Top 5 This Week

Related Posts

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి హోమ్ సిరీస్‌లో గోల్డెన్ ఛాన్స్! | IND vs AFG T20

క్రికెట్ అభిమానులకు నమస్కారం! మన దేశవాళీ క్రికెట్ నుంచే కాదు… ఐపీఎల్ నుంచి టీమిండియా వరకు ఇప్పుడు ఒక్కడే పేరు మార్మోగిపోతోంది! అతడే 15 ఏళ్ల వండర్ కిడ్… స్వదేశంలో తొలిసారి టీమిండియా తరఫున ఆడబోతున్న వైభవ్ సూర్యవంశీ! సెప్టెంబర్ 1న BCCI అఫ్గానిస్తాన్‌తో జరగబోయే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది. ఇందులో విశేషం ఏంటంటే… మైత్రికి ప్రతీకగా అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డ్ (ACB) తొలిసారి భారత్‌లోనే ఈ హోమ్ సిరీస్‌ను హోస్ట్ చేస్తోంది!

సెప్టెంబర్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి సమరం మొదలవుతుంటే… 15, 17 తేదీల్లో మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయి. 15 ఏళ్ల వయసులోనే ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్‌కు అక్కడ ఆశించిన స్థాయిలో పరుగులు రాలేదు. కానీ, ఇప్పుడు సొంత గడ్డపై తన అసలు నైపుణ్యాన్ని చూపించేందుకు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఒక గోల్డెన్ ఛాన్స్ దక్కింది. మరి టీమిండియా జెర్సీలో హోమ్ సిరీస్ ఆడటానికి ముందు…

ఇప్పటివరకు భారత గడ్డపై టీ20ల్లో వైభవ్ రికార్డ్ ఎలా ఉందో తెలుసా? ఒకసారి ఈ ఊచకోత గణాంకాలు చూడండి!

భారత గడ్డపై వైభవ్ సూర్యవంశీ టీ20 రికార్డులను ఒకసారి చూస్తే…

మొత్తం ఆడిన ఇన్నింగ్స్‌లు: ఐపీఎల్‌లో 23, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7… మొత్తం కలిపి 30 ఇన్నింగ్స్‌లు ఆడాడు.

చేసిన పరుగులు: ఐపీఎల్‌లో 1028 పరుగులు, దేశవాళీ టోర్నీలో 210 పరుగులు… ఓవరాల్‌గా 1238 పరుగులు సాధించాడు.

సగటు బ్యాటింగ్: ఐపీఎల్‌లో 44.69 ఉండగా, దేశవాళీలో 35… మొత్తం టీ20ల్లో 42.68 సగటు నమోదు చేశాడు.

Strike Rate: ఐపీఎల్‌లో ఏకంగా 228.95 స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడగా, దేశవాళీలో 155.56… ఓవరాల్‌గా 211.98 భారీ స్ట్రైక్ రేట్ మైంటైన్ చేస్తున్నాడు!

హాఫ్ సెంచరీలు / సెంచరీలు: ఐపీఎల్‌లో 6 ఫిఫ్టీలు, 2 సెంచరీలు… దేశవాళీలో 1 సెంచరీ బాదాడు. ఓవరాల్‌గా 6 ఫిఫ్టీలు, 3 సెంచరీలు తన ఖాతాలో ఉన్నాయి.

50+ స్కోరు రేషియో: ఐపీఎల్‌లో ప్రతి 2.8 ఇన్నింగ్స్‌లకు ఒక 50+ స్కోరు చేస్తుండగా, ఓవరాల్‌గా ప్రతి 3.3 ఇన్నింగ్స్‌లకు ఒక భారీ స్కోరు సాధిస్తున్నాడు.

విఫలమైన ఇన్నింగ్స్‌లు: 15 కంటే తక్కువ పరుగులు ఐపీఎల్‌లో 6 సార్లు, దేశవాళీలో 5 సార్లు వచ్చాయి.

మొత్తం టీ20ల్లో 2 సార్లు మాత్రమే డకౌట్ అయ్యాడు.

బౌలింగ్ రికార్డ్: బౌలింగ్‌లో మాత్రం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 2.5 ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీసుకోలేదు.

భారత గడ్డపై వైభవ్ ఆడిన 30 టీ20 ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే… రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో ఈ 15 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్ ఏకంగా 1028 పరుగులు సాధించాడు! అది కూడా 228.95 స్ట్రైక్ రేట్, 44.69 సగటుతో! ఐపీఎల్‌లో 6 అర్ధసెంచరీలు, 2 సెంచరీలు బాది… ప్రతి 3 ఇన్నింగ్స్‌లలో ఒకసారి 50 ప్లస్ స్కోరు నమోదు చేస్తూ విధ్వంసం సృష్టించాడు. అయితే, బీహార్ తరఫున ఆడిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మాత్రం 7 మ్యాచ్‌ల్లో 5 సార్లు 15 పరుగుల లోపే ఔటై కాస్త తడబడ్డాడు.

కానీ మహారాష్ట్రపై ఆడిన 61 బంతుల్లో 108 పరుగుల క్లాసిక్ ఇన్నింగ్స్ అతనిలోని అసలు సత్తాను చాటిచెప్పంది! ఐపీఎల్ సంచలన ఇన్నింగ్స్‌ల పుణ్యమా అని స్వదేశీ టీ20ల్లో మొత్తం 211.98 స్ట్రైక్ రేట్‌తో 1238 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో కూడా వైభవ్ చెలరేగిపోయాడు! తొలి మ్యాచ్‌లోనే అత్యంత పిన్న వయసులో టీ20 అంతర్జాతీయ అర్ధసెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించగా, ఆఖరి మ్యాచ్‌లో 49 బంతుల్లోనే 81 పరుగుల క్లాస్ నాక్‌తో అగ్నిపర్వతంలా విరుచుకుపడ్డాడు.

ఇక ఇప్పుడు మ్యాచ్‌లు జరగబోయే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వైభవ్‌కు మైండ్ బ్లోయింగ్ రికార్డ్ ఉంది! ఇక్కడ ఆడిన కేవలం 2 టీ20 ఇన్నింగ్స్‌ల్లోనే 51.50 సగటు, 190.74 స్ట్రైక్ రేట్‌తో 103 పరుగులు బాదాడు! తన కలల ఫామ్‌లో ఉన్న ఈ 15 ఏళ్ల కుర్రాడు అఫ్గానిస్తాన్‌పై ఢిల్లీ మైదానంలో ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి! 
 

1 COMMENT

  1. What a fantastic opportunity for 15-year-old Vaibhav Suryavanshi! A home series against Afghanistan could be the perfect platform for him to showcase his talent and gain valuable experience. Wishing him the very best!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles