వెస్టిండీస్తో మూడో వన్డేలో రోహిత్ శర్మ 92 పరుగుల వద్ద ఔటై కాస్తలో సెంచరీ చేజార్చుకున్నాడు. రోహిత్ మూడంకెల స్కోరును అందుకోకపోవడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ నిరుత్సాహానికి గురయ్యారు. ఇలా సెంచరీ చేసే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోవద్దని సూచించారు. ఈ క్రమంలో ఓ టార్గెట్ను రోహిత్ ముందు ఉంచారు.
“రోహిత్ శర్మ 92 పరుగుల వద్ద ఔట్ అయినప్పుడు నేను నిరాశ చెందా. అందుకు రెండు కారణాలు.. ఒకటి, అతడు సెంచరీ మిస్ చేసుకోవడం. ఇక రెండోది.. 2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉండటం. ఇప్పుడు ఇది ఎందుకంటే.. అతడు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకొనే నాటికి కనీసం అతడి వయసు కంటే ఎక్కువ శతకాలు ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు విండీస్పై మరో సెంచరీ చేసి ఉంటే ఆ లక్ష్యానికి కాస్త చేరువగా వచ్చేవాడు. ఎవరైనా ప్లేయర్ తన వయసు కంటే ఎక్కువ శతకాలు చేస్తే ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది” అని గావస్కర్ తెలిపారు. ప్రస్తుతం Rohit Sharma ఖాతాలో 35 సెంచరీలు ఉన్నాయి. వచ్చే వన్డే ప్రపంచ కప్ నాటికి అతడి వయసు 40 ఏళ్లకు చేరుతుంది.
“నా అంతర్జాతీయ కెరీర్ చివరి దశలో నేను కూడా మరిన్ని టెస్టు సెంచరీలు చేయాలని అనుకున్నా. నేను రిటైర్మెంట్ తీసుకొనే సమయానికి ఆ శతకాల సంఖ్య ఎక్కువగా ఉండాలని భావించా. మూడుసార్లు నేను 90ల్లోనే పెవిలియన్కు చేరా. ఒకవేళ అవి చేసి ఉంటే.. నా రిటైర్మెంట్ ఏజ్ 38కి సమంగా నిలిచేవి. కానీ, అలా సాధ్యపడలేదు. అందుకే, రోహిత్ శర్మ విషయంలో జరగాలని కోరుకుంటున్నా. గత వరల్డ్ కప్ పోలిస్తే ప్రస్తుతం రోహిత్ బ్యాటింగ్ శైలిలో మార్పు వచ్చింది. అప్పుడు తొలి బంతి నుంచే బాదేద్దామని భావించేవాడు. కానీ, ఇప్పుడు తన వికెట్ విలువ తెలుసుకున్నాడు. 2023 ప్రపంచ కప్ లో మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచలేదు. ఇప్పుడు మాత్రం నిలకడగా భారీగా పరుగులు చేయడం సంతోషంగా ఉంది. 70-80 బంతుల్లోనే సెంచరీ చేస్తే అది జట్టుకు ఎంతో ఉపయోగం. ఇక సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు అతడిని ఏమీ చేయలేవనేది నా ఉద్దేశం” అని Sunil Gavaskar వ్యాఖ్యానించారు. గావస్కర్ 38 ఏళ్ల వయసులో ఆటకు గుడ్బై చెప్పారు. ఆయన టెస్టుల్లో 34, వన్డేల్లో ఒక సెంచరీ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, క్రికెట్ లవర్స్ అందరికీ షేర్ చేయండి.


