భారత క్రికెట్‌లో మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? టీ twenty ప్రపంచకప్‌ను గెలిపించిన కెప్టెన్‌కు ఇప్పుడు షాక్ తగలబోతుందా? ఒకప్పుడు భారత టీ twenty జట్టులో చోటు కోల్పోయిన ఆటగాడు, ఇప్పుడు నేరుగా కెప్టెన్‌గా ఎంపిక కావడం వెనుక అసలు కథ ఏమిటి? సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు ఏమవుతుంది? బీసీసీఐలో జరుగుతున్న తాజా పరిణామాలు ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వీడియోలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి ఎలా చేరుకున్నాడు, సూర్యకుమార్ ఎందుకు వెనక్కి వెళ్లాడు అనే ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
కొన్ని నెలల క్రితం వరకు శ్రేయస్ అయ్యర్ పేరు, భారత టీ twenty జట్టులో కూడా పెద్దగా వినిపించలేదు. 2023 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ twenty, మ్యాచ్ తర్వాత ఆయనకు జట్టులో అవకాశాలు రాలేదు. కానీ క్రికెట్‌లో పరిస్థితులు ఎంత వేగంగా మారుతాయో మరోసారి నిరూపితమైంది. ఇప్పుడు అదే శ్రేయస్ అయ్యర్ భారత టీ twenty జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపిక కాబోతున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఐపీఎల్ 2026 లో శ్రేయస్ అయ్యర్ చూపించిన అద్భుత ప్రదర్శన. పంజాబ్ కింగ్స్ తరఫు న ఆడిన అయ్యర్ మొత్తం 498 పరుగులు చేసి, జట్టుకు కీలక విజయాలు అందించాడు. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా బ్యాటింగ్ చేయడం, జట్టును ముందుండి నడిపించడం సెలెక్టర్లను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో ఆయన ఆడిన ఇన్నింగ్స్‌లు, భారత జట్టు భవిష్యత్ నాయకుడిగా ఆయనను నిలబెట్టాయి.
ఇక మరోవైపు సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. 2026 టీ twenty ప్రపంచ కప్‌లో భారత జట్టును విజయవంతంగా నడిపించి, వరుసగా రెండోసారి ట్రోఫీని అందించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. టీ twenty ప్రపంచ కప్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. అయితే కెప్టెన్‌గా విజయం సాధించినప్పటికీ బ్యాట్స్‌మన్‌గా సూర్యకుమార్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రపంచ కప్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం 242 పరుగులు మాత్రమే చేశాడు.ఐపీఎల్ 2026 లో కూడా సూర్య ఫామ్ పూర్తిగా నిరాశపరిచింది. ముంబై ఇండియన్స్ తరఫున కేవలం 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని అనుభవం ఉన్నప్పటికీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు చాలా తక్కువగా కనిపించాయి. ఫలితంగా ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలవాల్సి వచ్చింది. జట్టు వైఫల్యానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, స్టార్ ఆటగాడిగా సూర్య నుంచి అభిమానులు ఎక్కువ ఆశించారు.
ఇదే సమయంలో భారత జట్టు భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్లను, సిద్ధం చేయాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వంటి దిగ్గజాల నుంచి టీ twenty బాధ్యతలను కొత్త తరం ఆటగాళ్లకు, అప్పగించినట్లే ఇప్పుడు మరోసారి అదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారట. 2028 టీ twenty ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని, కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలనే ప్రణాళిక నడుస్తున్నట్లు సమాచారం.మాజీ భారత వికెట్ కీపర్ సాబా కరీమ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను చూస్తే సూర్యకుమార్ భవిష్యత్ ప్రణాళికల్లో సెలెక్టర్ల, ఆలోచనలకు సరిపోవడం లేదని ఆయన పేర్కొన్నాడు. ప్రపంచ కప్‌లోనూ, ఐపీఎల్‌లోనూ సూర్య బ్యాటింగ్‌లో స్థిరత్వం కనిపించలేదని, అందుకే సెలెక్టర్లు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పాడు.
ఇక వైస్ కెప్టెన్ పదవి కోసం మరో యువ ఆటగాడు తిలక్ వర్మ పేరు బలంగా వినిపిస్తోంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మరియు సెలక్షన్ కమిటీ సభ్యులు తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా తిలక్ వర్మ చూపిస్తున్న అద్భుత ప్రదర్శనలు అతనికి ఈ అవకాశాన్ని తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది.భారత జట్టు త్వరలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు టీ twenty మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టీ twenty లు, మూడు వన్డేలు ఆడనుంది. జూన్ 26 న మొదటి టీ twenty మ్యాచ్, జూన్ 28న రెండో మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌ల కోసం ఎంపికయ్యే జట్టులో శ్రేయస్ అయ్యర్ తిరిగి చోటు దక్కించుకోవడమే కాకుండా, కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
అయితే అసలు ప్రశ్న ఒక్కటే. ప్రపంచ కప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ నిజంగానే కెప్టెన్సీ కోల్పోతాడా? లేక బీసీసీఐ చివరి క్షణంలో మరో నిర్ణయం తీసుకుంటుందా? శ్రేయస్ అయ్యర్ కొత్త యుగానికి నాంది పలుకుతాడా? భారత క్రికెట్‌లో రాబోయే రోజులు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి


