Top 5 This Week

Related Posts

“ఇలా ఎలా జరిగింది?” – టీ20 జట్టు నుంచి తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ తొలిసారి స్పందన

టీ twenty కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్తొ లిసారి స్పందించాడు. తన పేరు జట్టులో లేకపోవడం చూసి తాను ఏం చేశాడో కూడా వెల్లడించాడు. టీ twenty వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా తనను జట్టు నుంచి తప్పించడం తనకు చాలా బాధ కలిగించిందని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ముఖ్యంగా, మరో రెండు సంవత్సరాలు జట్టును ముందుకు తీసుకెళ్తానని తాను అనుకున్నానని తెలిపాడు. అయితే సెలెక్టర్లు వేరే నిర్ణయం తీసుకున్నారు. తన పేరు జాబితాలో లేదని తెలిసినప్పుడు తాను బాధపడకుండా నవ్వానని సూర్యకుమార్ చెప్పాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండటం తనకు అలవాటని తెలిపాడు. కానీ మనసులో మాత్రం ఒక ప్రశ్న తిరుగుతూనే ఉందట. “ఇలా ఎలా జరిగింది? ఇది ఎలా సాధ్యం?” అని ఆలోచించానని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, జట్టును విజయవంతంగా నడిపించిన సమయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదని తెలిపాడు. కొత్త కెప్టెన్‌పై తనకు ఎలాంటి అసూయ లేదని, అతను మంచి ఆటగాడే కాకుండా మంచి వ్యక్తి, మంచి కెప్టెన్ కూడా అని ప్రశంసించాడు. అయితే తన స్థానంలో మార్పు రావడం మాత్రం కొంత నిరాశ కలిగించిందని చెప్పాడు. దాదాపు నెలన్నర పాటు ఇంట్లో ఉన్న సమయంలో ఈ విషయము గురించి చాలా ఆలోచించానని తెలిపాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ధైర్యం చెప్పినా, వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి మరింత కఠినంగా అనిపించిందని చెప్పాడు. ఇక జట్టు ప్రకటించడానికి రెండు మూడు రోజుల ముందు సెలెక్టర్లు తనతో మాట్లాడారని సూర్యకుమార్ వెల్లడించాడు. “ఇక ముందుకు వెళ్లాల్సిన సమయం వచ్చింది” అని చెప్పడంతో తాను ఎలాంటి వాదన చేయలేదని తెలిపాడు. జట్టు కోసం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని, తనకు ఎప్పుడు అవకాశం వచ్చినా ఆడటానికి సిద్ధంగా ఉంటానని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. మరి టీ twenty ల్లో సూర్యకుమార్ యాదవ్ ప్రయాణం మళ్లీ మొదలవుతుందా? అనేది చూడాలి. ఇలాంటి క్రికెట్ అప్‌డేట్స్ కోసం మన ఛానల్‌ను ఇప్పుడే SUBSCRIBE చేయండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles