Top 5 This Week

Related Posts

“ఇండియాతో మ్యాచ్ తర్వాత పాక్ కెప్టెన్‌కు షాక్.. ఫాతిమా సనాపై ఐసీసీ చర్య!”

ఇండియాతో మ్యాచ్‌లో షఫాలీ వర్మను ఔట్ చేసిన తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా చేసిన ఆ ఒక్క gesture ఇప్పుడు ఆమెకు పెద్ద సమస్యగా మారింది! ఏకంగా ఐసీసీ ఆమెపై చర్యలు తీసుకుంది! మహిళల ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత పాక్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ 10 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించింది. అంతేకాదు.. ఆమె disciplinary record లో ఒక demerit point కూడా యాడ్ చేసింది. అసలు ఫాతిమా చేసిన తప్పేంటి? భారత్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో షఫాలీ వర్మను ఫాతిమా సనా ఔట్ చేసింది. షఫాలీ వికెట్ పడిన తర్వాత..

ఫాతిమా పావిలియన్ వైపు చేతితో gesture చేసింది. ఈ gesture బ్యాటర్‌ను అవమానించేలా ఉండటమే కాకుండా.. ఆమె నుంచి aggressive reaction వచ్చేలా చేసే చర్యగా ఐసీసీ భావించింది. అందుకే ఫాతిమా సనా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని Level 1 నిబంధనను ఉల్లంఘించినట్లు తేలింది. ఈ నిబంధన ప్రకారం.. బ్యాటర్ ఔటైన తర్వాత ఆమెను అవమానించేలా మాటలు, చేతి సంజ్ఞలు లేదా ఇతర చర్యలు చేయకూడదు. ఫాతిమా తన తప్పును అంగీకరించింది. ఐసీసీ మ్యాచ్ రిఫరీ సుప్రియా రాణి దాస్ ఇచ్చిన శిక్షను కూడా ఆమె అంగీకరించడంతో..

ప్రత్యేకంగా formal hearing నిర్వహించాల్సిన అవసరం రాలేదు. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయము ఉంది. ఇది ఫాతిమాకు 24 నెలలలో రెండో offence. గతంలో 2025 ఆగస్టు 6న ఐర్లాండ్‌తో జరిగిన T20 మ్యాచ్‌లో కూడా ఆమెకు ఒక demerit point వచ్చింది. ఇప్పుడు మరో demerit point రావడంతో.. 24 నెలల కాలంలో ఆమె ఖాతాలో మొత్తం రెండు demerit points ఉన్నాయి. మరి ఈ demerit points ఎందుకు అంత ముఖ్యమంటే? ఒక ప్లేయర్‌కు 24 నెలల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ demerit points వస్తే.. అవి suspension points గా మారతాయి.

ఆ తర్వాత ప్లేయర్‌పై మ్యాచ్ నిషేధం కూడా పడొచ్చు. రెండు suspension points వస్తే.. ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వన్డేలు లేదా రెండు T20 మ్యాచ్‌ల నిషేధం పడే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఫాతిమాకు రెండు demerit points మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే ఆమెపై suspension లేదు. మరోవైపు Level 1 offence లకు కనీసం official reprimand నుంచి గరిష్టంగా 50 శాతం మ్యాచ్ ఫీజు వరకు జరిమానా విధించవచ్చు. అలాగే ఒకటి లేదా రెండు demerit points కూడా ఇవ్వవచ్చు.

ఈ ఘటనపై ఫాతిమాపై ఫీల్డ్ అంపైర్లు నిమాలి పెరేరా, షతీరా జాకీర్ జెసీ, థర్డ్ అంపైర్ రోకేయా సుల్తానా, ఫోర్త్ అంపైర్ రబాబ్ అహ్సన్ charge చేశారు. అంటే.. షఫాలీ వర్మను ఔట్ చేసిన తర్వాత చేసిన ఆ ఒక్క gesture కారణంగా ఫాతిమా సనాకు ఇప్పుడు 10 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాతో పాటు మరో demerit point కూడా వచ్చింది. మరి ఇకపై ఫాతిమా ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటుందా? లేక మళ్లీ ఇలాంటి ఘటన జరిగితే ఆమెపై మరింత కఠినమైన చర్యలు పడతాయా అనేది చూడాలి. 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles