ఒక్క మ్యాచ్ ఓడిపోవడం కాదు… మొత్తం సీజన్ నే చేతులారా వదులుకున్నట్టుంది!”
ఒకప్పుడు IPL లో ప్రత్యర్థులకు భయం పుట్టించిన Mumbai Indians… ఇప్పుడు మాత్రం వరుస తప్పిదాలతో అభిమానులనే షాక్‌కు గురిచేస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ Hardik Pandya మ్యాచ్ తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “మేము మళ్లీ అదే తప్పులు చేశాం” అంటూ హార్దిక్ చెప్పిన మాటలు M I పరిస్థితిని పూర్తిగా బయటపెట్టేశాయి. మరోవైపు Kolkata Knight Riders మాత్రం చివరి వరకూ పోరాడుతూ ప్లేఆఫ్ ఆశలను బ్రతికించుకుంది. అసలు ఈ మ్యాచ్‌లో ఏం జరిగింది? హార్దిక్ ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అయ్యాడు? ఇప్పుడు పూర్తి కథ చూద్దాం.
“బుధవారం జరిగిన తక్కువ స్కోర్లు నమోదైన ఉత్కంఠభరిత మ్యాచ్ లో, Kolkata Knight Riders నాలుగు వికెట్ల తేడాతో Mumbai Indians పై అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో KKR ఖాతాలో 13 పాయింట్లు చేరగా, ఇంకా ఒక లీగ్ మ్యాచ్ మిగిలి ఉండటంతో ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. కానీ ఇప్పటికే టోర్నీ నుంచి దాదాపు బయటపడిన ముంబై ఇండియన్స్‌కు ఇది మరో నిరాశాజనక రాత్రిగా మారింది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా… “బ్యాటింగ్‌లో మేము కనీసం 20 పరుగులు తక్కువ చేశాం. పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయాం. నేను, Tilak Varma ఇంకొంచెం సేపు క్రీజ్‌లో నిలబడి భాగస్వామ్యం నిర్మించి ఉంటే, మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది” అంటూ నిరాశ వ్యక్తం చేశాడు.
అయితే అసలు హార్దిక్‌కు ఎక్కువ కోపం తెప్పించింది ఫీల్డింగ్. ఈ సీజన్ మొత్తంలో ముంబై ఇండియన్స్ చేతులారా ఎన్నో మ్యాచ్‌లు, వదులుకుందని అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా కీలక క్యాచ్‌లు డ్రాప్ చేయడం M I కి భారీ నష్టం కలిగించింది. ఇదే విషయంపై హార్దిక్ మాట్లాడుతూ… “ఈ సీజన్ లో మా ఫీల్డింగ్ అస్సలు స్థాయికి తగ్గట్టు లేదు.”ఎన్నో క్యాచ్‌లు వదిలేశాం. మ్యాచ్ గెలవాలంటే హాఫ్ ఛాన్సెస్ అయినా పట్టుకోవాలి. కానీ కీలక సమయాల్లో అవకాశాలు వదిలేస్తే మీరు ఎప్పుడూ మ్యాచ్ ను వెంబడించాల్సిందే” అని చెప్పాడు.
ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్‌ల్లో కూడా ఇదే కథ కనిపించింది. డెత్ ఓవర్ల లో బౌలర్లపై ఒత్తిడి పెరగడం, సీనియర్ ప్లేయర్లు కీలక సమయాల్లో విఫలం కావడం, ఫీల్డింగ్ మిస్టేక్స్… ఇవన్నీ కలిసి M I సీజన్ ను దెబ్బతీశాయి. అభిమానులు అయితే “రోహిత్ తర్వాత జట్టులో ఆ పాత ఫైర్ కనిపించడం లేదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఒక విషయము మాత్రం హార్దిక్‌కు బాగా నచ్చింది. ఈ మ్యాచ్ జరిగిన పిచ్ గురించి మాట్లాడుతూ… “ఇలాంటి వికెట్లపై ఆడటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. IPL పూర్తిగా బ్యాట్స్‌మెన్ గేమ్‌గా మారిపోతోంది. బౌలర్లు పూర్తిగా helpless గా ఫీలవుతున్నారు. కానీ ఈ రోజు పిచ్ బౌలర్లకు కూడా సహకరించింది. అప్పుడు మాత్రమే నిజమైన క్రికెట్ కనిపిస్తుంది” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మరోవైపు KKR హీరోగా నిలిచాడు వెస్టిండీస్ స్టార్ Rovman Powell. మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా… పవెల్ మాత్రం చల్లగా 40 పరుగులు చేసి మ్యాచ్ ను ముగించాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ… “ఈ పిచ్ నాకు కరీబియన్ వికెట్లా అనిపించింది. బాల్ బ్యాట్‌పై సులభంగా రాలేదు. కొంచెం ఆగి వస్తోంది. అలాంటి పిచ్‌లపై ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు” అని చెప్పాడు.
అంతేకాదు… చిన్న బౌండరీ వైపు టార్గెట్ చేయాలనే ప్లాన్‌తోనే బ్యాటింగ్ చేసినట్టు పవెల్ వెల్లడించాడు. అదే స్ట్రాటజీ KKR కి భారీగా ఉపయోగపడింది. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా పవెల్ ఆత్మవిశ్వాసంగా ఆడి మ్యాచ్ ను KKR వైపు తిప్పేశాడు.
ఇప్పుడు KKR దృష్టి చివరి లీగ్ మ్యాచ్‌పైనే ఉంది. “క్వాలిఫై అవుతామా లేదా అన్నది తర్వాత విషయము. ముందుగా చివరి మ్యాచ్‌లో భయపడకుండా మంచి క్రికెట్ ఆడాలి” అంటూ పవెల్ చెప్పిన మాటలు ఇప్పుడు KKR అభిమానుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి…
ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ అభిమానులు మాత్రం ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు…
“ఇంత స్టార్ ప్లేయర్లు ఉన్న జట్టు ఇలా ఎలా కుప్పకూలింది?”
మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ సీజన్ లో M I వైఫల్యానికి అసలు కారణం ఎవరు? హార్దిక్ కెప్టెన్సీనా… లేక టీమ్ మొత్తం ఫెయిలైందా?


