Top 5 This Week

Related Posts

రోహిత్ శర్మ భవిష్యత్‌పై కీలక చర్చ.. 2027 వరల్డ్ కప్ రోడ్‌మ్యాప్‌పై BCCI బిగ్ మీటింగ్!

రోహిత్ శర్మ భవిష్యత్‌పై B C C I బిగ్ మీటింగ్.. 2027 వరల్డ్ కప్‌కి టీమిండియా రోడ్‌మ్యాప్ ఇదేనా? టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ భవిష్యత్ ఏంటి? 2027 వన్డే వరల్డ్ కప్‌కి భారత జట్టు ఎలా ఉండాలి? ఇటీవల వచ్చిన వరుస ఓటములకు కారణాలేంటి? ఈ అంశాలపై B C C I గురువారం ముంబైలో కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ మీటింగ్‌లో B C C I సెక్రటరీ దేవజిత్ సైకియా, ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, V V S లక్ష్మణ్‌తో పాటు కెప్టెన్లు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.

అయితే ఈ మీటింగ్‌లో అందరి దృష్టి మాత్రం రోహిత్ శర్మ భవిష్యత్‌పైనే ఉండనుంది. రోహిత్‌కు ఉన్న గౌరవం, అతని అనుభవం గురించి B C C I కి పూర్తి అవగాహన ఉంది. కానీ 2027 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని, రోహిత్ తర్వాతి టీమ్‌ను కూడా ఇప్పటి నుంచే సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే రోహిత్‌ను మొత్తం వరల్డ్ కప్ సైకిల్‌కు కొనసాగించడం కంటే, ప్రతి సిరీస్ తర్వాత అతని పాత్రను సమీక్షించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

ఇక టీమిండియా వన్డే జట్టు విషయంలో మరో పెద్ద సమస్య ఉంది. ప్రస్తుతం భారత O D I టీమ్ పూర్తిగా సెటిల్ కాలేదు. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలు, వర్క్‌లోడ్ కారణంగా ఒక స్థిరమైన కోర్ టీమ్‌ను సెలెక్టర్లు ఇంకా తయారు చేయలేకపోయారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా విషయంలో ఫిట్‌నెస్ సమస్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అతనికి ఒక రోజులో ఆరు ఓవర్లు బౌలింగ్ చేసేంతవరకే క్లియరెన్స్ ఉందని సమాచారం. మరోవైపు నితీశ్ కుమార్ రెడ్డి ఇంకా పూర్తి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందలేదు.

ఇటీవల ఐర్లాండ్‌లో T20 సిరీస్ ఓటమి, ఇంగ్లండ్‌లో ఘోర పరాజయాలు, శ్రీలంక టూర్‌లో వచ్చిన ఫలితాలు కూడా B C C I ని ఆలోచనలో పడేశాయి. ముఖ్యంగా నాటింగ్‌హామ్‌లో 125 పరుగుల తేడాతో ఓడిపోవడం టీమిండియా ,ఇటీవలి కాలంలో ఎదుర్కొన్న అత్యంత చెత్త ప్రదర్శనల్లో ఒకటిగా భావిస్తున్నారు. అయితే ఈ మీటింగ్‌లో ఎవరినీ నిందించడం కంటే, సమస్యలకు పరిష్కారం కనుగొనడంపైనే B C C I దృష్టి పెట్టనుంది. ఫిట్‌నెస్ మేనేజ్‌మెంట్ కూడా కీలక అంశంగా మారనుంది.

బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను కూడా పరిశీలించనున్నారు. అంతేకాదు, V V S లక్ష్మణ్‌కు మరింత పెద్ద బాధ్యత ఇచ్చే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆయనను ‘Director of Cricket’గా నియమించి కోచింగ్, సెలెక్షన్, ప్లేయర్ డెవలప్‌మెంట్‌ను చూసే బాధ్యత ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవీకాలం కూడా ఈ నెలతో ముగియనుంది. ఆయనకు మరో ఏడాది పొడిగింపు ఇవ్వాలా అనే అంశం కూడా చర్చకు రావచ్చు. మొత్తంగా చూస్తే.. ఈ B C C I మీటింగ్‌లో రోహిత్ శర్మ భవిష్యత్, 2027 వరల్డ్ కప్ ప్లాన్, టీమిండియా O D I జట్టు కూర్పు, ఆటగాళ్ల ఫిట్‌నెస్ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది.
 

1 COMMENT

  1. Rohit Sharma’s future is definitely a major talking point. The BCCI’s roadmap for the 2027 World Cup will be crucial, and hopefully the final decision keeps the team’s long-term success in focus.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles