Top 5 This Week

Related Posts

IPL 2026 Playoffs: RCB, SRH, GT, RR ! ఎవరు గెలుస్తారు ఈసారి IPL Trophy?

ఐపీఎల్ అంటేనే ఉత్కంఠ… చివరి వరకూ ఎవరు ప్లేఆఫ్స్‌కి వెళ్తారో చెప్పలేని సస్పెన్స్‌. కానీ ఈసారి ఐపీఎల్ 2026 సీజన్ మాత్రం మరో లెవెల్‌కు వెళ్లింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పెద్ద పెద్ద జట్లు బయటపడితే… అంచనాలకు మించి ఆడిన నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టాయి. ఆ నాలుగు జట్లు ఎవరో తెలుసా… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్. ఇప్పుడు ఈ నాలుగు జట్ల ప్రయాణం ఎలా సాగింది… ఎవరి బలం ఏంటి… ట్రోఫీకి ఎవరు ఫేవరెట్‌గా కనిపిస్తున్నారు… అన్నది పూర్తిగా చూద్దాం.”

“మొదటిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడాలి. ఎన్నో ఏళ్లుగా ‘ఈసారి కప్పు నమ్దే’ అని అభిమానులు ఆశపడ్డా… చివరి స్టేజ్‌లో తడబడటం RCB కి అలవాటే అయిపోయింది. కానీ ఈసారి మాత్రం బెంగళూరు టీమ్ పూర్తిగా మారిపోయింది. కెప్టెన్ రాజత్ పాటిదార్ చాలా కూల్‌గా జట్టును నడిపించాడు. విరాట్ కోహ్లీ తన అనుభవంతో టీమ్‌కి బ్యాక్‌బోన్‌లా నిలిచాడు. బ్యాటింగ్‌లో ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్ లాంటి ప్లేయర్లు మ్యాచ్‌ ను ఒక్కసారిగా తిప్పేయగలిగారు. ముఖ్యంగా బౌలింగ్‌లో జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణించారు.” “లీగ్ స్టేజ్ మొత్తం చూస్తే RCB చాలా కన్సిస్టెంట్‌గా ఆడింది. కొన్ని మ్యాచ్‌ల్లో ఒత్తిడి వచ్చినా… అక్కడే మ్యాచ్‌ను కంట్రోల్ చేయడం ఈసారి వాళ్ల ప్రత్యేకత. అందుకే టేబుల్ టాపర్‌గా నిలిచింది. నెట్ రన్‌రేట్ కూడా ప్లస్‌లో ఉండటం వాళ్ల డామినేషన్‌కి నిదర్శనం. అయితే చివరి లీగ్ మ్యాచ్‌లో SRH చేతిలో భారీ ఓటమి ఎదురైంది. అయినా టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకుంది. ఇప్పుడు ప్లేఆఫ్స్‌లో కూడా అదే మోమెంటమ్ కొనసాగిస్తే… ఈసారి నిజంగానే RCB ట్రోఫీని ఎత్తే అవకాశం కనిపిస్తోంది.”

“కానీ RCB ఈసారి ప్రత్యేకంగా కనిపించడానికి ఇంకో పెద్ద కారణం ఉంది… అదే టీమ్‌లో వచ్చిన నమ్మకం. గత సీజన్‌ల్లో ఒత్తిడి మ్యాచ్‌ల్లో తడబడిన బెంగళూరు… ఈసారి మాత్రం చివరి వరకూ ఫైట్ చేసింది. ఒక్క కోహ్లీ మీదే ఆధారపడకుండా… ప్రతి మ్యాచ్‌లో కొత్త హీరో బయటకు రావడం జట్టుకి పెద్ద ప్లస్ అయ్యింది. ఒక మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ మెరవగా… మరో మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ ఫినిషర్‌గా నిలిచాడు. అవసరమైనప్పుడు బౌలర్లు కూడా మ్యాచ్‌లను గెలిపించారు. అందుకే ఈసారి అభిమానులు ‘కప్పు నమ్దే’ అనే మాటను మరింత నమ్మకంతో చెబుతున్నారు.”

“ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడితే… ఈ జట్టు అసలు డేంజరస్ మోడ్‌లో ఉంది. మొదట్లో కొంచెం స్లోగా స్టార్ట్ అయినా… తర్వాత ఒక్కసారిగా ఫుల్ అటాకింగ్ క్రికెట్ ఆడింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ లాంటి బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లను ఊపిరి పీల్చనివ్వలేదు. ముఖ్యంగా క్లాసెన్ అయితే డెత్ ఓవర్లలో బౌలర్లకు నిద్రపట్టకుండా చేశాడు.” “కెప్టెన్ పాట్ కమిన్స్ చాలా స్మార్ట్‌గా జట్టును నడిపించాడు. బ్యాటింగ్ మాత్రమే కాదు… బౌలింగ్‌లో కూడా SRH ఈసారి భయంకరంగా కనిపించింది. చెన్నైపై గెలిచి ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టిన మ్యాచ్‌లో SRH చూపించిన ఆత్మవిశ్వాసం అభిమానుల్లో కొత్త ఆశలు నింపింది. ఇక RCB పై 250 కి పైగా స్కోర్ చేసి గెలవడం… ఈ జట్టు ఎంత ప్రమాదకరమో చూపించింది. ఒకసారి SRH బ్యాటర్లు సెటిల్ అయితే… ఏ టార్గెట్ అయినా చిన్నదే.” “ఇంకా ఒక ఆసక్తికరమైన విషయము ఏంటంటే… గతంలో SRH అంటే బౌలింగ్ టీమ్ అన్న ఫీలింగ్ ఉండేది. కానీ ఈసారి మాత్రం పూర్తిగా అటాకింగ్ బ్యాటింగ్‌తో మ్యాచ్‌లను డామినేట్ చేసింది. పవర్‌ప్లే నుంచే బౌలర్లపై దాడి చేయడం, 200+ స్కోర్లను సులభంగా ఛేజ్ చేయడం ఈ జట్టు ప్రత్యేకతగా మారింది. అందుకే ఇప్పుడు ప్లేఆఫ్స్‌లో SRHని ఎదుర్కోవాలంటే ప్రత్యర్థి జట్లు ముందే ప్రెషర్‌లోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.

“ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ గురించి మాట్లాడుకుందాం. IPL లోకి కొత్తగా వచ్చిన జట్టు అయినా… ఇప్పటికే ఒక ట్రోఫీ గెలిచిన టీమ్‌. ఈసారి కూడా GT చాలా బ్యాలెన్స్‌డ్‌గా కనిపించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో జట్టు చాలా మెచ్యూర్‌గా ఆడింది. ఓపెనింగ్‌లో మంచి స్టార్ట్స్… మిడిల్ ఆర్డర్‌లో స్టెబిలిటీ… చివర్లో ఫినిషింగ్… అన్నీ GT కి ప్లస్ అయ్యాయి.” “బౌలింగ్‌లో రషీద్ ఖాన్ మళ్లీ తన magic చూపించాడు. పవర్‌ప్లేలో వికెట్లు తీసినా… మిడిల్ ఓవర్లలో రన్స్ కట్టడి చేసినా… GT ఎప్పుడూ కంట్రోల్ కోల్పోలేదు. అందుకే లీగ్ స్టేజ్‌లో టాప్ 2 లో నిలిచింది. ఆసక్తికరమైన విషయము ఏంటంటే… గత చరిత్ర ప్రకారం ప్లేఆఫ్స్‌లో గుజరాత్ చాలా స్ట్రాంగ్ టీమ్‌గా కనిపిస్తోందని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. ఒత్తిడి మ్యాచ్‌ల్లో ఎలా గెలవాలో GT కి బాగా తెలుసు.” GT గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయము ఏంటంటే… ఈ జట్టు ఎక్కువగా హైప్‌లో కనిపించదు, కానీ గ్రౌండ్‌లో మాత్రం చాలా dangerous గా ఉంటుంది. పెద్ద పెద్ద స్కోర్లు చేయకపోయినా… చిన్న చిన్న moments ను advantage గా మార్చుకుని మ్యాచ్‌ను తమ వైపు తిప్పేస్తుంది. ముఖ్యంగా pressure situations లో GT players చూపించే maturity ఈ జట్టును మిగతా teams కంటే ప్రత్యేకంగా నిలబెడుతోంది. అందుకే playoffs లాంటి కీలక మ్యాచ్‌ల్లో గుజరాత్‌ను underestimate చేయడం చాలా ప్రమాదం.”

“ఇప్పుడు చివరిగా రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడాలి. మొదట్లో RR ప్రయాణం అంత సులభంగా కనిపించలేదు. మధ్యలో వరుస ఓటములు కూడా వచ్చాయి. కానీ చివరి దశలో అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌పై గెలిచి ప్లేఆఫ్స్‌లోకి రావడం ఈ జట్టుకి పెద్ద బూస్ట్ ఇచ్చింది. రియాన్ పరాగ్ కెప్టెన్సీ, జోఫ్రా ఆర్చర్ స్పెల్స్… జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి.” “బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్,  Vaibhav Sooryavanshi  , ధృవ్ జురెల్ లాంటి ప్లేయర్లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. RR కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే… మ్యాచ్ చివరి వరకూ ఫైట్ చేయడం. ఓడిపోతున్న మ్యాచ్‌ల్లో కూడా తిరిగి వచ్చి గెలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే ఈ జట్టును అండర్ ఎస్టిమేట్ చేయడం ప్రమాదం.” RR గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయము ఏంటంటే… ఈ జట్టు ఎప్పుడూ చివరి వరకూ ఆశలు వదులుకోదు. మ్యాచ్ చేతిలో లేకపోయినా… ఒక్క partnership లేదా ఒక్క spell తోనే game ను మళ్లీ తమ వైపు తిప్పేసే సామర్థ్యం RR కి ఉంది. అందుకే ఈ జట్టు playoffs లో ఎప్పుడు dangerous గా మారుతుందో అంచనా వేయడం చాలా కష్టం.”

“ఇంకో ఆసక్తికరమైన   విషయము ఏంటంటే… ఈ నలుగురు  జట్ల కెప్టెన్లు కూడా ఒక్కో స్టైల్‌లో జట్టును ముందుకు తీసుకెళ్లారు. రాజత్ పాటిదార్ చాలా calm గా decisions తీసుకుంటూ RCB కి కొత్త confidence తీసుకొచ్చాడు. పాట్ కమిన్స్ మాత్రం aggressive mindset‌ తో SRH ని dangerous టీమ్‌గా మార్చాడు. శుభ్‌మన్ గిల్ maturity తో GT ని balanced గా నడిపిస్తుంటే… రియాన్ పరాగ్ fearless attitude‌ తో RR కి కొత్త energy ఇచ్చాడు. అందుకే ఈసారి playoffs కేవలం players మధ్య పోరు మాత్రమే కాదు… ఈ నలుగురు captains మధ్య జరిగే mind game కూడా అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతోంది.”

“ఇప్పుడు అభిమానుల్లో భారీ చర్చకు కారణమైన విషయము ఏంటంటే… ఈసారి ప్లేఆఫ్స్‌కి వచ్చిన నాలుగు జట్లకీ ఇప్పటికే ఒక్కో IPL ట్రోఫీ ఉంది. Royal Challengers Bengaluru 2025 లో తమ మొదటి టైటిల్ గెలిచి అభిమానుల 18 ఏళ్ల కలను నిజం చేసింది. Rajasthan Royals IPL మొదటి సీజన్ అయిన 2008 లోనే ఛాంపియన్‌గా నిలిచింది. Gujarat Titans కొత్త జట్టు అయినప్పటికీ 2022 లోనే ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. Sunrisers Hyderabad కూడా 2016 లో టైటిల్ గెలిచి తమ శక్తిని నిరూపించింది. అందుకే ఇప్పుడు 2026 లో ఈ నాలుగు జట్లలో ఎవరు రెండోసారి ట్రోఫీని ఎత్తుతారన్న ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగిపోయింది.” ఫామ్ పరంగా చూస్తే RCB చాలా బలంగా కనిపిస్తోంది. అటాకింగ్ గేమ్‌లో SRH ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలా మారింది. సమతుల్యమైన జట్టుగా GT పూర్తి ప్యాకేజ్‌లా కనిపిస్తోంది. ఇక RR మాత్రం ఎప్పుడైనా మ్యాచ్‌ ను తారుమారు చేసే surprise టీమ్‌. ప్లేఆఫ్స్‌లో ఒక్క మ్యాచ్ చాలు… మొత్తం కథ మారిపోతుంది. అందుకే ఈసారి IPL climax అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెంచుతోంది.”

“క్వాలిఫయర్ 1 లో RCB, GT తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లోకి వెళ్తుంది. మరోవైపు SRH, RR మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. అక్కడ ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి బయటపడుతుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2 లో మరో అవకాశం పొందుతుంది. అంటే ప్రతి బాల్… ప్రతి వికెట్… ప్రతి ఓవర్… ఇప్పుడు చాలా కీలకం.”

“అయితే మీ అభిప్రాయం ఏంటి… ఈసారి ఐపీఎల్ ట్రోఫీని ఎవరు గెలుస్తారు? RCB నా,SRH నా,GT నా, లేక RR మరోసారి చరిత్ర సృష్టిస్తుందా? మీ ఫేవరెట్ టీమ్ పేరు కామెంట్‌లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles