Top 5 This Week

Related Posts

జైస్వాల్ వివాదంలో వైభవ్ సూర్యవంశిని లాగిన సంజయ్ మంజ్రేకర్.. సంచలన వ్యాఖ్యలు!

టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ అసిత ఫెర్నాండో మధ్య జరిగిన వివాదం ఇప్పుడు మరో కొత్త చర్చకు దారితీసింది. ఈ ఘటనపై మాజీ భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ.. ఆటగాళ్లకు మరింత కఠినమైన శిక్షలు ఉండాలని సూచించాడు. కొలంబోలో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు జైస్వాల్, ఫెర్నాండో మధ్య మైదానంలో మాటల యుద్ధం జరిగింది. ఫెర్నాండో బౌలింగ్‌లో జైస్వాల్ ఔట్ అయిన తర్వాత.. జైస్వాల్ అతని దగ్గరకు వెళ్లి మాట్లాడాడు.

ఇద్దరి మధ్య మాటలు పెరగడంతో పరిస్థితి కాస్త టెన్షన్‌గా మారింది. ఒక దశలో ఫెర్నాండో తన తలను జైస్వాల్ వైపు తీసుకురాగా.. జైస్వాల్ కూడా ముందుకు రావడంతో ఇద్దరి తలలు తగిలాయి. ఈ ఘటనపై ICC చర్యలు తీసుకుంది. జైస్వాల్, ఫెర్నాండో ఇద్దరికీ వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. అలాగే ఇద్దరి ఖాతాల్లో చెరో డీమెరిట్ పాయింట్ కూడా చేరింది. అయితే ఈ శిక్ష సరిపోదని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. మంజ్రేకర్ తన X ఖాతాలో ICC, BCCI ని ట్యాగ్ చేస్తూ..

ఇలాంటి ప్రవర్తనకు ఆటగాళ్లు తప్పించుకునే అవకాశం ఇస్తే, భవిష్యత్తులో అదే ప్రవర్తనను మళ్లీ చేసేలా వారిని ప్రోత్సహించినట్టవుతుందని చెప్పాడు. ఇక్కడే మంజ్రేకర్ మరో యువ ఆటగాడి పేరును ప్రస్తావించాడు. ఆ ఆటగాడు వైభవ్ సూర్యవంశి. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియా ఏ తరఫున ఆడుతున్న సమయంలో.. వైభవ్ సూర్యవంశి కూడా శ్రీలంక ఏ ఆటగాళ్లతో జరిగిన ఒక ఘటనలో దాదాపు గొడవకు వెళ్లిన విషయాన్ని మంజ్రేకర్ గుర్తు చేశాడు. అందుకే ICC, BCCI ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని మంజ్రేకర్ సూచించాడు. ఆయన చెప్పిన అసలు విషయము ఏమిటంటే..

ఆటలో పోటీ ఎంత ఉన్నా శారీరకంగా ఒకరినొకరు తాకే పరిస్థితి మాత్రం రాకూడదని. ఇలాంటి ఘటనలు ఆటకు మాత్రమే కాదు.. యువ ఆటగాళ్ల భవిష్యత్తుకు కూడా మంచిది కాదని మంజ్రేకర్ హెచ్చరించాడు. ఇక జైస్వాల్ మాత్రం తన చర్యను సమర్థించుకున్నాడు. రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు మాట్లాడుతూ.. అవతలి వ్యక్తి ఏం మాట్లాడాడో తెలియకుండా ఎవరూ తనను జడ్జ్ చేయకూడదని అన్నాడు. అలాగే ఎవరైనా హద్దు దాటితే..

తాము కూడా స్పందించాల్సిందేనని, “ఇది ఇండియా.. మేము పోరాడతాం, సమాధానం ఇస్తాం” అనే విధంగా జైస్వాల్ స్పష్టం చేశాడు. మరి జైస్వాల్, ఫెర్నాండో వివాదంపై మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? యువ ఆటగాళ్ల విషయంలో మరింత కఠినమైన చర్యలు అవసరమా? “ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!”
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles