా వీరేంద్ర సెహ్వాగ్ విషయానికి వస్తే.. ఆయన సోషల్ మీడియాలో శ్రీకృష్ణుడి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. “హాథీ ఘోడా పాల్ కీ.. జై కన్హయ్య లాల్ కీ” అంటూ కృష్ణుడి పేరుతో తన విషెస్ చెప్పిన సెహ్వాగ్.. కృష్ణాష్టమి వేడుకలు వెన్నంత తియ్యగా, కన్హయ్య రాసలీలల్లా ఉత్సాహంగా ఉండాలని కోరుకున్నారు.

ఇక సురేశ్ రైనా కూడా ప్రత్యేకంగా విషెస్ తెలిపాడు. “రాధే రాధే” అంటూ తన పోస్ట్‌ను మొదలుపెట్టిన రైనా.. నందలాల్ జన్మదిన సందర్భంగా అందరికీ ప్రేమ, శాంతి, ఆనందం, సంపద కలగాలని శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు. మరోవైపు ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ కూడా కృష్ణాష్టమి సందర్భంగా ఆసక్తికరమైన సందేశాన్ని పంచుకుంది.

శ్రీకృష్ణుడి నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చని ఆమె చెప్పింది. చిన్నతనంలో కృష్ణుడు అల్లరి, ఆటపాటలతో ఉన్నా.. ఎప్పుడూ నిజం, ధర్మం వైపే నిలబడ్డాడని తెలిపింది. ప్రేమ, ధైర్యం, జ్ఞానం మాత్రమే కాదు.. ఎన్నో కష్టాలు ఎదురైనా ప్రశాంతంగా ఉండటం కూడా కృష్ణుడి నుంచి నేర్చుకోవాలని మను భాకర్ చెప్పింది. ఇక ఐసీసీ చైర్మన్ జై షా కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సవాల్‌ను ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రతి విజయాన్ని వినయంతో స్వీకరించాలని, జీవిత ప్రయాణంలో నమ్మకంతో ముందుకు సాగాలని శ్రీకృష్ణుడు మనకు ప్రేరణ ఇవ్వాలని జై షా కోరుకున్నారు.

కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణుడి జన్మదినం. విష్ణుమూర్తి ఎనిమిదో అవతారంగా భావించే శ్రీకృష్ణుడి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, మంగళ హారతులు నిర్వహించారు. ముఖ్యంగా మథుర, బృందావన్ ప్రాంతాల్లో కృష్ణుడితో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా వేడుకలు మరింత ఘనంగా జరిగాయి. మరి క్రికెట్ స్టార్స్ చెప్పిన ఈ కృష్ణాష్టమి విషెస్‌లో మీకు ఎవరి మాటలు ఎక్కువగా నచ్చాయి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles