spot_imgspot_img

Top 5 This Week

spot_img

Related Posts

బ్యాట్‌లో AI చిప్ ఉందా? లేక ఇది దేవుడిచ్చిన టాలెంట్‌ ఏనా ?

బ్యాట్‌లో AI చిప్ ఉందా?  లేక ఇది దేవుడిచ్చిన టాలెంట్‌ ఏనా ? IPL 2026 లో ప్రతి మ్యాచ్‌తో చరిత్ర సృష్టిస్తున్న, ఈ 15 ఏళ్ల కుర్రాడు ఇచ్చిన సమాధానం, ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది!

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశి… ఈ సీజన్‌లో చేస్తున్న ప్రదర్శనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కానీ అతని ఆట ఎంత వైరల్ అవుతుందో, అతని మీద వచ్చే రూమర్స్ కూడా అంతే వైరల్ అవుతున్నాయి! “బ్యాట్‌లో AI చిప్ ఉందా?” అనే విచిత్రమైన ఆరోపణలపై చివరికి సూర్యవంశి స్పందించాడు—అది కూడా తన స్టైల్లోనే!  చిరునవ్వుతో అతను చెప్పిన మాటలు, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి—“భగవాన్ పెట్టాడు… నా బ్యాట్‌లో ఏదో స్పెషల్ ఇచ్చాడు… నేను అదే వాడుతున్నాను” అని సరదాగా చెప్పాడు. ఈ సమాధానం వినగానే ఫ్యాన్స్ షాక్ అయ్యారు, వెంటనే వైరల్ అయ్యింది.

ఈ “AI చిప్” డిస్కషన్ మొదలైంది అతను సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై, కేవలం 37 బంతుల్లో 103 పరుగులు చేసి, అందరినీ షాక్ చేసిన తర్వాత. ఆ ఇన్నింగ్స్ చూసి పాకిస్థాన్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ సరదాగా “అతని బ్యాట్ చెక్ చేయాలి… AI చిప్ ఉండొచ్చు” అని కామెంట్ చేశాడు. కానీ ఈ మాటలు సరదాగా మొదలై, తర్వాత పెద్ద చర్చగా మారిపోయాయి.

కానీ ఈ ఆరోపణలకు సూర్యవంశి ఇచ్చిన అసలు సమాధానం మాత్రం బ్యాట్‌తోనే! పంజాబ్ కింగ్స్‌పై మ్యాచ్‌లో కేవలం, 167 బంతుల్లో 400 పరుగులు పూర్తి చేసి, IPL చరిత్రలోనే ఫాస్టెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. ఆండ్రే రస్సెల్ 2019 లో పెట్టిన, 188 బంతుల రికార్డ్‌ను బ్రేక్ చేసి, అభిషేక్ శర్మ, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి స్టార్ ప్లేయర్లను వెనక్కి నెట్టాడు.

అదే మ్యాచ్‌లో అతను కేవలం, 16 బంతుల్లో 43 పరుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫర్గ్యూసన్ లాంటి బౌలర్లను, పూర్తిగా డామినేట్ చేశాడు. ఇప్పుడు IPL 2026 లో 9 మ్యాచ్‌ల్లో, 400 పరుగులతో ఆరెంజ్ క్యాప్ టాప్‌లో నిలిచాడు, 238.09 స్ట్రైక్ రేట్‌తో 37 సిక్సర్లు కొట్టాడు—ఇది సాధారణ విషయము కాదు… ఇది ఒక కొత్త యుగం ప్రారంభం!

ఇప్పుడు ప్రశ్న ఒక్కటే… ఇది నిజంగా “AI మ్యాజిక్”నా… లేక “నేచురల్ టాలెంట్ ఆ?”  కానీ ఒక విషయము మాత్రం క్లియర్. వైభవ్ సూర్యవంశి అనే ఈ పేరు ఇకపై క్రికెట్ ప్రపంచంలో గర్జించబోతోంది!

మీరేమంటారు? కామెంట్ చేయండి.. ఇలాంటి ఎగ్జైటింగ్ IPL అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles