క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓ డీ ఐ World Cup 2027పై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది! 2023 వరల్డ్ కప్‌లో సొంత గడ్డపై ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దూసుకెళ్లిన టీమ్ ఇండియా… చివర్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో టైటిల్‌కు దూరమైంది. దీంతో 2027 వరల్డ్ కప్‌లో ఎలాగైనా బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు. అయితే… అసలు 2027 వరల్డ్ కప్ ఎప్పుడు మొదలవుతుంది? షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది? టికెట్లు ఎప్పుడు దొరుకుతాయి? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికింది!
తాజా సమాచారం ప్రకారం… 2027 ఓ డీ ఐ వరల్డ్ కప్ అక్టోబర్ 1న ప్రారంభమై, నవంబర్ 19న ముగిసే అవకాశం ఉంది. ఈ వరల్డ్ కప్‌కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా కలిసి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఇక అక్టోబర్ 1న కేప్‌టౌన్‌లో I C C, Cricket South Africa కలిసి వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు సమాచారం. అంతేకాదు… అదే రోజు అభిమానులకు మరో ముఖ్యమైన అవకాశం కూడా రాబోతోంది! వరల్డ్ కప్ టికెట్ల కోసం బ్యాలెట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. అంటే వెంటనే టికెట్లు అమ్మరు.
ముందుగా అక్టోబర్ 1 నుంచి అభిమానులు టికెట్ బ్యాలెట్ కోసం తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొనబోతున్నాయి. సెప్టెంబర్ 30 నాటికి 10 జట్లు ఖరారు కానున్నాయి. ఆతిథ్య జట్లుగా సౌతాఫ్రికా, జింబాబ్వే ఇప్పటికే తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి. మిగిలిన జట్లలో కొన్ని I C C, ఓ డీ ఐ ర్యాంకింగ్స్ ఆధారంగా నేరుగా అర్హత సాధించనున్నాయి. ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ ర్యాంకింగ్స్ ద్వారా వరల్డ్ కప్‌కు అర్హత సాధించే స్థితిలో ఉన్నాయి.
బంగ్లాదేశ్ ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నప్పటికీ… సౌతాఫ్రికా ఇప్పటికే హోస్ట్‌గా అర్హత సాధించడంతో బంగ్లాదేశ్‌కు కూడా అవకాశం దక్కనుంది. మరోవైపు… వెస్టిండీస్ మాత్రం క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ద్వారా వరల్డ్ కప్‌లో చోటు సంపాదించాలి. ఈ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది. మరి 2027 వరల్డ్ కప్‌లో భారత్ ఈసారి టైటిల్ గెలుస్తుందా? షెడ్యూల్‌లో ఏ జట్టుతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుందో తెలుసుకోవడానికి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది!


