Top 5 This Week

Related Posts

అంతా అయిపోయింది” అన్న రసిఖ్… ఇప్పుడు అందరూ ఎందుకు ప్రశంసిస్తున్నారు?

ఒక్క తప్పు… ఆ తర్వాత జీవితాన్ని మార్చేసిన ఒక ఘటన… నాలుగు సంవత్సరాల పాటు క్రికెట్‌కు దూరం. కానీ అదే ఆటగాడు ఇప్పుడు IPL ట్రోఫీ గెలిచిన జట్టులో హీరోగా నిలిచాడు! అసలు రసిఖ్ సలాం దార్ జీవితంలో ఏమి జరిగింది? ఎందుకు అతను క్రికెట్‌ను పూర్తిగా కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాడు? kashmir లోని చిన్న గ్రామం నుంచి IPL ఛాంపియన్‌గా ఎలా ఎదిగాడు? ఈ కథ వింటే మీకు కూడా గూస్‌బంప్స్ రావడం ఖాయం! ఏడు సంవత్సరాల క్రితం, ఇదే సమయంలో, చండీగఢ్‌లో చదువుకుంటున్న నదీమ్ దార్‌ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి అతని కజిన్ రసిఖ్ సలాం దార్. చిన్నప్పటి నుంచి రసిఖ్‌కు క్రికెట్ నేర్పింది కూడా నదీమే. కానీ ఆ రోజు రసిఖ్ గొంతులో ఆనందం లేదు. ఆశ లేదు. కేవలం బాధ మాత్రమే ఉంది. “అన్నా. అంతా అయిపోయింది” అని చెప్పగానే అతను ఏడవడం ప్రారంభించాడు. అసలు ఏమైందో అడిగేలోపే రసిఖ్ పూర్తిగా కుంగిపోయాడు.

2019 లో బీసీసీఐకి ఇచ్చిన ఒక సర్టిఫికేట్ విషయంలో, సమస్య రావడంతో రసిఖ్‌పై రెండేళ్ల నిషేధం పడింది. ఆ కారణంగా అతను అండర్ 19 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. అంతేకాదు,అంతేకాదు,Jammu and Kashmir క్రికెట్‌లో కూడా అతని భవిష్యత్తుపై అనేక సందేహాలు మొదలయ్యాయి. ఒక్కసారిగా క్రికెట్‌లో కూడా అతని భవిష్యత్తుపై అనేక సందేహాలు మొదలయ్యాయి. ఒక్కసారిగా అతని కలలు అన్నీ ఆగిపోయినట్టే అనిపించింది.అయితే ఆ ఘటనకు ముందు రసిఖ్ ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. మూడు సార్లు అండర్ 19 ట్రయల్స్‌లో ఎంపిక కాకపోయినా అతను ఎప్పుడూ ప్రయత్నం ఆపలేదు. తర్వాత jammu and kashmir జట్టుకు మెంటర్‌గా వచ్చిన ఇర్ఫాన్ పఠాన్ అతని ప్రతిభను గుర్తించాడు. కేవలం ఆరు నెలల్లోనే అండర్ 19, అండర్ 23, Ranji Trophy, ఐపీఎల్ వరకు చేరుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన నిషేధం అతని జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది.

kashmir లోని కుల్గామ్ జిల్లాలో ఉన్న ఖండిపోరా అనే చిన్న గ్రామంలో రసిఖ్ పెరిగాడు. అక్కడే అతని క్రికెట్ ప్రయాణం ప్రారంభమైంది. మొదట టెన్నిస్ బాల్‌తో ఆడుతూ బౌలింగ్‌లో ఎన్నో వేరియేషన్స్ నేర్చుకున్నాడు. 13 ఏళ్ల వయసులో నదీమ్ అతన్ని ఒక లోకల్ క్లబ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తొలిసారి లెదర్ బాల్‌తో బౌలింగ్ చేశాడు. కొద్ది వారాల్లోనే అతని స్వింగ్ బౌలింగ్ గురించి అందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు.ఈరోజు అందరూ ప్రశంసిస్తున్న “back of the hand” స్లో బాల్‌ను రసిఖ్ కేవలం 14 ఏళ్ల వయసులోనే నేర్చుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌కు అతని స్లోవర్ బంతులు అర్థం కావడం చాలా కష్టం. గత కొన్ని సీజన్ల లో Bhuvneshwar Kumar తో కలిసి పనిచేస్తూ నకిల్ బాల్‌ను కూడా తన ఆయుధాల్లో చేర్చుకున్నాడు. కొత్త విషయాలు చాలా వేగంగా నేర్చుకోవడం రసిఖ్ ప్రత్యేకత.

రెండేళ్ల నిషేధం ముగిసిన తర్వాత రసిఖ్ ముంబైకి వెళ్లాడు. కానీ అక్కడ మరో దెబ్బ తగిలింది. లోయర్ బ్యాక్ స్ట్రెస్ ఇంజరీ కారణంగా మరింత కాలం ఆటకు దూరమయ్యాడు. మొత్తం నాలుగు సంవత్సరాల పాటు అతను ఒక్క పోటీ మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. మొదట నిషేధం… తర్వాత గాయం… అయినా అతను ఆశను వదల్లేదు. “క్రికెట్ మానేస్తాను” అనే మాట ఒక్కసారి కూడా చెప్పలేదు.రసిఖ్ చిన్ననాటి స్నేహితుడు మీర్ ముర్తాజా చెప్పిన మాటలు అతని మానసిక బలాన్ని తెలియజేస్తాయి. బయటకు చాలా నిశ్శబ్దంగా కనిపించే రసిఖ్ లోపల మాత్రం ఉక్కు మనిషి. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడు. సాధారణ జీవితాన్నే ఇష్టపడతాడు. కానీ అతని మనసులో మాత్రం ఒకే కల ఉండేది… ఒకరోజు భారత జట్టు తరఫు న ఆడాలి!

ఆ కలను నిజం చేసే దిశగా 2025 ఐపీఎల్ వేలంలో పెద్ద మలుపు వచ్చింది. చాలామందిని ఆశ్చర్యపరుస్తూ Royal Challengers Bengaluru రసిఖ్‌ను 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అప్పటివరకు అతను ఐపీఎల్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అందుకే చాలామంది ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు.కానీ రసిఖ్ మాత్రం విమర్శలను పట్టించుకోలేదు. తన ఆటను మెరుగుపరచడంపైనే దృష్టి పెట్టాడు. ముఖ్యంగా Josh Hazlewood మరియు భువనేశ్వర్ కుమార్‌లను దగ్గరగా గమనించాడు. వారి అనుభవం నుంచి ఎంతో నేర్చుకున్నాడు. ప్రతిరోజూ కష్టపడి బౌలింగ్ చేస్తూనే ఉన్నాడు.

ఆ కష్టం ఫలితాన్ని ఇచ్చింది. ఐపీఎల్ 2025 సీజన్‌ లో రసిఖ్ 19 వికెట్లు సాధించాడు. మధ్య ఓవర్లలో కీలక Breakthroughs ఇస్తూ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు.”ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు.”అదే మ్యాచ్‌లో అతను జట్టులో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.జట్టు కెప్టెన్ Rajat Patidar కూడా రసిఖ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. “ఒక జట్టు కేవలం ఒకరు లేదా ఇద్దరు బౌలర్లతో ట్రోఫీలు గెలవలేదు. రసిఖ్ ఇచ్చిన Breakthroughs చాలా కీలకం. అతనికి తన పాత్రపై స్పష్టత ఉంది. ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడు” అని చెప్పాడు.

ఇటీవల కాలంలో భారత జట్టు, టీ twenty క్రికెట్‌లో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తోంది. ఇలాంటి సమయంలో రసిఖ్ వంటి, మిడిల్ ఓవర్ వికెట్, టేకర్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడం సహజమే. అతను ఇదే ఆటతీరు కొనసాగిస్తే త్వరలోనే భారత జట్టులో చోటు సంపాదించవచ్చు. అయితే ట్రోఫీ గెలిచిన తర్వాత రసిఖ్ చెప్పిన మాటలు ప్రతి క్రికెట్ అభిమానిని కదిలించాయి. “నా చేతిలో బంతి ఉన్నప్పుడు నేను ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉంటాను. ఇప్పుడు ఇంటికి వెళ్లి నా తల్లిదండ్రులను కలవాలి. ఈ ట్రోఫీని నా తండ్రికి అంకితం చేస్తున్నాను. నేను క్రికెట్ ఆడుతున్నానని ఎప్పుడూ సమయం వృథా చేస్తున్నావని ఆయన అనలేదు. మంచి రోజుల్లోనూ, చెడు రోజుల్లోనూ నాకు అండగా నిలిచారు” అని భావోద్వేగంతో చెప్పాడు.

ఒకప్పుడు “అంతా అయిపోయింది” అని ఏడ్చిన యువకుడు… ఈరోజు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచాడు. నిషేధం, గాయాలు, విమర్శలు, నిరాశలు… ఇవన్నీ అతన్ని ఆపలేకపోయాయి. ఎందుకంటే రసిఖ్ సలాం దార్ కథలో ఒక గొప్ప పాఠం ఉంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, కలను వదలకుండా కష్టపడితే విజయం తప్పకుండా వస్తుంది. kashmir లోని చిన్న గ్రామం ఖండిపోరా నుంచి బయలుదేరిన ఈ సింహం… ఇప్పుడు భారత జట్టు తలుపు తడుతోంది. మరి త్వరలోనే టీమ్ ఇండియా జెర్సీలో రసిఖ్‌ను చూడబోతున్నామా? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తప్పకుండా చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles