క్రికెట్ అభిమానులందరి చూపు ఇప్పుడు ఒకే ఒక్క ఆటగాడిపై ఉంది… అతడే 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. భారత్ vs ఇంగ్లండ్ తొలి టీ twenty మ్యాచ్‌కు ముందు ఇప్పుడు పెద్ద చర్చ ఏంటంటే… వైభవ్ సూర్యవంశీ ఈరోజు భారత జెర్సీ ధరించనున్నాడా? అనేదే.
భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ twenty సిరీస్‌లో తొలి మ్యాచ్ డర్హామ్‌లోని చెస్టర్-లీ-స్ట్రీట్ రివర్‌సైడ్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే మ్యాచ్‌కు ముందే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు మాత్రం వైభవ్ సూర్యవంశీ.
కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ గడప దగ్గరకు చేరుకున్న వైభవ్… తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇప్పటికే క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. చిన్న వయసులోనే భారీ షాట్లు ఆడగల సామర్థ్యం, ఎలాంటి ఒత్తిడిలోనైనా ధైర్యంగా బ్యాటింగ్ చేయడం అతడిని ప్రత్యేక ఆటగాడిగా నిలిపాయి.
ఈ మధ్య జరిగిన ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచి 776 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 230 కి పైగా ఉండటం అతని దూకుడు బ్యాటింగ్‌కు నిదర్శనం.
ఈ అద్భుత ప్రదర్శన కారణంగానే వైభవ్‌కు భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఐపీఎల్‌లో అతని ప్రతిభకు గుర్తింపుగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులను కూడా అందుకున్నాడు.
ఇప్పుడు అందరి ఆసక్తి ఒక్కటే… ఇంగ్లండ్‌తో జరగబోయే తొలి టీ twenty లో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం వస్తుందా లేదా అనేది. భారత జట్టు ఇంకా అధికారికంగా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించలేదు. కానీ ప్రత్యర్థి ఇంగ్లండ్ మాత్రం వైభవ్‌ను ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధమైంది.
ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వైభవ్‌ను ఎదుర్కొనేందుకు తమ జట్టు వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయని హ్యారీ బ్రూక్ తెలిపాడు. “మా వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయి. అవి పనిచేస్తాయని ఆశిస్తున్నాం” అని చెప్పాడు.అంతేకాకుండా భారత ఆటగాళ్లను ఎలా నియంత్రించాలి అనే దానిపై తమ టీమ్ చాలా పరిశోధన చేసిందని బ్రూక్ వెల్లడించాడు. భారత ఆటగాళ్ల బలాలు, బలహీనతలను విశ్లేషించి మ్యాచ్‌కు సిద్ధమయ్యామని తెలిపాడు.
ఇది చూస్తేనే అర్థమవుతుంది… వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ ఎంత ప్రత్యేక దృష్టి పెట్టిందో.ఇకతొలి మ్యాచ్ వైభవ్ ఈ సిరీస్‌లో చేస్తే భారత క్రికెట్ చరిత్రలో మరో రికార్డు నమోదవుతుంది. ఇప్పటివరకు భారత జట్టు తరఫున అత్యంత చిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి ప్రవేశం చేసిన రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరుపై ఉంది. సచిన్ 16 ఏళ్ల వయసులో భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు.
కానీ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్‌పై తొలి టీ twenty లో బరిలోకి దిగితే… 15 ఏళ్ల వయసులోనే టీమిండియా తరఫున ఆడిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించనున్నాడు.అయితే రికార్డు సృష్టించడం మాత్రమే కాదు… అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన తొలి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడన్నదే అసలు పరీక్ష. ఇంగ్లండ్ లాంటి బలమైన జట్టుపై తొలి మ్యాచ్‌లోనే తన సత్తా చూపిస్తే వైభవ్ పేరు ప్రపంచ క్రికెట్‌లో మరింత మారుమోగే అవకాశం ఉంది.
చిన్న వయసులోనే ఇంతటి అవకాశం రావడం చాలా అరుదు. కానీ వైభవ్ తన ప్రతిభతో ఆ అవకాశాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు కోట్లాది మంది భారత అభిమానులు అతడి తొలి ప్రవేశంసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వైభవ్ సూర్యవంశీ ఈరోజు భారత జెర్సీలో మైదానంలోకి దిగుతాడా? తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే రికార్డు సృష్టిస్తాడా? లేక మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తుందా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది.
క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ యువ సంచలనం ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.


