కేఎస్ భరత్‌కు బిగ్ ఛాన్స్.. ఐఎల్టీఎల్ twenty డెవలప్మెంట్ టోర్నీలో ఎంట్రీ! టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్‌కు మరో కీలక అవకాశం దక్కింది! డీపీ వరల్డ్ ఐఎల్టీఎల్ twenty డెవలప్మెంట్ టోర్నమెంట్ నాలుగో ఎడిషన్‌లో భరత్ ఆడబోతున్నాడు. సెప్టెంబర్ 2న జరిగిన ప్లేయర్ డ్రాఫ్ట్ తర్వాత ఈ టోర్నీలో పాల్గొనే ఆరు జట్ల స్క్వాడ్స్‌ను ప్రకటించారు.
ఈ ఆరు జట్లలో ఒకటైన ఎంఐ ఎమిరేట్స్ డెవలప్మెంట్ జట్టులో కేఎస్ భరత్‌కు చోటు దక్కింది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 14 నుంచి దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో జరగనుంది. యూఏఈకి చెందిన యువ క్రికెటర్లకు మంచి అవకాశం కల్పించడంతో పాటు.. ఇప్పటికే ఐఎల్టీఎల్ twenty లో ఆడిన ఆటగాళ్లకు కూడా తమ ప్రతిభ చూపించే వేదికగా ఈ టోర్నీ ఉపయోగపడనుంది.
ముఖ్యంగా.. వచ్చే ఐఎల్టీఎల్ twenty సీజన్ 5 ప్లేయర్ ఆక్షన్ అక్టోబర్ 1న దుబాయ్‌లో జరగనుంది. దీంతో ఈ డెవలప్మెంట్ టోర్నమెంట్లో రాణించే ఆటగాళ్లపై ఫ్రాంచైజీల దృష్టి పడే అవకాశం ఉంది. ఇక కేఎస్ భరత్ ఉన్న ఎంఐ ఎమిరేట్స్ డెవలప్మెంట్ జట్టులో మరికొందరు మంచి ఆటగాళ్లు కూడా ఉన్నారు. అలీ నసీర్, ఆర్యన్ లక్రా, మహ్మద్ రోహిద్, ఉస్మాన్ ఖాన్, జహూర్ ఖాన్ వంటి ఆటగాళ్లు కూడా ఈ జట్టులో ఉన్నారు.
భరత్‌కు ఇది తన ఆటను మరోసారి చూపించుకునే మంచి అవకాశం కానుంది. ఇక మిగతా జట్లను చూస్తే.. అబుదాబి నైట్ రైడర్స్ డెవలప్మెంట్, డెజర్ట్ వైపర్స్ డెవలప్మెంట్, దుబాయ్ క్యాపిటల్స్ డెవలప్మెంట్, గల్ఫ్ జెయింట్స్ డెవలప్మెంట్, షార్జా వారియర్జ్ డెవలప్మెంట్ జట్లు కూడా బరిలో ఉన్నాయి. గత ఏడాది డెవలప్మెంట్ టోర్నమెంట్లో షార్జా వారియర్జ్ డెవలప్మెంట్ టైటిల్ గెలిచింది. ఫైనల్లో డెజర్ట్ వైపర్స్ డెవలప్మెంట్ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.
ఈసారి కూడా అదే జట్టు టైటిల్‌ను నిలబెట్టుకోవాలని చూస్తోంది. మొత్తం ఆరు జట్లు సింగిల్ లీగ్ రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీ పడతాయి. సెప్టెంబర్ 14న తొలి మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్ డెవలప్మెంట్, ఎంఐ ఎమిరేట్స్ డెవలప్మెంట్ తలపడనున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 23న రెండు సెమీఫైనల్స్.. సెప్టెంబర్ 24న ఫైనల్ జరగనుంది. మరి ఈ టోర్నీలో కేఎస్ భరత్ ఎలా రాణిస్తాడు? అతడి ప్రదర్శనతో మరోసారి పెద్ద లీగ్‌లోకి వచ్చే అవకాశం దక్కుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



Great comeback