Top 5 This Week

Related Posts

హార్దిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం..?

ఒకప్పుడు ముంబై ఇండియన్స్ అంటే ట్రోఫీలకు మరో పేరు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన ఆ టీమ్.. ఇప్పుడు మాత్రం తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసే సరికి ఒక్క వార్త ముంబై అభిమానులను షాక్‌ కు గురిచేస్తోంది. అదేంటి అంటే… హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ రోజులు ముగియబోతున్నాయట! అవును… గతంలో ట్రోఫీలు అందించిన కెప్టెన్ ఇప్పుడు తన జట్టులోనే స్థానం కోసం పోరాడే పరిస్థితి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అసలు ముంబై ఇండియన్స్ జట్టులో ఏమి జరుగుతోంది? ఎందుకు హార్దిక్‌పై అంత పెద్ద నిర్ణయం తీసుకునే దిశగా టీమ్ మేనేజ్‌మెంట్ వెళ్తోంది? ఈ వీడియోలో మొత్తం స్టోరీని పూర్తిగా తెలుసుకుందాం.

ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్ అభిమానులకు పూర్తిగా నిరాశను మిగిల్చింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి… 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్స్ టేబుల్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఒకప్పుడు ప్రతి సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు వెళ్లే ముంబై జట్టు… ఇప్పుడు లీగ్ స్టేజ్‌లోనే బయటపడటం అభిమానులకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా ఒక్క టైటిల్ కూడా గెలవకపోవడంతో టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి పెరిగింది. అందుకే ఇప్పుడు జట్టులో పెద్ద మార్పులు చేయాలని ముంబై యాజమాన్యం ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ మార్పుల్లో మొదటగా వినిపిస్తున్న పేరు హార్దిక్ పాండ్యాదే.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం… ముంబై ఇండియన్స్ జట్టులో ఇప్పుడు పెద్ద చర్చలు జరుగుతున్నాయట. హార్దిక్ పాండ్యాను ఇక కెప్టెన్‌గా కొనసాగించాలా లేదా అనే విషయంపై టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు… వచ్చే సీజన్‌ లో అతను జట్టులో కొనసాగుతాడా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు గుజరాత్ టైటాన్స్‌కు ట్రోఫీ అందించిన హార్దిక్… ఇప్పుడు తన భవిష్యత్తుపై సందిగ్ధంలో ఉన్నాడు.రాజస్థాన్ రాయల్స్‌తో చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన, టీమ్ మీటింగ్‌లో కోచింగ్ స్టాఫ్ సీనియర్ ప్లేయర్లకు ముఖ్యమైన సూచనలు ఇచ్చిందట. “టీమ్ చెప్పిన ప్లాన్స్‌ను ప్రతి ప్లేయర్ ఫాలో అవ్వాలి. డేటా ఆధారంగా ఇచ్చే సూచనలను కూడా సీరియస్‌గా తీసుకోవాలి” అని చెప్పినట్టు సమాచారం. దీంతో జట్టులో అంతా సవ్యంగా లేదనే చర్చలు మరింత పెరిగాయి. కానీ కొన్ని సందర్భాల్లో ప్లేయర్లు కోచింగ్ స్టాఫ్ చెప్పిన ప్లాన్స్‌ను పట్టించుకోలేదని సమాచారం. ఈ వ్యాఖ్యలు నేరుగా హార్దిక్‌ను టార్గెట్ చేశాయా? అనే అనుమానాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఎందుకంటే సీజన్ మొత్తం హార్దిక్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు భారీగా విమర్శలు ఎదుర్కొన్నాయి.

ఈ సీజన్‌ లో ముంబై ఇండియన్స్ ఆటను చూస్తే… జట్టు ఆధునిక టీ twenty క్రికెట్‌కు చాలా వెనుకబడిపోయిందనే విషయము  స్పష్టంగా కనిపించింది. పవర్‌ప్లేలో అటాకింగ్ బ్యాటింగ్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లు మొదటి ఆరు ఓవర్లలోనే ప్రత్యర్థులపై దాడి చేసి మ్యాచ్‌లను కంట్రోల్ చేశాయి. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ ఎంత విధ్వంసం సృష్టించిందో అందరూ చూశారు. మరోవైపు రాజస్థాన్ టాప్ ఆర్డర్ కూడా పరుగుల వరద పారించింది. కానీ ముంబై మాత్రం ఇంకా పాత స్టైల్‌లోనే ఆడుతున్నట్టు కనిపించింది.బౌలింగ్‌లో కూడా ముంబై తీవ్రంగా నిరాశపరిచింది. బెంగళూరు, గుజరాత్ వంటి జట్లు అనుభవజ్ఞులైన బౌలర్లతో విజయాలు సాధించగా… ముంబై వద్ద పేరున్న ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఫలితం మాత్రం రాలేదు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్ వంటి బౌలర్లు కీలక సమయంలో మ్యాచ్‌లను మలుపు తిప్పారు. కానీ ముంబై బౌలర్లు మాత్రం ఒత్తిడి సమయంలో చేతులెత్తేశారు. ఇదే విషయంపై అభిమానులు కూడా సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అత్యంత ఆశ్చర్యకరమైన విషయము  ఏంటంటే… ముంబై జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఎవ్వరూ ఆరెంజ్ క్యాప్ లేదా పర్పుల్ క్యాప్ రేస్‌లో కనిపించలేదు. జట్టు టాప్ స్కోరర్ రయాన్ రికెల్టన్ కూడా టాప్ రన్ స్కోరర్ల జాబితాలో చాలా వెనుక ఉన్నాడు. బౌలింగ్‌లో అల్లాహ్ ఘజన్‌ఫర్ కొన్ని మ్యాచ్‌ల్లో మెరిసినా… అది జట్టును నిలబెట్టడానికి సరిపోలేదు. సూర్యకుమార్ యాదవ్ కొన్ని ఇన్నింగ్స్‌ల్లో మెరుపులు చూపించినా కన్సిస్టెన్సీ లేకపోయింది. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్‌లాంటి ప్లేయర్లు కూడా అంచనాలను అందుకోలేకపోయారు.హార్దిక్ పాండ్యా మరియు ముంబై అభిమానుల మధ్య సంబంధం ఎప్పటినుంచో క్లిష్టంగానే ఉంది. ఒకప్పుడు ముంబై ఇండియన్స్ హార్దిక్‌ను స్టార్‌గా తయారు చేసింది. కానీ 2022 లో అతన్ని విడుదల చేసి… తర్వాత అతను గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్‌గా ట్రోఫీ గెలిచాడు. అక్కడి నుంచి మళ్లీ 2024 లో ముంబైకి తిరిగి వచ్చి… రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ అయ్యాడు. ఇదే విషయము  అభిమానులను తీవ్రంగా బాధించింది. ఎందుకంటే అప్పుడే రోహిత్ శర్మ భారత జట్టును వరల్డ్ కప్ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అలాంటి సమయంలో అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించడం అభిమానులకు నచ్చలేదు.

2024 సీజన్‌లో హార్దిక్ పాండ్యాపై అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపించింది.ప్రతి గ్రౌండ్‌లో అభిమానులు అతన్ని టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా తీవ్ర ట్రోలింగ్ ఎదురైంది. అయితే 2025 లో కొంతవరకు జట్టు రికవరీ అవ్వడంతో పరిస్థితి మారుతుందేమో అనుకున్నారు. కానీ 2026 సీజన్ మళ్లీ అన్నీ చెడగొట్టింది. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ మూడు విభాగాల్లోనూ ప్రభావం చూపలేకపోయాడు. కొన్ని మ్యాచ్‌ల్లో చివరి ఓవర్లలో తీసుకున్న నిర్ణయాలు నేరుగా ఓటమికి కారణమయ్యాయని మాజీ క్రికెటర్లు కూడా విమర్శించారు.ఇక ఇటీవల కిరోన్ పొలార్డ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “హార్దిక్ కెప్టెన్సీలో కొన్ని విషయాలు ప్రశ్నించాల్సిందే” అని పొలార్డ్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే పొలార్డ్ ముంబై ఇండియన్స్‌కు ఎంత దగ్గర వ్యక్తో అందరికీ తెలుసు. అతని వ్యాఖ్యల తర్వాత ముంబైలో నిజంగానే పెద్ద మార్పులు జరగబోతున్నాయనే ప్రచారం మరింత బలపడింది.

ఇప్పుడు అందరి దృష్టి ఒకే విషయంపై ఉంది. ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్ ఎవరు? మళ్లీ రోహిత్ శర్మకే బాధ్యతలు అప్పగిస్తారా? లేక సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్‌కు అవకాశం ఇస్తారా? లేదా పూర్తిగా కొత్త నాయకత్వాన్ని తీసుకువస్తారా? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతున్నాయి. కొందరు అయితే హార్దిక్‌ను ట్రేడ్ చేసి మరో టీమ్ మేనేజ్‌మెంట్ కి పంపే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు మరియు మేనేజ్‌మెంట్ బ్రేక్‌లో ఉన్నారు. కానీ రాబోయే వారాల్లో జరిగే సమావేశాల్లో చాలా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందట. హార్దిక్ పాండ్యా ముంబైకి కెప్టెన్‌గా కొనసాగుతాడా? కేవలం ప్లేయర్‌గా ఉంటాడా? లేక పూర్తిగా జట్టును వదిలి వెళ్లాల్సి వస్తుందా? అన్నది ఇప్పుడు ఎవరికీ స్పష్టంగా తెలియడం లేదు.

ఒక విషయము  మాత్రం ఖాయం… ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌లో భారీ తుఫాన్ రానుంది. ఈ తుఫాన్‌లో ఎవరు నిలబడతారు? ఎవరు బయటపడతారు? అన్నది తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి మీ అభిప్రాయం ఏంటి? హార్దిక్ పాండ్యాను ముంబై కెప్టెన్‌గా కొనసాగించాలా? లేక కొత్త కెప్టెన్‌ను తీసుకురావాలా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles