Top 5 This Week

Related Posts

18 ఏళ్ల తర్వాత మళ్లీ స్లాప్‌గేట్! శ్రీశాంత్ vs హర్భజన్ వివాదం మళ్లీ ఎందుకు రేగింది?

2008 ఐపీఎల్… ముంబై ఇండియన్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ ముగిసింది! కానీ మైదానంలో ఆ రోజు జరిగింది మాత్రం ఒక హిస్టరీ! ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ‘స్లాప్‌గేట్’ సంఘటన! హర్భజన్ సింగ్ చేతిలో శ్రీశాంత్ దెబ్బ తినడం… మైదానంలోనే శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకోవడం… క్రికెట్ అభిమానులు ఎవరూ మరచిపోలేరు! ఆ తర్వాత కాలం మారింది! 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ కలిసి గెలిచారు. ఇద్దరి మధ్య అంతా సర్దుమణిగింది అనుకున్నారు. అన్నాతమ్ముళ్లలా మారిపోయారని ప్రపంచం భావించింది…

కానీ, 18 ఏళ్ల తర్వాత ఆ పాత గాయం మళ్లీ తిరగతోడింది! ఈసారి వివాదం మైదానంలో కాదు… కోట్లలో జరిగింది! అసలు వివాదం మళ్లీ ఎలా మొదలైందో తెలుసా? ఇటీవల హర్భజన్ సింగ్ 2008 నాటి స్లాప్‌గేట్ సంఘటనను రీ-క్రియేట్ చేస్తూ ఒక ప్రకటన చేశారు! ఈ ఒక్క యాడ్ ద్వారా భజ్జీ దాదాపు 80 లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు సంపాదించారని ప్రచారం జరిగింది. ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది! ఈ యాడ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోట్ చేయమని హర్భజన్…

శ్రీశాంత్‌ను అడిగారట! దీనితో శ్రీశాంత్ కోపంతో ఊగిపోయారు. ‘మా తల్లిదండ్రులు నాకు క్షమించడం నేర్పించారు, కానీ మరచిపోవడం నేర్పించలేదు!’ అని శ్రీశాంత్ ఘాటుగా స్పందించారు. తన బాధను, గతాన్ని వ్యాపారంగా మార్చుకుని కోట్లు సంపాదించడాన్ని శ్రీశాంత్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు! అంతే కాదు… హర్భజన్‌తో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంటూ, ఆయన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బ్లాక్ చేసేసారు శ్రీశాంత్! వివాదం ఇక్కడితో ఆగలేదు!

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసాయి! ‘ధైర్యముంటే నాతో బాక్సింగ్ రింగ్‌లోకి రా… తేల్చుకుందాం!’ అంటూ హర్భజన్ సింగ్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు శ్రీశాంత్! మరోవైపు హర్భజన్ సింగ్ ఈ విషయంపై పలుమార్లు క్షమాపణలు చెప్పారు. ‘నేను చేసిన అతిపెద్ద తప్పు అది… వందసార్లు క్షమాపణలు చెప్పాను’ అని భజ్జీ అంటుంటే, శ్రీశాంత్ మాత్రం ‘ఇదంతా కేవలం పబ్లిసిటీ డ్రామా, యాక్టింగ్ మాత్రమే’ అని కొట్టిపారేస్తున్నారు! 18 ఏళ్ల కిందట జరిగిన ఒక సంఘటన…

ఇంకా ఇలాంటి మలుపులు తిరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు! గతంలో జరిగిన తప్పును క్షమించి వదిలేయాలా? లేక ఇలా వ్యాపార ప్రకటనగా మార్చడం తప్పా? మీరేమనుకుంటున్నారు? హర్భజన్ సింగ్ చేసింది తప్పా? లేదా శ్రీశాంత్ రియాక్షన్ ఎక్కువైందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్‌లో చెప్పండి! మరిన్ని క్రికెట్ అప్‌డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles