ఆస్ట్రేలియా ఎతో జరగబోయే సిరీస్‌కు టీమిండియా ఎ జట్టును బీసీసీఐ ప్రకటించింది! అయితే ఈ జట్టులో ఒక పేరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అతనే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా! ఆస్ట్రేలియా ఎ జట్టు భారత పర్యటనలో భాగంగా పుదుచ్చేరిలో ఇండియా ఎతో రెండు మల్టీ డే మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ముందుగా మల్టీ డే జట్టు విషయానికి వస్తే.. దేవదత్ పడిక్కల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో పలువురు యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు.
అలాగే అనుభవం ఉన్న కొంతమంది ఆటగాళ్లతో జట్టును బలంగా తయారు చేశారు. అయితే అసలు ఆసక్తికరమైన విషయం వన్డే జట్టు విషయంలోనే ఉంది! వన్డే జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దేవదత్ పడిక్కల్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. సాయి సుదర్శన్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ ఈ జట్టులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు మాత్రం హార్దిక్ పాండ్యా! హార్దిక్ పాండ్యాను ఇండియా ఎ వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. దీంతో అతని అభిమానుల్లో ఇప్పుడు భారీ ఆసక్తి నెలకొంది. అయితే హార్దిక్ తుది ఎంపిక మాత్రం ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుంది.
అంటే హార్దిక్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని నిర్ధారణ అయితేనే అతను ఆస్ట్రేలియా ఎతో వన్డే సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌లో ఆడితే.. అతని ఫిట్‌నెస్‌ను మరోసారి పరీక్షించుకోవడానికి ఇది మంచి అవకాశం కానుంది. ఇక మ్యాచ్‌ల షెడ్యూల్ విషయానికి వస్తే.. తొలి మల్టీ డే మ్యాచ్ సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు జరుగుతుంది. రెండో మల్టీ డే మ్యాచ్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనుంది. ఆ తర్వాత మూడు వన్డే మ్యాచ్‌లు అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో పుదుచ్చేరిలోనే జరుగుతాయి.
మొత్తానికి ఆస్ట్రేలియా ఎతో జరగబోయే ఈ సిరీస్ ఇండియా ఎ యువ ఆటగాళ్లకు ప్రతిభను నిరూపించుకునేందుకు మంచి అవకాశం. అదే సమయంలో హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై కూడా అందరి చూపు ఉండనుంది. మరి హార్దిక్ పాండ్యా ఫిట్‌గా ఉండి ఈ సిరీస్‌లో బరిలోకి దిగుతాడా? అతని రీఎంట్రీ ఎలా ఉండబోతుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది!


