spot_imgspot_img

Top 5 This Week

spot_img

Related Posts

ధోని CSK టీమ్‌తో Lucknowకి..? Must-Win మ్యాచ్ ముందు భారీ హైప్…

“ధోని… లక్నోకి వెళ్తున్నాడా?
CSK అభిమానుల గుండెల్లో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న!
ఈ సీజన్ మొత్తం మైదానానికి దూరంగా ఉన్న థలా… ప్లేఆఫ్స్ ముందు అకస్మాత్తుగా టీమ్‌తో ,ట్రావెల్ చేయబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో భూకంపం సృష్టిస్తోంది!
అసలు ధోని రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడా? లేక ఇది కేవలం అభిమానుల ఆశలేనా? IPL 2026 లో ఇప్పుడు చెన్నై క్యాంప్ చుట్టూ జరుగుతున్న డ్రామా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది!”

IPL 2026 సీజన్ మొదట్లో వరుసగా, మూడు ఓటములు ఎదుర్కొని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న Chennai Super Kings… ఇప్పుడు పూర్తిగా మారిపోయింది!
ఒక దశలో ప్లేఆఫ్స్ అవకాశాలు almost ముగిసిపోయాయని అందరూ అనుకున్న సమయంలో, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో CSK అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. చివరి 8 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించి ఇప్పుడు పాయింట్స్ టేబుల్‌లో టాప్-5లో నిలిచింది.

ఇటీవల జరిగిన మ్యాచుల్లో, CSK ఆట చూసిన వాళ్లందరికీ ఒక
విషయము క్లియర్‌గా అర్థమైంది… “ఈ టీమ్‌ని underestimate చేస్తే ప్రమాదం!”

ఈ రీసర్జెన్స్‌లో పెద్ద హీరోగా నిలిచాడు Sanju Samson.
ఈ సీజన్‌ లో ఇప్పటికే 304 పరుగులు, అందులో రెండు సెంచరీలు!
ప్రత్యేకంగా ఇటీవల ముంబైపై ఆడిన ఇన్నింగ్స్ తర్వాత సోషల్ మీడియాలో “సంజూ మోడ్ ఆన్” అంటూ ట్రెండ్ అయ్యాడు. ఒత్తిడి సమయంలో కూడా fearless బ్యాటింగ్‌తో CSK కి వరుస విజయాలు అందిస్తున్నాడు.

మరోవైపు కెప్టెన్ Ruturaj Gaikwad చాలా calm గా టీమ్‌ని నడిపిస్తున్నాడు. Head coach Stephen Fleming experience, రుతురాజ్ smart captaincy… రెండూ కలిసిపోవడంతో చెన్నై మళ్లీ పాత CSK లా కనిపిస్తోంది.

బౌలింగ్‌లో అయితే యువ పేసర్ Anshul Kamboj. ఈ సీజన్‌లో surprise package అయ్యాడు.
14 వికెట్లు తీసి టీమ్‌లో highest wicket-taker‌ గా నిలిచాడు. ఇటీవల పవర్‌ప్లేలో అతని aggressive spell వల్లే చెన్నై కీలక విజయాలు అందుకుంది. Experts కూడా ఇప్పుడు “భారత్‌కి next big pacer” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

కానీ… ఈ కథలో biggest twist ఇంకా మిగిలే ఉంది!

అదే… MS Dhoni పేరు.
కాల్ఫ్ injury కారణంగా మొత్తం IPL 2026 సీజన్‌ కు దూరంగా ఉన్న ధోని… ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. Home మ్యాచ్‌లకు కూడా చాలాసార్లు కనిపించలేదు.
కానీ ఇప్పుడు లక్నో మ్యాచ్ ముందు అతను, టీమ్‌తో కలిసి ట్రావెల్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు రావడంతో అభిమానుల్లో మళ్లీ పిచ్చి హైప్ మొదలైంది!

Cricbuzz రిపోర్ట్ ప్రకారం CSK CEO Kaasi Viswanathan… ధోని కోసం కూడా ఇండిగో flight ticket బుక్ చేసినట్టు సమాచారం. అయితే చివరి నిమిషంలో థలా decision మార్చే అవకాశం కూడా ఉందట. ఇదే suspense ని మరింత పెంచుతోంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో “One Last Dance for Thala” అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
కొంతమంది fans అయితే Lucknow స్టేడియం బయట భారీగా CSK జెర్సీలు వేసుకుని ధోని కోసం, ఎదురు చూస్తున్న వీడియోలు కూడా trend అవుతున్నాయి.

CSK ఇంకా ప్లేఆఫ్స్ రేసులో బలంగా ఉండటంతో… మిగిలిన ,మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక మ్యాచ్ అయినా ధోని ఆడే అవకాశం ఉందని insiders చెబుతున్నారు. అదే జరిగితే IPL 2026 లో biggest moment అవ్వడం ఖాయం!

ఇప్పుడు చెన్నై ముందున్న మ్యాచ్‌లు చాలా కీలకం:

 మే 15 – లక్నో సూపర్ జెయింట్స్‌పై
 మే 18 – సన్ రైజర్స్ హైదరాబాద్‌పై
 మే 21 – గుజరాత్ టైటాన్స్‌పై

ప్లేఆఫ్స్‌కి safe zone చేరాలంటే CSK కి ఈ మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు విజయాలు తప్పనిసరి. Pressure భారీగా ఉంది… కానీ ధోని presence మాత్రమే టీమ్‌లో confidence ని double చేసే అవకాశం ఉంది.

“అయితే ఫ్రెండ్స్… మీరేమనుకుంటున్నారు?
ధోని నిజంగా IPL 2026 లో comeback చేస్తాడా?
లేక ఇది అభిమానుల ఆశలకే పరిమితమవుతుందా?
మీ prediction ని కామెంట్స్‌లో చెప్పండి!
మరి ఇలాంటి తాజా IPL updates కోసం channel ని subscribe చేసి bell icon press చేయడం మాత్రం మర్చిపోవద్దు!” 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles