Top 5 This Week

Related Posts

22 DRS రివ్యూలు.. ఒక్కటీ సక్సెస్ కాలేదు! జడేజా DRS నైట్‌మేర్ ఇంకా ముగియలేదా?

రవీంద్ర జడేజా… టెస్ట్ క్రికెట్‌లో ఒక అద్భుతమైన బౌలర్. ఎన్నో రికార్డులు సాధించిన ఈ స్టార్ ఆల్‌రౌండర్‌కు ఇప్పుడు D R S మాత్రం పెద్ద సమస్యగా మారింది. జడేజా తీసుకుంటున్న రివ్యూలు వరుసగా విఫలమవుతున్నాయి. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో మూడో రోజు కూడా ఇదే జరిగింది. కేశర నువంతను ఎల్బీడబ్ల్యూ చేయడానికి జడేజా బలంగా అప్పీల్ చేశాడు. అంపైర్ మాత్రం నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో కెప్టెన్‌ను ఒప్పించి జడేజా రివ్యూ తీసుకున్నాడు. కానీ రీప్లేలో అసలు విషయము బయటపడింది.

బంతి బ్యాట్‌కు తగిలిన తర్వాత ప్యాడ్‌కు వెళ్లినట్టు కనిపించింది. అంటే అక్కడ ఎల్బీడబ్ల్యూ అవకాశం లేదని తేలింది. దీంతో జడేజా తీసుకున్న రివ్యూ మరోసారి విఫలమైంది. ఈ ఒక్క రివ్యూతో జడేజా వరుసగా విఫలమైన D R S రివ్యూల సంఖ్య ఏకంగా 22కి చేరింది. అంటే గత 22 సార్లు బౌలర్‌గా జడేజా రివ్యూ తీసుకున్నా ఒక్కసారి కూడా అంపైర్ నిర్ణయం మారలేదు. జడేజా బౌలర్‌గా చివరిసారిగా విజయవంతమైన రివ్యూ 2023 జూలైలో వచ్చింది. వెస్టిండీస్‌తో డొమినికాలో జరిగిన టెస్ట్‌లో కెమార్ రోచ్ విషయంలో జడేజా రివ్యూ తీసుకున్నాడు.

అంపైర్ నాటౌట్‌గా ఇచ్చిన నిర్ణయాన్ని రివ్యూ ద్వారా మార్చగలిగాడు. కానీ అప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరుసగా 22 రివ్యూలు తీసుకున్నా ఒక్కటి కూడా జడేజాకు అనుకూలంగా మారలేదు. ఇందులో నాలుగు రివ్యూలు అంపైర్స్ కాల్‌తో ముగిశాయి. మిగిలిన 18 రివ్యూల్లో భారత్ నేరుగా రివ్యూను కోల్పోయింది. అయితే D R S విషయంలో జడేజాకు ఇలాంటి చెడు రికార్డు ఉన్నప్పటికీ, టెస్ట్ క్రికెట్‌లో అతని బౌలింగ్ రికార్డు మాత్రం అద్భుతంగా ఉంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో జడేజా ఒక భారీ ఘనత సాధించాడు.

టెస్ట్ క్రికెట్‌లో 350 వికెట్లు తీసుకున్న తొలి భారత లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా జడేజా నిలిచాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో జహీర్ ఖాన్ 311 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు, టెస్ట్ క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా కూడా జడేజా నిలిచాడు. జడేజా కంటే ముందు అనిల్ కుంబ్లే 619 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 537 వికెట్లు, కపిల్ దేవ్ 434 వికెట్లు, హర్భజన్ సింగ్ 417 వికెట్లు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 350 టెస్ట్ వికెట్లు సాధించిన మూడో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా కూడా జడేజా నిలిచాడు.

శ్రీలంకకు చెందిన రంగనా హెరాత్ 433 వికెట్లతో, డేనియల్ వెట్టోరి 362 వికెట్లతో ఈ జాబితాలో ఉన్నారు. ఇక్కడితో జడేజా రికార్డులు ఆగలేదు. టెస్ట్ క్రికెట్‌లో 4000కి పైగా పరుగులు, 350కి పైగా వికెట్లు సాధించిన నాలుగో ఆటగాడిగా కూడా జడేజా నిలిచాడు. జడేజా కంటే ముందు కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డేనియల్ వెట్టోరి మాత్రమే ఈ అరుదైన ఘనత సాధించారు. అంటే ఒకవైపు జడేజా టెస్ట్ క్రికెట్‌లో వరుస రికార్డులు సృష్టిస్తున్నాడు. మరోవైపు D R S విషయంలో మాత్రం వరుసగా 22 రివ్యూలు విఫలమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరి జడేజా D R S నైట్‌మేర్‌కు ఎప్పుడు ముగింపు పడుతుంది? మరోసారి రివ్యూ తీసుకుని సక్సెస్ అవుతాడా? “ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!”
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles