Top 5 This Week

Related Posts

Mumbai Indians కు ఏమైంది..? అశ్విన్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

ఒక్కసారి ఆలోచించండి… ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు ట్రోఫీ గెలిచిన జట్టు… ఎన్నో అసాధ్యాలను సాధ్యం చేసిన టీమ్… చివరి ఓవర్లలో మ్యాచ్‌ ను లాగేసుకునే ముంబై ఇండియన్స్… అదే జట్టు ఈసారి పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో ముగిస్తుందని ఎవరు ఊహించారు? అభిమానులు “ఈసారి కమ్‌బ్యాక్ ఖాయం” అని ఆశపడితే… ప్రతి మ్యాచ్‌లో కొత్త నిరాశ ఎదురైంది. బుమ్రా వికెట్లు తీయలేకపోయాడు… సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ మౌనంగా మారింది… హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ప్రశ్నలు వచ్చాయి. చివరికి రాజస్థాన్ రాయల్స్ చేతిలో చివరి మ్యాచ్ కూడా చేజారిపోవడంతో… ముంబై సీజన్ పూర్తిగా డిజాస్టర్‌గా ముగిసింది!

 Wankhede Stadium లో చివరి మ్యాచ్ సమయంలో పరిస్థితి చూస్తే… ముంబై గెలుపు ఖాయం అనిపించింది. కేవలం 34 బంతుల్లో 60 పరుగులు మాత్రమే కావాలి. క్రీజ్‌లో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. సాధారణంగా ఇలాంటి టార్గెట్ అంటే ముంబై ఇండియన్స్‌కు చిన్న విషయం. కానీ ఈసారి ఏదో విచిత్రం జరిగింది. ఒక్కసారిగా వికెట్లు కూలిపోయాయి. లోయర్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. 148/5 వద్ద బలంగా కనిపించిన జట్టు… చివరికి 175/9 తో నిలిచిపోయింది. మ్యాచ్ మాత్రమే కాదు… అభిమానుల ఆశలు కూడా అక్కడే కుప్పకూలిపోయాయి.

ఈ ఘోర పరాజయం తర్వాత భారత స్పిన్ దిగ్గజం Ravichandran Ashwin తన యూట్యూబ్ ఛానెల్‌లో ముంబైపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ మాటల్లోనే చెప్పాలంటే… “ Wankhede లో 34 బంతుల్లో 60 పరుగులు అంటే ముంబై సాధారణంగా సులభంగా ఛేజ్ చేస్తుంది. కానీ ఈసారి వాళ్లు పూర్తిగా తడబడ్డారు.” అంటూ ఓపెన్‌గా విమర్శించాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా స్పిన్నర్లపై బాగా ఆడినా… అతని బ్యాటింగ్‌లో ఏదో సమస్య కనిపించిందని అశ్విన్ చెప్పాడు.

అశ్విన్ గుర్తు చేసిన మరో ఆసక్తికర విషయము ఏంటంటే… Gujarat Titans తరఫున ఆడినప్పుడు హార్దిక్ పాండ్యా నాలుగో లేదా ఐదో స్థానంలో వచ్చి స్పిన్నర్లపై దాడి చేసేవాడు. మ్యాచ్‌ ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకునేవాడు. కానీ ఇప్పుడు అదే హార్దిక్‌లో ఆ దూకుడు కనిపించడం లేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ వేసిన స్లో షార్ట్ బాల్‌కు హార్దిక్ ఔట్, అయిన క్షణమే మ్యాచ్ ముంబై చేతుల నుంచి జారిపోయిందని అన్నాడు.

ఇటీవల హార్దిక్ పాండ్యా ప్రదర్శనపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చ నడుస్తోంది. కొందరు అభిమానులు అతను కెప్టెన్సీ ఒత్తిడితో అలసిపోయాడని అంటుంటే… మరికొందరు ఫిట్‌నెస్ సమస్యలు ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్నారు. ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో హార్దిక్ బాగా ఫినిష్ చేసినా… కీలక సమయాల్లో మాత్రం పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అదే ముంబైకి పెద్ద దెబ్బ అయింది.

అశ్విన్ మరో షాకింగ్ కామెంట్ కూడా చేశాడు. “ఈ ముంబై టీమ్ చాలా స్ట్రేంజ్‌గా కనిపించింది. వాళ్లలో చాలా మంది ప్లేయర్లు తమ బెస్ట్ ఫామ్‌లో లేరు. ఈ ఏడాది చూసి ఆశ్చర్యపోయాను… కానీ వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటే ఆశ్చర్యపోను” అని చెప్పాడు. అంటే… ముంబై ఇండియన్స్ సమస్య ఒక్క సీజన్‌కే పరిమితం కాకపోవచ్చని అతను సూచించాడు.

ఇక అభిమానులను ఎక్కువగా షాక్‌కు గురిచేసిన విషయము  ఏమిటంటే… Jasprit Bumrah గురించి అశ్విన్ చేసిన వ్యాఖ్యలు. సాధారణంగా బుమ్రా అంటే బ్యాటర్లకు భయం. డెత్ ఓవర్ల లో యార్కర్లతో మ్యాచ్ తిప్పేయగల బౌలర్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి పూర్తి సీజన్ ఆడిన ఓ బౌలర్ సగటు 100 కి పైగా నమోదు చేయడం సంచలనంగా మారింది… ఆ రికార్డు బుమ్రా పేరుమీద ఉండటం అభిమానులను షాక్‌కు గురిచేసింది.

అసలు ఇది వినడానికి కూడా నమ్మశక్యం కాదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల్లో ముంబై విజయాల వెనుక ప్రధాన కారణం బుమ్రానే. కానీ ఈసారి అతను కూడా ప్రభావం చూపలేకపోయాడు. కొన్ని మ్యాచ్‌ల్లో లైన్ అండ్ లెంగ్త్ పూర్తిగా తప్పిపోయింది. వికెట్లు రాకపోవడం మాత్రమే కాదు… ఎకానమీ కూడా పెరిగింది. ఇటీవల గాయాల నుంచి తిరిగి రావడం, నిరంతర క్రికెట్ ఒత్తిడి కూడా కారణం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక Suryakumar Yadav పరిస్థితి కూడా అభిమానులను నిరాశపరిచింది. 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరున్న సూర్య… ఈసారి పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమయ్యాడు. కొన్ని మ్యాచ్‌ల్లో స్టార్ట్ ఇచ్చినా… దాన్ని భారీ స్కోర్‌గా మార్చలేకపోయాడు. గత సీజన్లలో ఒంటరిగా మ్యాచ్‌లు గెలిపించిన సూర్య… ఈసారి ఆ magic చూపించలేకపోవడం ముంబై బ్యాటింగ్‌ను బలహీనపరిచింది.

ఒకప్పుడు ప్రత్యర్థి జట్లు భయపడే ముంబై ఇండియన్స్… ఇప్పుడు తమ కాంబినేషన్ గురించే కన్ఫ్యూజన్‌లో పడిపోయినట్లు కనిపిస్తోంది. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్సీ మార్పు… డ్రెస్సింగ్ రూమ్‌లో ఒత్తిడి… ప్లేయర్ల ఫామ్… ఇవన్నీ కలిసి జట్టును తీవ్రంగా దెబ్బతీశాయి. అభిమానులు కూడా సోషల్ మీడియాలో “ఇది మన ముంబై కాదు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ముంబైను పూర్తిగా తక్కువ అంచనా వేయడం కూడా ప్రమాదమే. ఎందుకంటే ఈ జట్టు గతంలో ఎన్నోసార్లు కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఒక్క మంచి ఆక్షన్… ఇద్దరు కీలక ప్లేయర్ల ఫామ్… ఒక సరైన కెప్టెన్సీ నిర్ణయం… చాలు ముంబై మళ్లీ ఛాంపియన్‌లా మారిపోతుంది. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం…“ ముంబై ఇండియన్స్ మళ్లీ పాత ఫామ్‌లోకి రావాలంటే జట్టును కొత్తగా సెట్ చేసుకోవాలి. మరి వచ్చే సీజన్‌ లో ముంబై నిజంగా కమ్‌బ్యాక్ ఇస్తుందా? లేక అశ్విన్ చెప్పినట్టే మరోసారి నిరాశపరుస్తుందా? ఇదే ఇప్పుడు ఐపీఎల్ అభిమానులందరిలో పెద్ద చర్చగా మారింది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles