Top 5 This Week

Related Posts

గ్యారీ సోబర్స్: తాను ఎవరికీ సాటిరానివాడని తెలియని క్రికెట్ దిగ్గజం

గ్యారీ సోబర్స్… క్రికెట్ చరిత్రలో ఎన్నో దిగ్గజాలు వచ్చినా, ఆయనలాంటి ఆల్‌రౌండర్ మాత్రం ఇప్పటికీ లేరు. తన సహచరులు కూడా తనలాగే బ్యాటింగ్ చేస్తారని, తనలాగే క్యాచ్‌లు పడతారని, తనలాగే ఆలోచిస్తారని సోబర్స్ నమ్మేవాడు. ఎందుకంటే తాను ఎంత అసాధారణమైన ఆటగాడో ఆయనకు అసలు తెలియదు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ చార్లీ డేవిస్ ఒకసారి చెప్పిన మాటలు ఇవి. సోబర్స్ ఎప్పుడూ తన సహచరులతో… “నేను 150 కొడతాను… నువ్వు 100 కొట్టు… ఇంకొకరు 75 చేయండి” అని చెప్పేవాడు.

ఆత్మవిశ్వాసమే ఆయన బలం. కానీ 1959లో జరిగిన ఒక కారు ప్రమాదం ఆయన జీవితాన్నే మార్చేసింది. ఆ ప్రమాదంలో ఆయన అత్యంత సన్నిహిత మిత్రుడు, వెస్టిండీస్ క్రికెటర్ కాలీ స్మిత్ తీవ్రంగా గాయపడి మూడు రోజుల తర్వాత మరణించాడు. ఆ ఘటనకు తానే కారణమని భావించిన సోబర్స్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కొంతకాలం మద్యం వైపు వెళ్లినా… వెంటనే తనను తాను మార్చుకున్నాడు. ఇకపై తాను ఇద్దరి కోసం ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఒకరు గార్‌ఫీల్డ్ సోబర్స్…

మరొకరు తన మిత్రుడు కాలీ స్మిత్. చిన్నప్పటి నుంచి ఆయనకు ఎలాంటి ప్రొఫెషనల్ కోచింగ్ లేదు. 14 ఏళ్ల వయసులో ఫర్నిచర్ ఫ్యాక్టరీలో పని చేస్తూనే వీధి క్రికెట్ ఆడుతూ తన ఆటను తీర్చిదిద్దుకున్నాడు. 21 ఏళ్లకే పాకిస్థాన్‌పై తన తొలి టెస్ట్ సెంచరీని ఏకంగా 365 పరుగుల వరకు తీసుకెళ్లి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు 36 సంవత్సరాల పాటు నిలిచింది. తర్వాత బ్రియాన్ లారా మాత్రమే దానిని అధిగమించాడు. సోబర్స్ కేవలం బ్యాటర్ మాత్రమే కాదు. అవసరమైతే ఫాస్ట్ బౌలింగ్, ఆఫ్ స్పిన్, చైనామన్, రిస్ట్ స్పిన్…

జట్టుకు ఏది అవసరమో అదే బౌలింగ్ చేసేవాడు. 1968లో స్వాన్సీలో మాల్కమ్ నాష్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన తొలి ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 93 టెస్ట్ మ్యాచ్‌ల్లో 8,032 పరుగులు, సగటు 57.78, అలాగే 235 వికెట్లు… ఇవే ఆయన అసాధారణ కెరీర్‌కు నిదర్శనం.చార్లీ డేవిస్ ఒకసారి “సోబర్స్ సాధారణ మనిషి కాదు. ఆయన పూర్తిగా భిన్నమైన వ్యక్తి” అని అన్నాడు. ఆయన క్యాచ్‌లు పట్టే విధానం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. 1971-72లో డెన్నిస్ లిల్లీ తనను డక్ అవుట్ చేసిన తర్వాత…

“అతనికి చెప్పండి, నేను కూడా వేగంగా బౌలింగ్ చేయగలనని” అంటూ సవాల్ విసిరాడు. తర్వాత లిల్లీకే బౌన్సర్లు వేసి తన సత్తా చాటాడు. అదే సిరీస్‌లో ఆయన చేసిన 254 పరుగుల ఇన్నింగ్స్‌ను డాన్ బ్రాడ్‌మన్ ఆస్ట్రేలియా గడ్డపై చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా ప్రశంసించాడు. 1973లో లార్డ్స్ టెస్ట్‌కు ముందు రాత్రంతా పార్టీ చేసుకున్నా… మరుసటి రోజు అజేయంగా 150 పరుగులు చేసి తన చివరి టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సోబర్స్ జీవిత తత్వం ఒక్కటే… “జీవితం అనేది ఆస్వాదించడానికి.

“అంపైర్ నిర్ణయం కోసం ఎదురు చూడకుండా తాను అవుట్ అయితే స్వయంగా మైదానం వీడేవాడు. స్లెడ్జింగ్‌ను అస్సలు ఇష్టపడేవాడు కాదు. 1980లలో శ్రీలంక జట్టుకు కోచ్‌గా ఉన్నప్పుడు, యువ అర్జున రణతుంగతో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇంగ్లండ్‌లో సీమింగ్ పిచ్‌పై శ్రీలంక బ్యాటర్లు ఇబ్బంది పడుతుండగా… సోబర్స్ బ్యాట్ కూడా తీసుకోకుండా కేవలం ఒక స్టంప్‌తో ఆరు బంతులను అద్భుతంగా ఆడాడు. అప్పుడు అందరికీ ఆయన అసాధారణ ప్రతిభ మరోసారి అర్థమైంది.

ఇలాంటి అరుదైన క్రికెట్ కథలు, లెజెండ్స్ జీవిత విశేషాలు, తాజా క్రికెట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానెల్‌ను ఇప్పుడే Subscribe చేయండి. ఈ వీడియో నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి, అలాగే మీ క్రికెట్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా Share చేయండి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles