Top 5 This Week

Related Posts

ముంబై ఇండియన్స్ కొత్త పోస్ట్‌తో హార్దిక్ పాండ్యాపై మళ్లీ రూమర్స్.. IPL 2027లో ఏం జరగబోతోంది?

I P L 2027కి ముందే హార్దిక్ పాండ్యా గురించి ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముంబై ఇండియన్స్‌ పెట్టిన ఒక కొత్త పోస్ట్ ఇప్పుడు ఈ రూమర్స్‌కి మరింత ఆసక్తిని పెంచుతోంది. అసలు హార్దిక్ పాండ్యా విషయంలో ఏం జరుగుతోంది? ముంబై ఇండియన్స్‌ అతడిని ట్రేడ్ చేయబోతుందా? లేక ఈ వార్తల్లో నిజం లేదా? ఇప్పుడు ఇదే విషయము క్రికెట్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. I P L 2027 సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌ మరో జట్టుకు, ట్రేడ్ చేయాలని చూస్తోందంటూ ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి.

హార్దిక్ పాండ్యా 2015లో ముంబై ఇండియన్స్‌ తరఫునే I P L లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే 2022 సీజన్‌కు ముందు ముంబైని వీడి కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరాడు. గుజరాత్ టైటాన్స్‌ తరఫున హార్దిక్ కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు. ఆ జట్టు తమ తొలి సీజన్‌లోనే I P L టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత మరో సీజన్‌లో కూడా హార్దిక్ గుజరాత్‌కు కెప్టెన్‌గా కొనసాగాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌ హార్దిక్‌ను తిరిగి తమ జట్టులోకి తీసుకుంది. అంతేకాదు, రోహిత్ శర్మ తర్వాత హార్దిక్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

కానీ ఆ నిర్ణయం ముంబైకి అనుకున్నంతగా కలిసిరాలేదు. I P L 2024లో ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి సీజన్‌లో ముంబై క్వాలిఫయర్ 2 వరకు వెళ్లింది. ఇక I P L 2026లో మాత్రం ముంబై ఇండియన్స్‌ తొమ్మిదో స్థానంతో సీజన్‌ను ముగించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే హార్దిక్‌ను ట్రేడ్ చేయబోతున్నారంటూ వార్తలు రావడం మొదలైంది. అయితే ఈ రూమర్స్‌ మధ్యలో ముంబై ఇండియన్స్‌ చేసిన ఒక పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆగస్టు 19న ముంబై ఇండియన్స్‌ తమ సోషల్ మీడియా ఖాతాలో హార్దిక్ పాండ్యాకు సంబంధించిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. హార్దిక్‌ను ట్రేడ్ చేయబోతున్నారనే వార్తలు వస్తున్న సమయంలోనే ముంబై ,అతడి ఫొటోలను పోస్ట్ చేయడంతో అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. ముంబై ఇండియన్స్‌ ఈ పోస్ట్‌తో ఏమైనా సంకేతం ఇచ్చిందా? హార్దిక్ పాండ్యా ముంబైలోనే కొనసాగబోతున్నాడా? లేక ట్రేడ్ రూమర్స్‌ నిజమేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, I P L లో ఆటగాళ్ల ట్రేడ్స్‌, ట్రాన్స్‌ఫర్స్‌పై మాజీ భారత కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా స్పందించారు. ఆటగాళ్లను ఒక ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి ట్రేడ్ చేసే సమయంలో, పూర్తి వివరాలు బయటకు రావడం లేదని గవాస్కర్ అన్నారు. ఒక ఆటగాడి ట్రేడ్‌కు సంబంధించిన మొత్తం వివరాలు రెండు ఫ్రాంచైజీలు, ఆ ఆటగాడు, B C C I కి మాత్రమే తెలుస్తాయని ఆయన చెప్పారు. అందుకే ట్రేడ్ సమయంలో జరిగే డబ్బు లావాదేవీలు, జీతం వివరాలు కూడా అందరికీ తెలిసేలా పూర్తి పారదర్శకత ఉండాలని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. I P L ప్రపంచంలోనే అత్యంత పెద్ద T20 లీగ్ అని, దాని స్థాయిని కాపాడుకోవడానికి పూర్తి పారదర్శకత చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఇక హార్దిక్ పాండ్యా విషయంలో అసలు ముంబై ఇండియన్స్‌ ఏ నిర్ణయం తీసుకోబోతోందనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ముంబై పెట్టిన ఈ పోస్ట్ కేవలం సాధారణ పోస్ట్ మాత్రమేనా? లేక హార్దిక్‌పై వస్తున్న ట్రేడ్ రూమర్స్‌కు ఏదైనా సమాధానమా? దీనిపై అధికారికంగా స్పష్టత వచ్చే వరకు హార్దిక్ పాండ్యా ముంబైలోనే, ఉంటాడా లేదా మరో జట్టుకు వెళ్తాడా అనేది సస్పెన్స్‌గానే ఉంది. “ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!”
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles