
“క్రికెట్ గురించి మా అమ్మకి పెద్దగా తెలియదు… కానీ ఆమె సపోర్ట్ మాత్రం ఎప్పుడూ నాతోనే ఉంది!” — ఈ ఒక్క మాటతో ఇప్పుడు మొత్తం IPL ప్రపంచం మాట్లాడుకుంటోంది, యువ ఆటగాడు మాధవ్ తివారి గురించి! అసలు ఎవరు ఈ మాధవ్ తివారి? నిన్నటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని ఈ 22 ఏళ్ల ఆల్‌రౌండర్… ఒక్క మ్యాచ్‌తోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్‌ను, దాదాపు ఓడించేశామనుకున్న సమయంలో… క్రీజ్‌లోకి వచ్చిన ఈ యువ ఆటగాడు, ఒత్తిడిని ఏమాత్రం ఫీలవకుండా మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు! ఇదే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న అసలు కథ!
సోమవారం జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో, పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి ఢిల్లీ బౌలర్లను చితక్కొట్టింది. ప్రియాంశ్ ఆర్యా కేవలం 33 బంతుల్లో 56 పరుగులు చేసి, పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను పూర్తిగా PBKS వైపు తిప్పేశాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌తో కలిసి కేవలం ఏడు ఓవర్లలో, 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మరోసారి, తన క్లాస్ చూపిస్తూ 36 బంతుల్లో అజేయంగా, 59 పరుగులు చేశాడు. ఇటీవలి మ్యాచ్‌ల్లో కూడా అయ్యర్ అద్భుత ఫామ్‌లో ఉండటం, PBKS కి భారీ బూస్ట్‌గా మారింది. ఇక కూపర్ కానోలీ 38 పరుగులు జోడించడంతో, పంజాబ్ 210/5 అనే భారీ స్కోర్ నమోదు చేసింది.
211 పరుగుల టార్గెట్ ఛేజ్ చేస్తూ, ఢిల్లీ క్యాపిటల్స్ మొదట్లోనే కష్టాల్లో పడింది. స్కోర్ 74/4 అయ్యేసరికి మ్యాచ్ పూర్తిగా, పంజాబ్ చేతుల్లోకి వెళ్లిపోయిందని అందరూ అనుకున్నారు. సోషల్ మీడియాలో కూడా “DC మ్యాచ్ ముగిసింది” అంటూ పోస్టులు మొదలయ్యాయి. కానీ అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది! కెప్టెన్ అక్షర్ పటేల్ మరోసారి తన బాధ్యతను గుర్తుచేసుకుంటూ , కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి అనుభవజ్ఞుడు డేవిడ్ మిల్లర్ సపోర్ట్ ఇవ్వడంతో, మ్యాచ్ మళ్లీ ఢిల్లీ వైపు తిరిగింది. అయితే చివరి ఓవర్లలో ఒత్తిడి మళ్లీ పెరిగినప్పుడు… స్టేడియం మొత్తం టెన్షన్‌లో ఉన్న సమయంలో… క్రీజ్‌లో ఉన్న ఇద్దరు యువ ఆటగాళ్లు మాత్రం కూల్‌గా కనిపించారు — అశుతోష్ శర్మ మరియు మాధవ్ తివారి!
మాధవ్ తివారి ఆడిన చిన్న ఇన్నింగ్స్, స్కోర్‌బోర్డ్‌లో పెద్దగా కనిపించకపోవచ్చు… కానీ మ్యాచ్ పరిస్థితిని చూస్తే అది బంగారంలాంటి ఇన్నింగ్స్. ఒత్తిడిలో కూడా ఒక్కసారి కూడా టెన్షన్ పడకుండా ఆడటం, అందరినీ ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ మాధవ్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “ఇది నా రెండో IPL సీజన్. ఇప్పుడు ఈ వాతావరణానికి అలవాటు పడిపోయాను. మా టీమ్ మేనేజ్‌మెంట్, సీనియర్లు చాలా సపోర్ట్ చేస్తారు. కానీ చివరికి నర్వ్స్ కంట్రోల్ చేయాల్సింది మనమే,” అని చెప్పాడు.
ఇండోర్‌కు చెందిన మాధవ్ చిన్నప్పటి నుంచే బ్యాట్స్‌మన్ కావాలనుకున్నాడట! “నాకు బ్యాటింగ్ చాలా ఇష్టం. బౌలింగ్ చాలా అలసటగా అనిపించేది,” అని నవ్వుతూ చెప్పాడు. కానీ అతని కోచ్, మాజీ భారత క్రికెటర్ అమయ్ ఖురాసియా మాత్రం, అతన్ని పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా తయారు చేయాలని నిర్ణయించుకున్నారట. “బ్యాటింగ్, బౌలింగ్ రెండూ ఎంత ముఖ్యమో అర్థమైన తర్వాత, రెండింటిపైనా సమానంగా కష్టపడ్డాను,” అని మాధవ్ చెప్పాడు.
ఇటీవల IPL లో యువ ఆటగాళ్లు, ఒత్తిడిలో విఫలమవుతున్న సందర్భాలు చాలా చూశాం. కానీ మాధవ్ మాత్రం స్టేడియంలో వేలాది మంది అరుస్తున్నా… తన ఫోకస్ మాత్రం ఒక్క క్షణం కూడా కోల్పోలేదు. “నేను క్రీజ్‌లో ఉన్నప్పుడు ప్రేక్షకుల శబ్దం కూడా వినిపించలేదు. నేను పూర్తిగా మ్యాచ్‌లోనే ఉన్నాను,” అని చెప్పాడు. ఇద్దరూ ఎలాంటి హడావిడి లేకుండా మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.
బ్యాటింగ్‌తో మాత్రమే కాదు… బౌలింగ్‌లో కూడా మాధవ్ ఆకట్టుకున్నాడు. క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. “సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే పిచ్ సహాయం చేసింది. నేను సరైన ఏరియాస్‌లో బౌలింగ్ చేయడంపైనే ఫోకస్ పెట్టాను,” అని తెలిపాడు.
అయితే ఈ అద్భుత ప్రదర్శన తర్వాత కూడా, మాధవ్ నేల మీదే ఉన్నాడు. “నా లక్ష్యం ఇండియా కోసం ఆడటం. బెస్ట్ ప్లేయర్ అవ్వాలి. కానీ ఇంకా చాలా కష్టపడాలి,” అని చెప్పాడు. అతని మాటల్లో కనిపించిన వినయం, అభిమానులను మరింత ఆకట్టుకుంది.
మాధవ్ కుటుంబం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో, చర్చనీయాంశంగా మారింది. “నా నాన్న ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తారు. మా కుటుంబం ఎప్పుడూ నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చింది. మా అమ్మకి క్రికెట్ గురించి పెద్దగా తెలియదు… కానీ ఆమె సపోర్ట్ మాత్రం ఎప్పుడూ ఉంది,” అని చెప్పినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారు.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ విజయం ప్లేఆఫ్ ఆశలను ఇంకా బ్రతికించింది. కానీ IPL అభిమానుల కోసం మాత్రం ఈ మ్యాచ్, ఒక కొత్త స్టార్ జన్మించిన రాత్రిగా గుర్తుండిపోవచ్చు. ఎందుకంటే… నిన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని మాధవ్ తివారి… ఇప్పుడు ఒక్క మ్యాచ్‌తో దేశం మొత్తం మాట్లాడుకునే ఆటగాడు అయ్యాడు!


