Top 5 This Week

Related Posts

జాన్‌ క్యాంప్‌బెల్ దూకుడు.. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ | 2nd ODI IND vs WI

వెస్టిండీస్‌ ఓపెనర్ జాకబ్ క్యాంప్‌బెల్ (52*) దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రసిద్ధ్ వేసిన ఏడో ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. ఇందులో సిక్స్‌ సహా మూడు ఫోర్ల ఉన్నాయి. ప్రస్తుతం వెస్టిండీస్ స్కోరు 8 ఓవర్లకు 78/1. క్రీజ్‌లో క్యాంప్‌బెల్‌తోపాటు షై హోప్ (11*) ఉన్నాడు. వెస్టిండీస్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. భారత ఆటగాడు నమన్ ధిర్ అద్భుతమైన క్యాచ్‌ అందుకొన్నాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన ఐదో ఓవర్‌ చివరి బంతిని కీసీ కార్టీ (9) ఆడాడు.

కవర్ పాయింట్ దిశగా వెళ్తున్న ఆ బంతిని నమన్ ధిర్ ముందుకు దూకుతూ పట్టుకున్నాడు. అయితే, ఫీల్డ్ అంపైర్ కాస్త అనుమానం వ్యక్తం చేస్తూ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్ చేశాడు. సమీక్షలో ఔట్‌గా తేలడంతో కార్టీ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం విండీస్ స్కోరు 6 ఓవర్లకు 48/1. మరో ఓపెనర్ కాంప్‌బెల్ (23*) కాస్త దూకుడుగా ఆడాడు. క్రీజ్‌లో అతడితోపాటు షై హోపం (10*) ఉన్నాడు. టీమ్‌ఇండియా, వెస్టిండీస్‌ల మధ్య రెండో వన్డే గువాహటి వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శుభ్‌మన్‌ సేన.. బౌలింగ్‌ ఎంచుకుంది.

తొలి వన్డేలో ఘన విజయంతో జోరు మీదున్న భారత్‌.. ఇందులోనూ గెలిచి మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. తొలి మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయిన నితీశ్‌ కుమార్‌రెడ్డి స్థానంలో జట్టులోకి ఆకిబ్‌ నబీ వచ్చాడు. ఈ మ్యాచ్‌తో అతడు వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు విండీస్‌ తన జట్టులో నాలుగు మార్పులు చేసింది.

భారత్‌:రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, రుతురాజ్‌ గైక్వాడ్‌, కేఎల్‌ రాహుల్‌, నమన్‌ ధీర్‌, రవీంద్ర జడేజా, ఆకిబ్‌ నబీ, గుర్నూర్‌ బ్రార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ప్రసిధ్‌ కృష్ణ

విండీస్‌: జాన్‌ క్యాంప్‌బెల్‌, కీస్‌ కార్టీ, షై హోప్‌, అమీర్‌ జంగూ, రూథర్‌ఫర్డ్‌, రోస్టన్‌ చేజ్‌, కీమో పాల్‌, అల్జారీ జోసెఫ్‌, షమార్‌ జోసెఫ్‌, జెడెన్‌ సీల్స్‌, విటెల్‌ లాస్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles