దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో Day 4 ఆట మరింత ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో East Zone ఇప్పటికే భారీ ఆధిక్యంలో ఉండగా.. మరోవైపు South Zone గెలవాలంటే చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. అయితే అందరి చూపు మాత్రం టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. Day 4 లో South Zone ను 336 పరుగులకే East Zone ఆలౌట్ చేసింది. దీంతో East Zone కు ఏకంగా 372 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం వచ్చింది. ఈ ఆధిక్యం మ్యాచ్ ఫలితంలో చాలా కీలకంగా మారింది. ఎందుకంటే మ్యాచ్ డ్రాగా ముగిసినా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టుకే టైటిల్ దక్కే అవకాశం ఉంటుంది. South Zone కెప్టెన్ తిలక్ వర్మ మాత్రం అద్భుతంగా పోరాడాడు. సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో 99 పరుగుల వద్ద ఔటయ్యాడు.
అంతకుముందు చామా మిలింద్ 43 పరుగులతో మంచి సహకారం అందించాడు. అయితే మిలింద్ ఔటైన తర్వాత South Zone వరుసగా వికెట్లు కోల్పోయింది. కేవలం 18 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడిపోయాయి. ఇక 708 పరుగుల భారీ స్కోర్ చేసిన East Zone కు కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రధాన బలం. మొదటి రెండు రోజుల్లోనే ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులు చేసి East Zone కు భారీ స్కోర్ అందించాడు. కుమార్ కుషాగ్ర 101, శిఖర్ మోహన్ 85, అభిమన్యు ఈశ్వరన్ 72 పరుగులతో అతనికి మంచి సహకారం అందించారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో East Zone కు మొదట్లోనే షాక్ తగిలింది. అభిమన్యు ఈశ్వరన్ కేవలం 3 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
వైభవ్ కేవలం 8 పరుగులు చేసి స్టంప్ ఔట్ అయ్యాడు. త్రిపురాన విజయ్ వేసిన బంతిని పెద్ద షాట్ ఆడేందుకు వైభవ్ ముందుకు వచ్చాడు. కానీ బంతి ఫ్లైట్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో వికెట్ కీపర్ ఎన్ జగదీశన్ అతన్ని సులభంగా స్టంప్ చేశాడు. ఇంతకుముందు కూడా వైభవ్‌కు D R S విషయంలో ఒక close call ఎదురైంది. అతనిపై L B W అప్పీల్ చేయగా అంపైర్ నాట్ ఔట్ ఇచ్చాడు. South Zone రివ్యూ తీసుకున్నా.. Hawk-Eye లో అంపైర్స్ కాల్ రావడంతో వైభవ్ బతికిపోయాడు. అయితే కొద్దిసేపటికే అతని ఇన్నింగ్స్ ముగిసిపోయింది. కామెంటేటర్లు కూడా వైభవ్ లాంగర్ ఫార్మాట్‌లో ఇంకా patience నేర్చుకోవాలని సూచించారు. వైభవ్ ఔటైన తర్వాత ఇషాన్ కిషన్ మాత్రం మరోసారి తన క్లాస్ చూపించాడు.
శిఖర్ మోహన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. తర్వాత త్రిపురాన విజయ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ అద్భుతమైన సిక్స్ కొట్టాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో అతని స్కోర్ 32 పరుగులకు చేరింది. అంతేకాదు.. తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 270 పరుగులు కలుపుకుని ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ మొత్తం 300 పరుగుల మార్క్‌ను దాటాడు. ఇక East Zone రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగుల మార్క్‌ను కూడా దాటింది. ఈ దశలో వారి ఆధిక్యం 400 పరుగులు దాటింది. మరోవైపు కొత్త బంతితో మహ్మద్ సిరాజ్ కూడా చాలా వేగంగా, కఠినంగా బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం East Zone భారీ ఆధిక్యంలో ఉండటంతో Duleep Trophy టైటిల్‌కు చాలా దగ్గరగా కనిపిస్తోంది. కానీ మ్యాచ్ ఇంకా పూర్తిగా ముగియలేదు. South Zone ఏదైనా అద్భుతం చేస్తుందా? లేక East Zone ఆధిపత్యంతో టైటిల్‌ను సొంతం చేసుకుంటుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


