Top 5 This Week

Related Posts

CSK లో Captaincy Change..? Ruturaj Place లో Sanju Samson..!

“ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కు నిజమైన వారసుడు ఎవరు..? రుతురాజ్ గైక్వాడ్‌నా… లేక ఇప్పుడు సంజూ శాంసన్ ఎంట్రీతో CSK లో పెద్ద మార్పు జరగబోతుందా..? ఒక్కప్పుడు ప్లేఆఫ్స్ అంటే CSK పేరు ఫిక్స్… కానీ ఇప్పుడు అభిమానులు అడుగుతున్న ఒక్క ప్రశ్న — ‘థలాకు తర్వాత టీమ్ ఎందుకు ఇలా మారిపోయింది?’ ఈ వీడియో చివరి వరకూ చూడండి… ఎందుకంటే CSK ఫ్యూచర్‌పై బయటకు వస్తున్న వార్తలు ఇప్పుడు IPL లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి!”

మరోసారి నిరాశపరిచిన IPL సీజన్ తర్వాత, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 2026 సీజన్ కూడా CSK కి ఆశించిన విధంగా జరగలేదు. ప్లేఆఫ్స్ రేస్‌లో ఉండాల్సిన టీమ్, ఈసారి టాప్-4కి కూడా చేరలేకపోయే పరిస్థితిలో పడిపోయింది. ఒకప్పుడు “కమ్‌బ్యాక్ కింగ్స్” అని పేరు తెచ్చుకున్న CSK… ఇప్పుడు మ్యాచ్ గెలవడానికే కష్టపడుతోంది.

ఇక అభిమానుల దృష్టి మొత్తం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మీద పడింది. బ్యాటింగ్‌లోనూ, కెప్టెన్సీలోనూ అతను ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. ధోనీ వారసుడిగా భారీ అంచనాలతో వచ్చిన రుతురాజ్… ఇప్పుడు ఆ ఒత్తిడిలోనే కనిపిస్తున్నాడు.

ఇటీవల Cricbuzz డిస్కషన్‌లో మాజీ భారత ఆటగాడు మరియు KKR బ్యాటర్ Manoj Tiwary ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. Sunrisers Hyderabad తో జరిగిన మ్యాచ్ తర్వాత మాట్లాడిన మనోజ్ తివారీ… “ధోనీ షూస్‌ని ఎవ్వరూ ఫిల్ చేయలేరు” అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు.

అతను చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“రుతురాజ్ ముందుగా తన సొంత లెగసీని క్రియేట్ చేసుకోవాలి. ధోనీలా అవ్వాలని ప్రయత్నించడం కంటే, తన ఆటను ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవాలి. కెప్టెన్‌గా సక్సెస్ అవ్వాలంటే ముందు బ్యాట్స్‌మన్‌గా రన్స్ చేయాలి. కానీ ప్రస్తుతం అతనిలో ఆ ఫ్లో కనిపించడం లేదు” అని తివారీ చెప్పాడు.

నిజం చెప్పాలంటే, ఈ సీజన్ రుతురాజ్ ప్రదర్శన అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. 13 మ్యాచ్‌ల్లో కేవలం 321 పరుగులు మాత్రమే చేశాడు. average కూడా 30 కి తక్కువగా ఉంది. ముఖ్యంగా అతని స్ట్రైక్ రేట్ 120 దగ్గర ఉండటం… ఈ T twenty యుగంలో చాలా నెమ్మదిగా భావిస్తున్నారు.

ఇక ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే డాట్ బాల్స్ ఎక్కువ ఆడటం కూడా అభిమానుల కోపానికి కారణమైంది. సోషల్ మీడియాలో “ఇది ధోనీ CSK కాదు” అంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి.

అయితే తివారీ చెప్పిన మరో మాట ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయింది. “ధోనీ లేకుండానే CSK మ్యాచ్‌లు గెలవగలదని ఇప్పుడు అర్థమైంది. కానీ అతని ప్రెజెన్స్‌ని మాత్రం ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు” అని అన్నాడు.

ఇది నిజంగానే ఫ్యాన్స్‌ ను ఎమోషనల్ చేసింది. ఎందుకంటే మైదానంలో ధోనీ ఉన్నప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్… బౌలర్లకు ఇచ్చే సలహాలు… చివరి ఓవర్లలో చేసే magic … ఇవన్నీ ఇప్పటికీ అభిమానులు మిస్ అవుతున్నారు.

ఇప్పుడు అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది! వచ్చే సీజన్‌లో CSK కెప్టెన్‌గా సంజూ శాంసన్ రావచ్చని మనోజ్ తివారీ బాంబ్ పేల్చాడు.

Sanju Samson పేరు వినగానే ఇప్పుడు ఫ్యాన్స్‌లో కొత్త డిబేట్ మొదలైంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా సంజూ ఇప్పటికే తన టాలెంట్ ప్రూవ్ చేశాడు. యంగ్ ప్లేయర్లను హ్యాండిల్ చేయడం, అటాకింగ్ క్రికెట్ ఆడించడం, ప్రెషర్‌లో బ్యాటింగ్ చేయడం — ఇవన్నీ అతని స్ట్రెంగ్త్స్.

ఈ సీజన్‌లో కూడా సంజూ కీలక మ్యాచ్‌ల్లో ఫాస్ట్ ఫిఫ్టీలు కొట్టి తన క్లాస్ చూపించాడు. ముఖ్యంగా బెంగళూరుపై అతను ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

మనోజ్ తివారీ మాటల్లో…

“సంజూ శాంసన్ రేస్‌లో ఉన్నాడు. CSK అతన్ని తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉంటుంది. రుతురాజ్‌కు రెండు సీజన్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు కొత్త నాయకత్వం గురించి ఆలోచించే టైమ్ వచ్చింది. RR కి కెప్టెన్‌గా సంజూ మంచి పని చేశాడు. అతను మంచి బ్యాట్స్‌మన్ కూడా” అని చెప్పాడు.

ఇప్పుడు ఇదే విషయం IPL వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఒకవేళ నిజంగానే సంజూ CSK కెప్టెన్ అయితే… అది IPL లోనే అతిపెద్ద ట్విస్ట్ అవుతుంది.

మరి మీ అభిప్రాయం ఏంటి..?
CSK కెప్టెన్‌గా రుతురాజ్‌కే ఇంకో ఛాన్స్ ఇవ్వాలా..?
లేక సంజూ శాంసన్‌కు నాయకత్వం అప్పగించాలా..?

“మీ అభిప్రాయం కామెంట్‌లో చెప్పండి
ఇలాంటి క్రికెట్ వీడియోల కోసం ఛానెల్‌ని Subscribe చేసి Bell Icon press చేయండి.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles