క్రికెట్‌లో ఇప్పటివరకు మనం చూడని ఒక కొత్త టెక్నాలజీ త్వరలోనే కనిపించబోతోంది. అది కూడా టీమిండియా సిరీస్‌లోనే. FIFA వరల్డ్ కప్‌లో ఉపయోగించిన స్థాయి టెక్నాలజీని ఇప్పుడు క్రికెట్‌లోకి తీసుకురాబోతున్నారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగబోయే T20 సిరీస్‌తో ఈ సరికొత్త మార్పు మొదలుకానుంది. అసలు ఈ సిరీస్‌లో ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు? మ్యాచ్ చూస్తున్న అభిమానులకు ఎలాంటి కొత్త అనుభూతి కలగబోతోంది? ఇప్పుడు తెలుసుకుందాం.
సెప్టెంబర్‌లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ప్రసార బాధ్యతలను I T W Universe నిర్వహిస్తోంది. ఈ సిరీస్ ప్రొడక్షన్‌ను జేమీ ఓక్‌ఫోర్డ్ డైరెక్ట్ చేయనున్నారు. ఆయన 2002 నుంచి ప్రతి FIFA వరల్డ్ కప్‌లో డైరెక్షన్ చేసిన వ్యక్తి. అంతేకాదు, 2014 FIFA వరల్డ్ కప్‌లో జర్మనీ, అర్జెంటీనా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను కూడా ఆయన డైరెక్ట్ చేశారు. ఇప్పుడు అసలు ప్రత్యేకత ఏంటంటే.. ఈ భారత్, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో FIFA వరల్డ్ కప్ స్థాయి బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు.
A I తో స్టెబిలైజ్ చేసే P O V కెమెరాలు, ఆటను వేరే కోణాల్లో చూపించే టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ Spider cam, Ultra Motion కెమెరాలు, అలాగే సినిమా తరహాలో మ్యాచ్‌ను చూపించే కొత్త స్టోరీటెల్లింగ్ టెక్నిక్స్‌ను తీసుకురానున్నారు. అంటే సాధారణంగా మనం టీవీలో మ్యాచ్ చూసే విధానంతో పోలిస్తే.. ఇకపై మరింత క్లియర్‌గా, మరింత దగ్గరగా, కొత్త కొత్త యాంగిల్స్‌లో మ్యాచ్‌ను చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడితో ఈ టెక్నాలజీ ఆగిపోలేదు.
Quidditch Innovation Labs, రూపొందించిన Spatio అనే సిస్టమ్‌ను కూడా, ఈ సిరీస్‌లో ఉపయోగించబోతున్నారు. ఈ సిస్టమ్ ద్వారా డ్రోన్ కెమెరా నుంచి వచ్చే వీడియోపై Augmented Reality గ్రాఫిక్స్‌ను చూపించవచ్చు. అంతేకాదు, ఆటగాళ్ల కదలికలను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు. దీంతో ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్, ఆటగాళ్ల వ్యూహాలు, టీమ్ స్ట్రాటజీలు వంటి విషయాలను గ్రాఫిక్స్ రూపంలో అభిమానులకు మరింత సులభంగా అర్థమయ్యేలా చూపించవచ్చు. I T W Universe ప్రకారం..
పూర్తి FIFA వరల్డ్ కప్ హోస్ట్ బ్రాడ్‌కాస్ట్ ప్రమాణాలతో రూపొందించబడుతున్న తొలి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఇదే. FIFA వరల్డ్ కప్ ఫైనల్, U E F A ఛాంపియన్స్ లీగ్ ఫైనల్స్‌ను డైరెక్ట్ చేసిన అనుభవం ఉన్న వ్యక్తులే ఈ సిరీస్ ప్రొడక్షన్‌ను నిర్వహించబోతున్నారు. కంపెనీ వ్యవస్థాపకుడు భైరవ్ శాంత్ కూడా ప్రేక్షకులకు స్టేడియంలో బెస్ట్ సీట్‌లో కూర్చున్న అనుభూతి కలిగించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇక భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్ సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగనుంది.
ఈ మూడు మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. ఈ సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ అధికారిక ఆతిథ్య జట్టుగా ఉంటుంది. మరి FIFA వరల్డ్ కప్ స్థాయి టెక్నాలజీతో క్రికెట్ మ్యాచ్ ఎలా కనిపించబోతుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. “ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!”


