భారత్‌తో రెండో టెస్ట్‌లో శ్రీలంక స్టార్ బౌలర్ ప్రభాత్ జయసూర్యకు ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్‌లో జరిగిన ఒక ఎమోషనల్ ఘటన కారణంగా ఐసీసీ ఇప్పుడు అతనిపై అధికారిక చర్యలు తీసుకుంది. అసలు జయసూర్య ఏం చేశాడు? ఐసీసీ ఎందుకు చర్యలు తీసుకుంది? కొలంబోలో భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో రెండో రోజు, ఆట ముగిసే సమయం శ్రీలంకకు చాలా నిరాశను మిగిల్చింది. ముఖ్యంగా ప్రభాత్ జయసూర్యకు జరిగిన ఘటన మరింత బాధ కలిగించింది.
ఆ రోజు చివరి బంతికి జయసూర్య ఔటయ్యాడు. అయితే అంతకుముందే లైట్ సరిగా లేదంటూ శ్రీలంక ఆటగాళ్లు అంపైర్లతో మాట్లాడారు. జయసూర్య కూడా లైట్ పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కానీ చివరి బంతికి జయసూర్య వికెట్ కోల్పోవడంతో అతని కోపం మరింత పెరిగింది. పెవిలియన్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో అతను పదేపదే వెనక్కి తిరిగి అంపైర్ల వైపు చూస్తూ కనిపించాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న తర్వాత కూడా అతని కోపం తగ్గలేదు.
అక్కడ తన గ్లౌజ్‌లను తీసి విసిరేశాడు. ఈ ఘటనపై కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా స్పందించాడు. జయసూర్యకు చాలా కోపం వచ్చిందని, అతని చెవుల నుంచి ఆవిరి వస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పుడు ఈ ఘటనకు ఐసీసీ అధికారిక చర్య తీసుకుంది. రెండో రోజు జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రభాత్ జయసూర్యకు, ఐసీసీ లెవల్ వన్ ఉల్లంఘన కింద అధికారికంగా మందలింపు ఇచ్చింది. జయసూర్య ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినట్లు తేలింది.
ఈ నిబంధన అంతర్జాతీయ మ్యాచ్‌లో క్రికెట్ పరికరాలు, ఆటగాడి దుస్తులు లేదా గ్రౌండ్‌లోని పరికరాలను దుర్వినియోగం చేయడానికి సంబంధించినది. జయసూర్య చేసిన పని కూడా ఇదే నిబంధన కిందకు వచ్చింది. చివరి బంతికి ఔటైన తర్వాత పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో అతను బౌండరీ దగ్గర ఉన్న కుషన్లను తన బ్యాట్‌తో కొట్టాడు. ఈ ఘటనను అంపైర్లు గమనించి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఫీల్డ్ అంపైర్లు అహ్సన్ రజా, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్‌తో పాటు, థర్డ్ అంపైర్ రాడ్ టక్కర్, ఫోర్త్ అంపైర్ ప్రగీత్ రాంబుక్వెల్ల కూడా ఈ ఛార్జ్‌లో భాగమయ్యారు. అయితే జయసూర్య తన తప్పును అంగీకరించాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్, రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సూచించిన శిక్షను కూడా అతను అంగీకరించాడు. దీంతో ఈ విషయంపై ప్రత్యేకంగా ఫార్మల్ హియరింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదు. ఇక జయసూర్యకు అధికారిక మందలింపుతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు.
గత 24 నెలల్లో అతనికి ఇదే మొదటి తప్పిదం కావడం గమనార్హం. ఐసీసీ నిబంధనల ప్రకారం లెవల్ వన్ ఉల్లంఘనలకు కనీసంగా అధికారిక మందలింపు ఉంటుంది. గరిష్ఠంగా ఆటగాడి మ్యాచ్ ఫీజులో 50 శాతం వరకు జరిమానా విధించవచ్చు. అలాగే ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు కూడా ఇవ్వొచ్చు. మొత్తానికి లైట్ విషయంలో అసంతృప్తి, ఆ తర్వాత చివరి బంతికి ఔట్ కావడం, కోపంతో పరికరాలను కొట్టడం.. ఈ మొత్తం ఘటన ప్రభాత్ జయసూర్యకు ఐసీసీ చర్యకు కారణమైంది.
ఇప్పుడు ఈ ఘటనతో అతని డిసిప్లినరీ రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేరింది. “ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!”


