Top 5 This Week

Related Posts

హార్దిక్ పాండ్యా కమ్‌బ్యాక్‌కు మరో బిగ్ షాక్.. ప్లాన్స్‌కు బ్రేక్!

హార్దిక్ పాండ్యా కమ్‌బ్యాక్‌కు మరోసారి బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న హార్దిక్‌కు చివరి నిమిషంలో వచ్చిన లెగ్ సమస్య ఇప్పుడు పెద్ద అడ్డంకిగా మారింది. బెంగళూరులోని BCCI Centre of Excellence లో హార్దిక్ తన ఫిట్‌నెస్‌పై గట్టిగా పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. కానీ తాజాగా కాలిలో కొంత అసౌకర్యం రావడంతో బౌలింగ్‌ను తాత్కాలికంగా ఆపేయాలని అతడికి సూచించారు.

హార్దిక్ ఫుల్ ఇంటెన్సిటీతో ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ ఈ లెగ్ డిస్కంఫర్ట్ కారణంగా ప్రస్తుతం బౌలింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ బౌలింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మూడు T20 మ్యాచ్‌ల సిరీస్ చాలా దగ్గరలోనే ఉండటంతో.. అప్పటిలోపు అవసరమైన ఫిట్‌నెస్ సాధించడం కష్టంగా మారింది. ముఖ్యంగా బ్యాటింగ్, గ్రౌండ్‌లో మూవ్‌మెంట్ విషయంలో పెద్ద సమస్య ఏమీ లేదని సమాచారం. కానీ హార్దిక్‌ను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాతే సెలెక్టర్లు అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ

ఫ్ఘనిస్తాన్‌తో మూడు T20 మ్యాచ్‌ల సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం టీమ్‌ను ఎంపిక చేయడానికి సెలెక్టర్లు ఈ వారంలో సమావేశం కానున్నారు. బెంగళూరులో ఫిట్‌నెస్ కోసం రికవరీ అవుతున్న ఆటగాళ్ల పరిస్థితిపై కూడా వారికి త్వరలో పూర్తి సమాచారం అందనుంది. హార్దిక్ చివరిసారిగా ముంబై ఇండియన్స్ తరఫున మే 24న IPL లో పోటీ మ్యాచ్ ఆడాడు. టీమిండియా తరఫున అతడి చివరి మ్యాచ్ మాత్రం మార్చి 8న జరిగిన T20 వరల్డ్ కప్ ఫైనల్.

ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వైట్ బాల్ సిరీస్‌తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు కూడా హార్దిక్ దూరమయ్యాడు. ఇప్పటికే గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్‌తో O D I సిరీస్‌కు ముందు హార్దిక్‌కు క్వాడ్రిసెప్స్‌లో చిన్న గాయం తిరగబెట్టింది. అప్పుడు కూడా అతడు మంచి ఫిట్‌నెస్‌తో ట్రైనింగ్ చేస్తున్న సమయంలోనే ఈ సమస్య వచ్చింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ విషయంలో మంచి ప్రోగ్రెస్‌లో ఉన్నారు. అయితే జస్ప్రీత్ బుమ్రా పరిస్థితి మాత్రం ఇంకా క్లియర్‌గా లేదు.

ఆ మూడు మ్యాచ్‌లకు అతడు ఆడటంపై సందేహాలు కొనసాగుతున్నాయి. అయితే ఆసియా గేమ్స్‌కు మాత్రం బుమ్రా అందుబాటులో ఉండేలా అతడి రికవరీ కొనసాగుతోంది. మొత్తానికి హార్దిక్ పాండ్యా కమ్‌బ్యాక్‌కు మరో అడ్డంకి ఎదురైంది. మరి ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో హార్దిక్ కనిపిస్తాడా? లేదా అతడి రీఎంట్రీ మరింత ఆలస్యం అవుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. “ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles