భారత జట్టులో చోటు దక్కినా.. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశి గురించి మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది.కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత టీ twenty జట్టులో ఎంపిక కావడం పెద్ద విషయమే. కానీ ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు జట్టులో ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో అవకాశం రాలేదు.
వైభవ్‌కు వెంటనే అవకాశం ఇవ్వాలా? లేక మరికొంత సమయం వేచి చూడాలా? అనే విషయంపై మాజీ ఆటగాళ్లు, అభిమానుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు.పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్ సిరీస్‌లో ఏదో ఒక మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశికి అవకాశం వచ్చే అవకాశం ఉందని తన అభిప్రాయం చెప్పారు.
అయితే అవకాశం ఇవ్వడం కంటే.. అతనితో స్పష్టంగా మాట్లాడటం ఇంకా ముఖ్యమని అన్నారు.టీమ్ మేనేజ్మెంట్, ముఖ్యంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్.. వైభవ్‌కు సరైన సందేశం ఇవ్వాలని సూచించారు.ఒక యువ ఆటగాడితో ఎలా మాట్లాడాలో చాలా జాగ్రత్తగా ఉండాలని పార్థివ్ చెప్పారు.
వైభవ్‌ను ఆడించాలనుకుంటే ఆ విషయము చెప్పాలి. ఒకవేళ ఇప్పుడే అవకాశం ఇవ్వలేకపోతే.. ఆ విషయాన్ని కూడా నేరుగా అతనికి చెప్పాలని అన్నారు.ఎందుకంటే.. అతను ఇంకా 15 ఏళ్ల కుర్రాడు. అలాంటి వయసులో ఉన్న ఆటగాడికి ఓపిక నేర్పించడం, అతని ఆత్మవిశ్వాసాన్ని కాపాడటం కోచ్‌ల బాధ్యత అని పార్థివ్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం భారత జట్టులో ఓపెనింగ్, టాప్ ఆర్డర్లో పోటీ చాలా ఎక్కువగా ఉంది.అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.సంజూ శాంసన్ ఇటీవల జరిగిన టీ twenty ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.ఇక ఇషాన్ కిషన్ ప్రస్తుతం మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఐసీసీ టీ twenty ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
ఈ ముగ్గురు అద్భుతంగా ఆడుతుండటంతో.. ప్రస్తుతం వైభవ్‌కు తుది జట్టులో స్థానం దొరకడం అంత సులభం కాదని పార్థివ్ వివరించారు.అందుకే.. ఈ పరిస్థితిని వైభవ్‌కు స్పష్టంగా చెప్పాలని ఆయన సూచించారు. అలా చేస్తే.. యువ ఆటగాడికి పరిస్థితి అర్థమవుతుంది. అనవసర ఒత్తిడి కూడా ఉండదు.
ఇదిలా ఉంటే.. ఇటీవల భారత్, ఐర్లాండ్ మధ్య జరిగిన టీ twenty సిరీస్‌లో భారత్ రెండు-సున్నాతో అనూహ్యంగా ఓడిపోయింది. ఆ సిరీస్‌లో కూడా వైభవ్ సూర్యవంశికి ఒక్క మ్యాచ్‌లో అవకాశం రాలేదు.ఇక ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ twenty మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే రద్దు కావడంతో.. వైభవ్ అరంగేట్రం మరోసారి వాయిదా పడింది.
అయితే ఇంగ్లండ్‌తో మిగిలిన మ్యాచ్‌ల్లో అతనికి అవకాశం వస్తుందా లేదా అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైభవ్ సూర్యవంశి లాంటి యువ ఆటగాడికి ప్రతిభతో పాటు ఓపిక కూడా చాలా అవసరం.అవకాశం వచ్చినప్పుడు తన ప్రతిభను నిరూపించుకునేందుకు అతను సిద్ధంగా ఉండాలి.


