Top 5 This Week

Related Posts

హార్దిక్ తర్వాత MI కెప్టెన్ బుమ్రానేనా..? ధర్మశాలలో అందరూ షాక్!

Hardik లేడు… సూర్యకుమార్ కూడా లేడు… అప్పుడు ముంబై ఇండియన్స్‌ను ఎవరు నడిపించారు తెలుసా? అదే జస్ప్రీత్ బుమ్రా! కానీ ఈసారి అతను కేవలం బౌలర్‌గా కాదు… కెప్టెన్‌గా మైదానంలో కనిపించాడు! ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ — ‘బుమ్రా భవిష్యత్ lo mumbai indians కెప్టేనా?’ చివరి వరకు చూసేయండి… ఎందుకంటే ఈ మ్యాచ్‌లో బుమ్రా చూపించిన లీడర్‌షిప్ అందరినీ ఆశ్చర్యపరిచింది!”

2013 లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసినప్పటి నుంచి, జస్ప్రీత్ బుమ్రా జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. ఎన్నో కీలక మ్యాచ్‌లలో ఒంటిచేత్తో M I కి విజయాలు అందించాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ కోసం 157 మ్యాచ్‌లు ఆడి 186 వికెట్లు తీసుకున్న బుమ్రా… IPL చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన పేసర్లలో ఒకడిగా నిలిచాడు.

కానీ గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన IPL 2026 మ్యాచ్‌లో,అభిమానులు ఒక కొత్త బుమ్రాను చూశారు. ఈసారి చేతిలో బంతి మాత్రమే కాదు… జట్టు బాధ్యత కూడా ఉంది! రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో, స్టాండ్-ఇన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అందుబాటులో లేకపోవడంతో… ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ బుమ్రాపై నమ్మకం ఉంచింది.

అదే నమ్మకాన్ని బుమ్రా స్టైలిష్‌గా నిలబెట్టాడు! కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లోనే పంజాబ్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో ముంబైకి ఘన విజయం అందించాడు. ప్లేఆఫ్స్ రేస్ నుంచి ఇప్పటికే బయటపడిన ముంబై… కనీసం గౌరవప్రదంగా సీజన్ ముగించాలని చూస్తోంది. అలాంటి సమయంలో బుమ్రా కెప్టెన్సీ అభిమానుల్లో కొత్త ఆశలు రేపింది.

ఇది బుమ్రాకు కెప్టెన్‌గా మొదటి అనుభవం కాదు. ఇప్పటికే భారత జట్టును టెస్టుల్లో, T twenty ల్లో నడిపించాడు. 2024/25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాలో భారత్‌కు నాయకత్వం వహించిన బుమ్రా… 2022 లో ఇంగ్లాండ్‌పై బర్మింగ్‌హామ్ టెస్టులో కూడా కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాదు, రెండు T twenty ల్లో భారత జట్టును నడిపి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు అందించాడు.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన బుమ్రా తనదైన స్టైల్‌లో ఫన్నీ కామెంట్ చేశాడు.
“టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాను… T twenty ల్లో కూడా చేశాను… ఇప్పుడు మిగిలింది O D I మాత్రమే. కానీ అది జరిగేలా కనిపించడం లేదు,” అంటూ నవ్వులు పూయించాడు. అదే సమయంలో ధర్మశాల వాతావరణం గ్రౌండ్, జట్టు ప్రదర్శన అన్నీ తాను బాగా ఎంజాయ్ చేశానని చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ మరోసారి తన క్లాస్ చూపించాడు. ఒత్తిడిలో అద్భుత హాఫ్ సెంచరీతో ముంబై విజయానికి పునాది వేశాడు. ఇటీవల వరుసగా కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న తిలక్… భవిష్యత్తులో భారత జట్టుకు మిడిల్ ఆర్డర్ స్టార్‌గా, ఎదుగుతున్నాడనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. మరోవైపు ర్యాన్ రికెల్టన్ కూడా ఎక్స్‌ప్లోసివ్ బ్యాటింగ్‌తో మ్యాచ్ మోమెంటమ్‌ను పూర్తిగా మార్చేశాడు.

బౌలింగ్ విషయానికి వస్తే… బుమ్రా తన ప్లాన్‌ను స్పష్టంగా అమలు చేశాడు. పిచ్ గత మ్యాచ్‌తో పోలిస్తే కాస్త డ్రైగా ఉందని, లెంగ్త్‌ను కంట్రోల్ చేయడమే కీలకమని చెప్పాడు. ముఖ్యంగా షార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. “తిలక్ ఇన్నింగ్స్ ఎంత ముఖ్యమో… షార్దూల్ బౌలింగ్ కూడా అంతే ముఖ్యమైంది” అంటూ జట్టును అభినందించాడు.

అయితే వ్యక్తిగతంగా చూస్తే బుమ్రాకు IPL 2026 అంత సులభంగా సాగడం లేదు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో కేవలం 3 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు, 8 point 53 ఎకానమీ రేట్‌తో కాస్త ఒత్తిడిలోనే ఉన్నాడు. కానీ ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా చూపించిన కూల్‌నెస్, ఫీల్డ్ సెట్టింగ్స్, బౌలర్లను హ్యాండిల్ చేసిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే ప్రశ్న వైరల్ అవుతోంది — “భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ ఫుల్ టైమ్ కెప్టెన్ బుమ్రానేనా?”
ఎందుకంటే రోహిత్ తర్వాత హార్దిక్ కెప్టెన్సీపై ఇప్పటికే చాలాసార్లు విమర్శలు వచ్చాయి. తాజాగా బుమ్రా ప్రశాంతంగా జట్టును నడిపించిన తీరు చూసి M I అభిమానులు కొత్త డిమాండ్ మొదలుపెట్టేశారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles