Top 5 This Week

Related Posts

“వాళ్ల ముఖాలు చూడండి!” భారత్‌లో ఆ ఫైర్ లేదు.. కోహ్లీని మిస్ అయ్యామన్న మహ్మద్ కైఫ్!

శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా డ్రా చేసుకుంది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్న భారత్ ఆశలు నెరవేరలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 509 పరుగులు చేసిన టీమిండియా.. శ్రీలంకను ఫాలోఆన్ కూడా ఆడించింది. అయినా లంక బ్యాటర్లు అద్భుతంగా పోరాడి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు. అయితే మ్యాచ్ డ్రా కావడంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా చివరి రోజు టీమిండియా ఆటతీరు, ఆటగాళ్లలో కనిపించిన ఎనర్జీపై ప్రశ్నలు లేవనెత్తాడు.

అంతేకాదు.. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని కైఫ్ చెప్పాడు. కైఫ్ మాట్లాడుతూ.. టెస్ట్ క్రికెట్ అందరికీ సాధ్యం కాదని అన్నాడు. టెస్ట్ మ్యాచ్‌లో గంటల తరబడి బౌలింగ్ చేయాలి, ప్రత్యర్థిపై ఒత్తిడి కొనసాగించాలి. కానీ ఈ మ్యాచ్‌లో భారత్ ఆ పని చేయడంలో వెనుకబడిందని చెప్పాడు. “విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఉండి ఉంటే.. ప్రతి ఒక్కరినీ ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తూ, టీమ్‌ను యాక్టివ్‌గా ఉంచేవాడు. కానీ ఇక్కడ మాత్రం ‘బౌలింగ్ చేస్తూ ఉండండి..

ఏదో ఒక సమయంలో వికెట్ పడుతుంది’ అన్నట్టుగా ఆడారు” అని కైఫ్ విమర్శించాడు. భారత్ ఆటగాళ్ల ఎనర్జీ లెవల్స్ కూడా చాలా తక్కువగా కనిపించాయని కైఫ్ అన్నాడు. ఆటలో తమంతట తామే ఒత్తిడి సృష్టించే ప్రయత్నం చాలా తక్కువగా జరిగిందని చెప్పాడు. అక్కడితో ఆగకుండా.. ప్రత్యర్థి బ్యాటర్ సోనల్ దినూషాను భారత్ సరిగ్గా టార్గెట్ చేయలేకపోయిందని కైఫ్ పేర్కొన్నాడు. “మనం నిజంగా ఔట్ చేయాల్సిన బ్యాటర్ సోనల్. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించలేదు.

పైగా ‘వాళ్ల ముఖాలు చూడండి’ అంటూ మాట్లాడుతున్న వీడియో కూడా చూశాను” అని కైఫ్ చెప్పాడు. అతని మాటల ప్రకారం.. భారత్ నుంచి అతనిపై సరైన ఒత్తిడి రాలేదు. స్లెడ్జింగ్ చేసినా అతను భయపడలేదు. అతడిని ఇబ్బంది పెట్టేలా టీమ్ నుంచి పెద్ద ప్లేయర్ ముందుకు రాలేదని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఇక ఇదే సందర్భంలో కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, ధోనీ, అశ్విన్ లాంటి సీనియర్ ప్లేయర్లను కూడా కైఫ్ గుర్తు చేశాడు. “వాళ్లలాంటి ప్లేయర్లు మీ ఎదురుగా నిలబడి చూస్తేనే ప్రత్యర్థి బ్యాటర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి ఈ మ్యాచ్‌లో మిస్ అయ్యింది” అని కైఫ్ అన్నాడు. మొత్తానికి.. శ్రీలంకతో సిరీస్‌ను 2-0తో ముగించాల్సిన టీమిండియా.. ఒక్క విజయంతోనే సరిపెట్టుకుంది.

మరి నిజంగానే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఉండి ఉంటే ఫలితం మారేదా? కైఫ్ కామెంట్స్‌పై మీ అభిప్రాయం ఏంటి? “ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!”
 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles