యువ క్రికెటర్లకు డబ్బు, ఫేమ్ ఎంత త్వరగా వస్తుందో.. అదే సమయంలో వాళ్లు తప్పుదారి పట్టే ప్రమాదం కూడా అంతే ఎక్కువగా ఉంటుందని BCCI భావిస్తోంది. అందుకే జూనియర్ క్రికెటర్ల విషయంలో BCCI కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త BCCI Junior Cricket Committee ని ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే నెల జరిగే BCCI Annual General Meeting లో ఈ కొత్త కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ కొత్త కమిటీకి కేవలం యువ ఆటగాళ్లను సెలెక్ట్ చేయడం మాత్రమే కాదు.. వాళ్లకు డ్రగ్స్, బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ప్రమాదాలపై అవగాహన కల్పించడం కూడా ముఖ్యమైన బాధ్యతగా పెట్టారు.
దీనికోసం BCCI ఐదు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 5 చివరి తేదీగా ప్రకటించింది. యువ క్రికెటర్లు చిన్న వయసులోనే సరైన మార్గంలో ఉండేలా చేయడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ముఖ్యంగా సీనియర్, మాజీ క్రికెటర్లతో మాట్లాడిస్తూ.. డ్రగ్స్, బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల వచ్చే నష్టాల గురించి యువ ఆటగాళ్లకు అవగాహన కల్పించనున్నారు. ఇక్కడ BCCI ఆందోళనకు అసలు కారణం ఏంటంటే..
ప్రస్తుతం Under-19 క్రికెట్‌లో కూడా డబ్బు, ఫేమ్ చాలా పెరిగిపోయాయి. దీంతో చిన్న వయసులోనే గుర్తింపు వచ్చిన ఆటగాళ్లు తప్పుదారి పట్టే అవకాశం ఉందని BCCI భావిస్తోంది. ఒక BCCI అధికారి కూడా ఇదే విషయంపై స్పందిస్తూ.. ఈ వయసులో ఉన్న క్రికెటర్లు చాలా సున్నితమైన పరిస్థితిలో ఉంటారని, U-19 క్రికెట్‌లో కూడా డబ్బు, ఫేమ్ ఎక్కువగా ఉన్నందున అవగాహన చాలా చిన్న వయసులోనే ప్రారంభం కావాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న జూనియర్ సెలక్షన్ కమిటీ 2021 సెప్టెంబర్‌లో ఏర్పాటైంది.
ఇందులో S. శరత్, కృష్ణన్ మోహన్, రణదేబ్ బోస్, పాథిక్ పటేల్, హర్విందర్ సింగ్ సోధీ ఉన్నారు. వీరి ఐదేళ్ల పదవీకాలం ఇప్పుడు పూర్తయింది. ప్రస్తుత కమిటీకి చివరి బాధ్యతగా Junior Irani Cup కోసం Rest of India Under-23 జట్టును ఎంపిక చేయనున్నారు. ఇక కొత్త కమిటీ బాధ్యతలు చాలా పెద్దవిగా ఉండబోతున్నాయి. Under-22 వరకు వయసు గ్రూప్ జట్లను ఎంపిక చేయడం, కోచింగ్ క్యాంపులు నిర్వహించడం, దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం జట్లను సిద్ధం చేయడం ఇందులో భాగం.
అంతేకాదు.. ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లను గుర్తించి భవిష్యత్తు కోసం మంచి బెంచ్ స్ట్రెంత్ తయారు చేయడం కూడా కొత్త కమిటీ బాధ్యతే. యువ ఆటగాళ్లతో పాటు కోచ్‌లు, ఫిజియోలు, ట్రైనర్లు, థెరపిస్టులు, అనలిస్టులు, మెడికల్ సిబ్బందిని కూడా ఎంపిక చేయడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది. జూనియర్ జట్ల ప్రదర్శనను ఎప్పటికప్పుడు పరిశీలించి, ఆటగాళ్ల అభివృద్ధిపై రిపోర్టులు తయారు చేయడం, వివిధ ఫార్మాట్లకు కెప్టెన్లను ఎంపిక చేయడం కూడా వీరి బాధ్యతల్లో ఉంటుంది. ఈ పదవులకు దరఖాస్తు చేసుకునేవారు కనీసం 25 First-Class మ్యాచ్‌లు ఆడిన మాజీ క్రికెటర్లు అయి ఉండాలి. అలాగే క్రికెట్ నుంచి రిటైర్ అయి కనీసం ఐదేళ్లు పూర్తై ఉండాలి.
మొత్తంగా చూస్తే.. యువ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వడంతో పాటు, వాళ్లు తప్పుదారి పట్టకుండా చిన్న వయసులోనే సరైన అవగాహన కల్పించడంపై BCCI ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది. “ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!”


